ఓ చిన్నమాట!

నోట్‌బుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని డైరీలు, నోట్‌బుక్స్ అప్పుడప్పుడు కన్పించి మనలని ఎక్కడికో తీసుకెళ్తాయి..
మొన్నీ మధ్య పుస్తకాలని సర్దుతుంటే డిగ్రీ చదువుతున్నప్పుడు నేను రాసుకున్న ఓ నోట్‌బుక్ కన్పించింది. దాన్నిండా పజిల్స్, ప్రశ్నలు వాటి జవాబులు. కాలేజీలో కన్పించిన ఓ పుస్తకం నుంచో, పత్రికల్లో వచ్చిన వాటి ఆధారంగా తయారుచేసిన పుస్తకం అది.. పజిల్స్‌ని పూర్తి చేయడం అప్పుడు ఆసక్తికరంగా ఉందేమో.. దాని చివర్లో ఏదో కవిత కన్పించింది. ఇంకా తిరగేస్తే ఏవో కొటేషన్సు కన్పించాయి.
ఈ వ్రాతల వెనక ఉన్న ఆసక్తితోపాటూ నా చేతివ్రాతను కూడా చూస్తూ వుండిపోయాను. ఇప్పటి తరం రాయడం తగ్గించి వేశారు. దేన్నైనా వాళ్లు టైప్ చేస్తున్నారు. వాళ్లకి తమ రఫ్ నోట్‌బుక్స్ దొరకడం కష్టమే.
ఈ రఫ్ నోట్‌బుక్ తిరగేస్తుంటే ఏదో పాతడైరీ కన్పించింది. అందులో ఇంటి ఖర్చులు కన్పించాయి. అప్పటి ధరలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆలోచనల్లో పడేశాయి.
మొన్న ఓసారి తిరగేస్తుంటే నా జీతం వివరాలు రాసి వున్న పుస్తకం కన్పించింది. ప్రతి నెలా నా జీతం వివరాలని, డి.ఏ. తదితర వివరాలని అందులో పొందుపరిచేవారు. నేను మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నా జీతం బేసిక్ 1150 రూపాయలు.
మరి ఇప్పుడు-?
ఇంట్లో పుస్తకాలు డైరీలు ఎక్కువ అయిపోతున్నాయని బయట పడేస్తూంటాం. కానీ వీటిల్లో ఒక్క జ్ఞాపకాలే కాదు, వినోదం వుంది. విజ్ఞానం వుంది. అన్నింటికీ మించి గొప్ప ఆకర్షణ వుంది.
చదివితే ఎంతో జీవితం వుంది.
మన అభిప్రాయాలు, అంచనాలు, చేతివ్రాతలు అప్పటి పరిస్థితి ఎన్నో మన కళ్ల ముందు కదలాడుతాయి.
పాత వాటిని చింపివేసే ముందు, బయటపడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.
ఏదైనా కొంతకాలం గడిస్తే కానీ బోధపడదు.
రఫ్ పుస్తకాల విలువ, పాత నోట్ పుస్తకాల విలువ, డైరీల విలువ ఇప్పుడు అర్థం కాదు. గడిచిన తరువాతే అర్థమవుతుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001