నిజామాబాద్

ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జూన్ 10: జిల్లాలో రోడ్డుప్రమాదాలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. నేరాలు ఘోరాల గురించి స్థానిక ఎస్‌ఐ అంతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ విలేఖరులతోమాట్లాడారు. రోడ్డుప్రమాదాలు జరుగకుండాపోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో12 మంది మృతి చెందిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిందన్నారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగానే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. రోడ్లపై అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్‌లను, మూల మలుపుల వద్ద సూచికల బోర్డులు ఏర్పాటు చేసేందుకోసం ఆర్‌అండ్‌బి అధికారులు, పంచాయత్‌రాజ్ అధికారులతోచర్చించి రాత్రి సమయంలోఅవసరమున్నచోట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ద్విచక్రవాహన దారులు హెల్మెట్‌లు తప్పకుండా ధరించాలన్నారు. వాహన దారులు హెల్మెట్ ధరించకుంటే గంట సేపు రోడ్డుపై నిల్చుండబెట్టి రోడ్డుప్రమాదాలపై అవగాహన కల్పించడంజరుగుతోందని అన్నారు. ఆటోడ్రైవర్ ప్రక్కన సీట్లను తొలగించే కార్యక్రమం జిల్లావ్యాప్తంగా 80శాతం పూర్తిచేశామన్నారు. మరో 20 శాతం త్వరలోపూర్తిఅయ్యేలాకృషి చేస్తున్నామన్నారు. ద్విచక్రవాహన దారులు సెల్‌ఫోన్‌లోమాట్లాడుతూ వాహనం నడిపితే జరిమానాలు విధించడం జరుగుతోందన్నారు.