AADIVAVRAM - Others

తృప్తి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఒక ఊళ్లో ఓ ధనవంతుడు ఉన్నాడు. అతను ఎంతో ఆస్తిని సంపాదించాడు.
అలా సంపాదించిన ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు.
అయితే అంతకు కొద్ది సంవత్సరాల క్రితం వ్యాపార పనుల నిమిత్తం కాశీ క్షేత్రం మీదుగా వెళుతూ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వ్యాపారంలో బాగా కలిసొస్తే నడచి కాశీకి వస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఆ వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది.
కానీ కాలక్రమేణా తను మొక్కిన మొక్కు మరచిపోయాడు.
ఇప్పుడు ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి చెయ్యాల్సిన పనులూ, తీర్చాల్సిన మొక్కులూ ఏమైనా ఉన్నాయా అని గుర్తు తెచ్చుకోసాగాడు. అప్పుడు కాశీకి నడచి వస్తానన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. దాంతో కొద్దిమంది మిత్రుల్ని వెంట తీసుకుని కాలినడకన కాశీ బయలుదేరాడు.
అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇక కాశీ పట్టణానికి చేరుకుంటామనగా దారి పక్కన చెట్టుకు కట్టి వేసిన ఓ రేకు కనిపించింది. దాని మీద ‘గంగకు దగ్గర దారి’ అని రాసి ఉంది.
దాన్ని చూసి ‘ఈ దారిలో వెళితే త్వరగా కాశీ క్షేత్రం చేరుకోవచ్చు కదా’ అని మిత్రులతో అని అటుగా నడకను ప్రారంభించాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి ఆ దారి అక్కడితో ఆగిపోయింది. ఇదేమిటని చుట్టూ చూశాడు. దారి లేదు సరికదా జనసంచారం కూడా లేదు. బాగా పరికించి చూసేసరికి అక్కడికి దగ్గర్లో పూరి గుడిసె వాళ్లకి కనపడింది. పక్కనే పండ్లతో నిండుగా మామిడి చెట్టు.
ఎవరైనా ఉన్నారేమోనని పాకలోకి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక అవ్వ ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె చుట్టూ గంపల కొద్దీ మామిడి పళ్లు.
‘రండి నాయనా లోనికి’ అంది అవ్వ ఆప్యాయంగా. లోనికెళ్లారంతా. ఆ మాటా ఈ మాటా అయ్యాక-
‘అసలు దారే లేదు కదా..? మరి చెట్టుకి ఆ రేకు ఎవరు కట్టారో?’ అన్నాడు సందేహంగా.
‘నేనే కట్టాను. ఇక్కడ ఎన్నో మామిడి పళ్లున్నాయి. ఆ రకంగా రాస్తే ఇటు వస్తారని, మామిడి పళ్లు తింటారని రాసాను. పెద్ద దూరం కాదు కదా...’
‘అవునా?’ మనసులో అనుకుని వెనక్కి తిరగబోతుంటే అందర్నీ మామిడి పళ్లు తీసుకొమ్మంది. తలో రెండూ తీసుకున్నారు.
ధనవంతుడు మాత్రం మరి కొన్ని ఎక్కువ తీసుకుని వెనుదిరగబోతుంటే అవ్వ అంది.
‘ఆశ అశాంతిని పెంచుతుంది నాయనా..’ అంది అతనితో.
అర్థం కాక అయోమయంగా చూశాడు ధనవంతుడు. దాంతో అవ్వ అంది
‘నీలో ఆశ చావలేదు. ఆశ ఎక్కువయ్యే కొద్దీ బరువూ, భారమూ, శ్రమా.. పెరుగుతుంది. మనలో ఆశ ఇంకా మిగిలే ఉన్నప్పుడు విశ్రాంతి అశాంతినే మిగులుస్తుంది’
ఆలోచిస్తున్న కొద్దీ ఆమె మాటల్లోని అర్థం గోచరించి నిజమే సుమా అనుకున్న ధనవంతుడు మిత్రులను వెనక్కి పంపించేసి ఆమె వద్దే సన్యాసం స్వీకరించాడు.

-కనె్నగంటి అనసూయ