జాతీయ వార్తలు

హోదాపై ఎన్‌డిఏ నాన్పుడు ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టించుకోని చంద్రబాబు
ఎంపీలు కెవిపి, సుబ్బరామిరెడ్డి, జెడి శీలం ధ్వజం
రాష్టప్రతికి కోటి సంతకాలు సమర్పించనున్న ఏపిపిసిసి నేతలు
మోదీ హామీని గుర్తుచేసేందుకే ఢిల్లీ టూర్ అని వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కె.వి.పి.రామచందర్‌రావు, టి.సుబ్బరామిరెడ్డి, జె.డి.శీలం దుయ్యబట్టారు. రామచందర్‌రావు నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదిస్తే, పది సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు వౌనం పాటిస్తున్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించటంతోపాటు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించి, కేంద్ర ప్రణాళికా సంఘానికి పంపించినప్పటికీ, బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఇదంతా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌తో ఆడుకుంటోందని రామచందర్‌రావు దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎదుర్కొంటామంటూ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కోటి సంతకాలతో కూడిన పత్రాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వనున్నట్లు ముగ్గురు నాయకులు చెప్పారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ దాదాపుగా ఖరారైందని, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదన్నారు. రాష్టప్రతి వద్దకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉన్నదని రామచందర్‌రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి కోటి సంతకాలతో బయలుదేరిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మూడు వందల మంది నాయకులు, కార్యకర్తలు కోటి సంతకాలతోపాటు ప్రతి ఒక్కరు పిడికెడు మట్టి, ఒక గ్లాస్ నీరు పట్టుకొస్తున్నారని వారు తెలిపారు. కోటి సంతకాలను రాష్టప్రతికి అందజేసిన తరువాత మట్టి, నీటిని ఎన్‌డిఏ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరిద్దరితోపాటు పలువురు ఇతర సీనియర్ నాయకులు, మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి వివరిస్తామని రామచందర్‌రావు, శీలం, సుబ్బరామిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి చిన్న పనికి ఢిల్లీకి వస్తారు కానీ ప్రత్యేక హోదా కోసం మాత్రం పట్టుబట్టటం లేదని వారు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసేందుకే ఏపిసిసి నాయకులు ఢిల్లీకి వస్తున్నారని వీరు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యే క ప్యాకేజీలు ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు.
(చిత్రం) గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జె.డి.శీలం, చిత్రంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కె.వి.పి.రామచందర్‌రావు, టి.సుబ్బరామి రెడ్డి