నిజామాబాద్

కొత్త జిల్లా ఏర్పాటుపై అధికారులు తలమునకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 10: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తెరాస ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో సమగ్ర నివేదికను అందించేందుకు ఆయా జిల్లాల అధికారులు సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాను రెండుగా విభజిస్తూ, నూతనంగా కామారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైంది. ఈ నెల 7, 8వ తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందడంతో నూతనంగా ఏర్పాటవుతున్న జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి ఈ నెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కలెక్టర్ యోగితారాణా శుక్రవారం జిల్లా కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమావేశమై కామారెడ్డిలో ఉన్న సదుపాయాలు, ఏర్పాట్లు చేయాల్సిన అదనపు సౌకర్యాలు ఏమిటి తదితర అంశాలపై చర్చించారు. జిల్లా కేంద్రంగా అవతరించబోతున్న కామారెడ్డి పట్టణంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలు ఏమిటి?...ఏయే శాఖలకు కార్యాలయాలు లేవు? ఒకవేళ ఉంటే అవి అద్దె భవనంలో కొనసాగుతున్నాయా? లేక సొంత భవనాలా? మునుముందు జిల్లా కేంద్రంగా మారిస్తే అదే కార్యాలయం ద్వారా శాఖాపరమైన పాలన కొనసాగించేందుకు అనువైన పరిస్థితి ఉందా? లేక ఇతర చోటికి మార్చాలా? తదితర అన్ని అంశాలపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకుంటూ పూర్తి సమాచారంతో సమగ్ర నివేదికను సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందించనున్న దరిమిలా, ఒకటిరెండు రోజుల్లోనే తమకు వివరాలు తెలియజేయాలని సూచించినట్టు సమాచారం. కామారెడ్డిలో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను ఆధునీకరించేందుకు అవకాశం ఉందా? లేక డివిజన్ నుండి జిల్లా కార్యాలయం స్థాయికి చేరితే ఏకంగా భవనానే్న మార్చాల్సి ఉంటుందా? అందుబాటులో ఉన్న సిబ్బంది, ఫర్నీచర్, సిస్టమ్స్ తదితర పూర్తి వివరాలను పొందుపర్చాలన్నారు. ఇలా ఆయా శాఖల వారీగా వచ్చే వివరాలను క్రోఢీకరించి జిల్లా యంత్రాంగం సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది. వాస్తవానికి కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సమయంలోనే జిల్లా యంత్రాంగం కామారెడ్డి ప్రాంతంలో అందుబాటులో ఉన్న వౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ మిగులు భూమి తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుతం జిల్లా ఏర్పాటుపై దాదాపు స్పష్టత వచ్చిన దరిమిలా పూర్తి వివరాలను పక్కాగా సమర్పించేందుకు కసరత్తులు కొనసాగిస్తోంది. ఈ మేరకు ఆయా శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు కామారెడ్డికి చేరుకుని అక్కడ అందుబాటులో ఉన్న వనరులు, ప్రస్తుత స్థితిగతులు, జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే కల్పించాల్సిన సదుపాయాలు, చేకూర్చాల్సిన అదనపు హంగులు తదితర వాటి గురించి పరిశీలన జరిపి కలెక్టర్‌కు నివేదికలు సమర్పించడంలో తలమునకలైనట్టు తెలుస్తోంది. కామారెడ్డి పట్టణంలో కలెక్టరేట్‌తో పాటు జిల్లా కార్యాలయాలు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించేందుకు జె.సి రవీందర్‌రెడ్డి శుక్రవారం కామారెడ్డిని సందర్శించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి కూడా కామారెడ్డికి చేరుకుని నూతన భవన నిర్మాణాల నమూనాలపై జె.సితో సమావేశమై చర్చించారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి కలెక్టరేట్ ప్రాంగణంలోనే దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినట్టుగానే భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం మీద కామారెడ్డిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో వౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది.