జాతీయ వార్తలు

అధికారుల అలసత్వం వల్లే భారీ నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవాల నిర్ధారణకు దర్యాప్తు కమిషన్ వేయాలి చెన్నై వర్ష బీభత్సంపై ప్రతిపక్షాల డిమాండ్

చెన్నై, డిసెంబర్ 10: చెన్నై మహానగరాన్ని కుదిపేసిన కుండపోత వర్షాలు, వరదల పరిస్థితిని తమిళనాడు ప్రభుత్వం ఎదుర్కొన్న తీరును ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె తదితర పార్టీలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ముఖ్యంగా చెంబరంబాక్కం రిజర్వాయర్‌నుంచి అదనపు నీటిని విడుదల చేసిన తీరును ఆ పార్టీలు తప్పుబట్టాయి. కుండపోత వర్షాలకు తోడు రిజర్వాయర్‌నుంచి ఒక్కసారిగా 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంవల్లే నగరంలో పరిస్థితి దారుణంగా తయారైందని డిఎంకె, సిపిఎం పార్టీలు విమర్శించాయి. భారీ వర్షాలు కురవడం గురించి వాతావరణ విభాగం ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పరిస్థితి గురించి ముఖ్యమంత్రి జయలలితకు సరిగా వివరించలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ డిఎంకె కోశాధికారి, పార్టీ అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్ అన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగిందని, చెంబరంబాక్కం రిజర్వాయర్‌నుంచి ఒక్కసారిగా 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత విషమించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందువల్ల వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి ఒక దర్యాప్తు కమిషన్‌ను నియమించాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు.
ఈ ఉపద్రవానికి అధికారుల అలసత్వమే కారణమని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి జి రామకృష్ణన్ అంటూ, వరద నీటిని విడుదల చేయడంలో అధికారుల అలసత్వం కారణంగానే ఇంత భారీ నష్టం సంభవించిందన్నారు. అందువల్ల వాస్తవాలు తెలుసుకోవడానికి, బాధ్యులెవరో తేల్చడానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక దర్యాప్తు కమిషన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేసారు. ఇలాంటి జలప్రళయం మరోసారి సంభవించకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రధానమంత్రికి లేఖలు రాసినంతమాత్రాన వర్షాల అనంతరం తలెత్తిన పరిస్థితి పరిష్కారం కాదని, తగిన ఫలితాలు సాధించడానికి కేంద్రంపై రాజకీయ ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందని పిఎంకె వ్యవస్థాపకుడు ఎస్ రాందాస్ అన్నారు.