AADIVAVRAM - Others

అసమానత (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహా పురుషులెవరయినా ఏవో కథలు చెబుతారు. కథల ద్వారా చెబితే పిల్లలకయినా పెద్దలకైనా మనసుని హత్తుకుంటుంది.
జీసెస్ ఈ పిట్టకథని చెప్పేవాడు.
ఒక సంపన్నుడికి ఒక పండ్లతోట ఉంది. చాలా పెద్దది. విరగపడింది. ఎన్నో రకాలైన పళ్లతో తోట కళకళలాడుతోంది. పళ్లు కోయడానికి పది మంది మనుషుల్ని మాట్లాడాడు. కూలి ఎంతో ముందుగానే మాట్లాడాడు. వాళ్లు అడిగిన దానికన్నా ఉదారంగా రెండింతలు ఇస్తానన్నాడు. వాళ్లు ఎంతో సంతోషించారు. ఉత్సాహంగా వచ్చారు. ఉత్సాహంగా పని మొదలుపెట్టారు. ఆ పళ్ల తోట దాదాపు రెండు ఎకరాలు విస్తరించి ఉంది. కూలీలు పళ్లు కోస్తున్నారు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండ మండిపోతోంది. పనివాళ్లు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. యజమాని వాళ్లకు చల్లటి నీళ్లు, చక్కటి భోజన వసతులు కల్పించాడు. వాళ్లు భోజనం చేస్తూ ఉండగానే ఇంకో పదిమంది కూలీలు తోటలోకి వచ్చారు. వాళ్లు కూడా పని ప్రారంభించారు. ఇంకో వేపు వెల్లి చెట్ల నుండీ పళ్లు కోసి కుప్పలు వేయడం మొదలుపెట్టారు.
మొదట వచ్చిన పది మంది భోజనం ముగించి మళ్లీ పళ్లు కోసే పనిలో పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలయింది. ఇంత మంది చేసినా చీకటి పడేలోగా తోటలోని చెట్లలో పళ్లన్నీ కొయ్యడం వీలు కాని పని అని యజమాని గ్రహించాడు. వెంటనే ఊళ్లోకి వెళ్లి అరగంటలో ఇంకో పది మందిన తీసుకొచ్చాడు.
మొత్తానికి ముప్పై మంది కలిసి చీకటి పడేలోగా తోటలో పళ్లన్నీ తెంపి కుప్పవేశారు. వాటిని సంచుల్లో నింపి బళ్లకెత్తారు. బళ్లు వెళ్లిపోయాయి.
యజమాని ముప్పై మందిని సమావేశ పరచి అందరికీ సమంగా కూలీ ఇచ్చాడు. మొదటి పది మంది ‘ఇది అన్యాయం. మాకు ఎంత కూలీ ఇచ్చారో మా తరువాత వచ్చిన వాళ్లకు, ఆ తరువాత వచ్చిన వాళ్లకూ కూడా అంతే కూలీ ఇవ్వడం అన్యాయం’ అన్నారు.
యజమాని నవ్వి ‘మొదట మీరు ఎంత కూలీ అడిగారు? మీరు ఎంత అడిగితే దానికి రెట్టింపు నేను ఇస్తానని మీతో అన్నాను కదా! మీరు తీసుకున్న కూలీతో మీరు సంతృప్తి పడ్డారా? లేదా?’ అని అడిగాడు. వాళ్లు ‘మీరు మాకు ఎక్కువ ఇచ్చారు. కానీ...’ అన్నారు. యజమాని ‘కానీ’ అన్నది మీకు సంబంధించింది కాదు. అది నాకు సంబంధించిన విషయం. నేను వాళ్లకు ఇవ్వదలుచుకున్నంత ఇస్తాను. దానికి మీరు ఈర్ష్య పడటం దేనికి?’ అన్నాడు.
సంస్కారమున్న వాళ్లు, శీలవంతులు, ధర్మబద్ధులు వాళ్ల శ్రమకు ఫలితం పొందుతారు. కానీ ఆనందంగా వున్న వాళ్లు, ప్రేమించే వాళ్లు అవసరానికి సాయపడ్డవాళ్లు, కావాల్సినప్పుడు సాయపడ్డ వాళ్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని జీసెస్ భావన. *

- సౌభాగ్య, 9848157909