AADIVAVRAM - Others

డిగ్రీ పట్టాల పార్తిబన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకబిగిన 140 కోర్సులు పూర్తిచేసిన
చెన్నై ప్రొఫెసర్
విద్యే మానవుని ఉన్నతికి అసలైన మార్గం. విద్యను నమ్ముకున్న వాళ్లెవరూ చెడిపోలేదు. విద్య ద్వారా కీర్తికనకాలనే కాదు మనల్ని మనం సంపూర్ణ మానవులుగా కూడా మలచుకోవచ్చు. ఈ కారణం చేతే కొంత మంది అదే పనిగా చదువుతుంటారు. ఒకటి రెండు విభిన్న అంశాల్లో డిగ్రీలు సాధిస్తారు. అటువంటి వారిని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది ఏకంగా 140 డిగ్రీలు సాధించిన వ్యక్తి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోక మానం. ఆ వ్యక్తే చెన్నయ్‌కి చెందిన వి.ఎన్. పార్తిబన్. ఆయన చెన్నయ్‌లో ఒక కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కళాశాలలో చదివే విద్యార్థులతో పాటు ఆయన కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే కనిపిస్తారు. ముప్ఫై ఏళ్ల నుండి ఇదే ఆయన పని. 140 డిగ్రీలంటే దాదాపు దేశంలో ఉన్న అన్ని కోర్సుల్లోను ఆయనకు ప్రవేశం ఉన్నట్లే. అయినా ఆయన విద్యాతృష్ణ తీరలేదట. ఇప్పటికీ ఆయన తనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి, తెలుసుకున్న తర్వాత దానిలో పట్ట్భద్రుడు కావడానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాడట. 18 ఏప్రిల్ 1961లో చెన్నైలో జన్మించిన ఆయన చిన్నతనం నుండి చదువులో చురుగ్గా ఉండేవారు. చదువు పూర్తయిన తర్వాత ఆయన చెన్నైలోని రామకృష్ణా మిషన్ వివేకానంద కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. ఆయన ఎక్కువ డిగ్రీలను కామర్స్‌కు సంబంధించిన విభాగంలో సాధించారు. బిఎ, ఎఫ్‌సిఎంఎ, ఎఫ్‌సిఎస్, సిపిఎ, పిజిడిపిఎల్, ఎల్‌ఎల్‌ఎం, ఎంఎస్, సిపిఎ, సిఎ, అలాగే 8 మాస్టర్ ఆఫ్ లా డిగ్రీలు, 10 మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలు, 8 మాస్టర్ ఆఫ్ కామర్స్ డిగ్రీలు, 12 ఎంఫిల్ డిగ్రీలు, 3 మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు, 9 మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీలు సాధించి ఔరా అనిపించారు. ఆయన గడచిన ముప్ఫై ఏళ్ల కాలంలో చెన్నయ్‌లోని వందలాది కళాశాలల్లో ఉపన్యాసకుడిగా పని చేశారు. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త సబ్జెక్టుల్లో డిగ్రీలు చేయడమే తనకు ఉత్సాహానిస్తుందని పార్తిబన్ అంటారు. అందుకే ఆయన వీకెండ్ పార్టీలు, సరదాలు, సినిమాల కంటే చదువుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. సెలవు రోజుల్లో కూడా పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు. తన మైండ్‌సెట్ అంతా చదువు మీదే కేంద్రీకృతమై ఉంటుందని ఆయన చెబుతుంటారు. తన ఎగ్జైట్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ అంతా చదువే అని ఆయన చెబుతుంటారు. ఈ విధంగా చదువుకే తన జీవితాన్ని అంకితం చేయడాన్ని తానేదో త్యాగం చేస్తున్నట్లు అనుకోవడం లేదని అతనంటున్నారు. తెలుసుకుంటున్న ప్రతి కొత్త విషయం తనకు నూతనోత్తేజాన్ని ఇస్తుందని, దాని నుండి స్ఫూర్తి పొంది మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి కృషి చేస్తుంటానని అతనంటున్నారు. ఆయన డిగ్రీల్లాగే ఆయన అందుకున్న అవార్డులు, సత్కారాల సంఖ్య కూడా పెద్దదే. చెన్నైలోనే కాకుండా ఇతర ప్రాంతాల కళాశాలలు, విద్యా సంస్థలు కూడా ఆయన విద్వత్తును గౌరవిస్తూ అనేక పురస్కారాలు అందజేశాయి. కష్టపడితే సరస్వతీ కటాక్షం పొందడం కష్టమేమీ కాదని, సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం దానంతట అదే ఒనగూడుతుందని, అందుకే ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ఆయన చెబుతున్నారు.

- దుర్గాప్రసాద్ సర్కార్