AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు ఆశే్లషతో పాటు వాడి అమ్మమ్మ మీనమ్మ కూడా హరికథకి వెళ్లింది. హరిదాసు కథని ఇలా కొనసాగించాడు.
దశరథుడు సభలో గంభీరమైన స్వరంతో ఇలా చెప్పాడు.
‘ఉత్తమ రాజులైన ఇక్ష్వాకు వంశీయులు, మా పూర్వీకులు ప్రజలని తమ బిడ్డలుగా పాలించిన సంగతి మీకు తెలుసు. నేను కూడా వారి మార్గానే్న అనుసరించి మిమ్మల్ని జాగ్రత్తగా రక్షిస్తున్నాను. రాజ్యభారం చాలా బరువైంది. పరాక్రమం, ధైర్యాలతో ఆ భారాన్ని భరించాలి. ఇంద్రియ నిగ్రహం లేనివారు దీన్ని మోయలేరు. మోసి మోసి నేను అలసిపోయాను. ఎన్నో ఏళ్ల ఆయుష్షు గల నా దేహం ప్రజలు హితం కోసం రాజ్యం చేస్తూనే, బంగారు గొడుగు కిందే ముసలిదై పోయింది. అందువల్ల దీనికి విశ్రాంతిని ఇద్దామని అనుకుంటున్నాను. వశిష్ఠుడు, ఇతర ఉత్తమ బ్రాహ్మణుల అంగీకారంతో ప్రజా పాలనకి నా కొడుకుని నియమించి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. నా పెద్ద కొడుకు రాముడు పరాక్రమంలో ఇంద్రుడితో సమానం. శత్రువులని జయించడంలో, మిగిలిన అన్ని గుణాల్లో నన్ను పోలి ఉన్నాడు. ధర్మసంరక్షణలో ఆశే్లషా నక్షత్రంతో కూడిన చంద్రుడిలా ప్రకాశించే రాముడికి సంతోషంగా పట్ట్భాషేకం చేస్తాను. రాముడు మూడు లోకాలకి కూడా మంచి రాజు అవుతాడు. నేను ఇది బాగా ఆలోచించే చెప్తున్నాను. ఇది మంచిదని మీకు కూడా తోచి అనుమతిస్తే, అది నేను ఎలా చేయాలో చెప్పండి. ఇది కాక ఇంకో మంచి మార్గం ఉంటే సూచించండి. ఎందుకంటే పక్షపాతం లేని మధ్యస్తులది ఎక్కువ అభ్యుదయం గల ఆలోచన అవుతుంది.’
వెంటనే సభలోని అంతా ‘బావుంది, బావుంది’ అని చెప్పారు. బ్రాహ్మణులు, రాజులు, నగర, గ్రామ వాసులు కలిసి ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చాక దశరథుడితో ఇలా చెప్పారు.
‘మహారాజా! నువ్వు ఎన్నో వందల సంవత్సరాల వయసు గల వృద్ధుడివి. అందువల్ల రాముడికి పట్ట్భాషేకం చెయ్యి. రాముడు పట్ట్భాషిక్తుడు అయ్యాక ఏనుగు అంబారీ మీద తెల్లటి గొడుగు కింద వెళ్తూంటే చూడాలని మేమంతా కోరుకుంటున్నాం.’
‘రాముడు రాజవ్వాలి అనే నా కోరికకి ఎదురుచెప్పలేక ఇలా చెప్పారా?’ అనే అనుమానం నాకు కలుగుతోంది. కాబట్టి నిజంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. నేను ధర్మంగా పాలిస్తున్నప్పుడు రాముడు రాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?’ దశరథుడు వారిని ప్రశ్నించాడు.
‘రాజా! రాముడిలో అంతులేని మంచి గుణాలు ఉన్నాయి. దేవతలతో సమానుడు, బుద్ధిమంతుడు అయిన నీ కొడుకు గుణాలన్నీ అందరికీ ఇష్టమైనవి. వాటిని చెప్తాను. విను. దివ్య గుణాలు కలవాడు. దేవేంద్రుడితో సమాన పరాక్రమం గల, సత్యం, ధర్మం పాటించే రాముడు ఇక్ష్వాకు రాజుల్లో అందరికంటే గొప్ప సత్పురుషుడు. లక్ష్మిని ధర్మానికి దూరం కాకుండా చేయగలడు. (అధర్మం ఉన్నచోట లక్ష్మి ఉండదు) ప్రజలకి ఆనందం కలిగించడంలో భూమితో, క్షమలో చంద్రుడితో, బుద్ధిలో బృహస్పతితో, పరాక్రమంలో దేవేంద్రుడితో సమానుడు. అన్ని ధర్మాలు తెలిసిన ఓర్పుగల ఉత్తమ శీలవంతుడు. దుఃఖించే వారిని ఓదారుస్తాడు. మృదువైన వాడు. కృతజ్ఞత, ఇంద్రియ నిగ్రహం కలవాడు. వివిధ శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులని పూజిస్తాడు. దేవతలకి, రాక్షసులకి, మానవులకి తెలిసిన అన్ని అస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు. విద్యావంతుడు. వేదాన్ని, సంగీతాన్ని చక్కగా అధ్యయనం చేశాడు. రాముడి బంధువర్గంలోని వాంరతా ఉత్తములు. రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళ్లినప్పుడు జయంతోనే తిరిగి వస్తాడు. యుద్ధం నించి తిరిగి వచ్చాక రథమో, ఏనుగో ఎక్కి పౌరుల దగ్గరకి వెళ్లి తండ్రి కొడుకుని అడిగినట్లో లేదా తన బంధువులని అడిగినట్లో అందర్నీ కుశల ప్రశ్నలు వేస్తాడు. ‘సేవకులు (ప్రభుత్వాధికారులు) తమ పనులని శ్రద్ధగా చేస్తూ మీకు సేవ చేస్తున్నారా?’ అని అడుగుతాడు. ఎవరికైనా ఆపద కలిగితే విచారిస్తాడు. ఎవరికి అభివృద్ధి కలిగినా తన కొడుక్కి కలిగిన అభివృద్ధిని చూసి తండ్రి సంతోషించినట్లుగా సంతోషిస్తాడు. రాముడు అన్ని విధాలా ధర్మాన్ని రక్షిస్తాడు. పోట్లాటలు పెంచే మాటలు మాట్లాడడు. తనని ఆశ్రయించిన వారికి మేలు చేస్తాడు. యుక్తిగా మాట్లాడటంలో బృహస్పతి లాంటి వాడు. ప్రజలని పాలించడంలో మెలకువలు తెలిసినవాడు. భోగంతో చెడు మార్గం పట్టనివాడు. రాముడు మూడు లోకాలని పాలించే సమర్థత కలవాడు. ఇక భూలోకం సంగతి చెప్పాలా? రాముడికి కోపం కాని, ఆగ్రహం కాని వస్తే అవి నిష్ఫలం కావు. నియమం ప్రకారం చంపాల్సిన వారిని చంపి తీరుతాడు. రాముడు ఎవరి విషయంలో సంతోషిస్తాడో వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. దశరథ మహారాజా! నీ పూర్వ పుణ్యం వల్ల రాముడు నీ కొడుకుగా లోకశ్రేయస్సు కోసం పుట్టాడు. ప్రజా పతుల్లో ఒకరైన మరీచికి కొడుకైన, సప్త ఋషుల్లో ఒకడైన కాశ్యపుడికి ఉన్నట్లుగా కొడుక్కి ఉండాల్సిన అన్ని మంచి గుణాలు రాముడికి ఉండటం నీ భాగ్యం. దేవతలు, అసురులు, మనుషులు, గంధర్వులు, ఉరగుల్లో ఖ్యాతి గల రాముడికి ఆయురారోగ్యాలు, బలం కలగాలని దేశ ప్రజలు, రాజధానిలో నివసించేవారు ఆశిస్తున్నారు. వృద్ధ మహిళలు, యువతులు కూడా రాముడి అభివృద్ధి కోసం ఉదయం, సాయంత్రాలు సకల దేవతలని పూజిస్తున్నారు. నీ అనుగ్రహంతో ప్రజల కోరిక తీరుతుంది. శతృసంహారకుడు ఐన రాముడి పట్ట్భాషేకాన్ని మేమంతా చూస్తాం. ప్రజల కోరికలని తీర్చే నువ్వు మా హితం కోసం, అన్ని లోకాలకి మంచి చేసే ఆసక్తి గల, ఉత్తమ గుణ సంపన్నుడైన నీ కొడుకు రాముడికి సంతోషంగా పట్ట్భాషేకం చేయి’ వారు చెప్పారు. (అయోధ్యకాండ సర్గ 2)
హరికథ విన్నాక మీనమ్మ లేచి చెప్పింది.
‘కథని బాగా చెప్పారు. కాని మీరు కొన్ని తప్పులు చెప్పారు. చిన్నప్పటి నించి వాల్మీకి రామాయణం వందల సార్లు పారాయణం చేయడం వల్ల నాకు ఆ తప్పులు తెలిసాయి. వాటిని చెప్తాను వినండి.’
*
మీకో ప్రశ్న
*
సప్త ఋషులు
ఎవరు?

*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
అబద్ధం ఆడమని రాముడు ఎవరికి ఏ కాండలో సలహా ఇచ్చాడు?
-అయోధ్యకాండలో. తనని అడవిలో దింపడానికి వచ్చిన మంత్రి సుమంత్రుడితో ‘సారథీ! తిరిగి అయోధ్యకి వెళ్లాక మహారాజు తన మాటని (రామునితో ఉండమని) మన్నించనందుకు కోప్పడితే ‘మహారాజు గారి మాట నీకు వినిపించలేదని చెప్పు’ అని అబద్ధం ఆడమని సలహా ఇచ్చాడు.
*
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.ఇద్దరి ఇళ్లూ ఒకటే ఐనా, భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్లాడని వాల్మీకి రాశాడు. కాని తాత ఇంటికి వెళ్లాడని హరిదాసు చెప్పాడు.
2.రాముడు తియ్యగా మాట్లాడుతూ ఇతరులని తనే ముందుగా పలకరించేవాడు. ఇది చెప్పటం హరిదాసు విస్మరించాడు.
3.యుక్తుల్లో, సంభాషణల్లో మాటల్లో బృహస్పతి లాంటివాడు అని వాల్మీకి ఉపమానం చెప్పాడు. కాని తప్పుగా హరిదాసు ఇంద్రుడి లాంటి వాడు అని చెప్పాడు.
4.ఎప్పుడు దానం చెయ్యాలో, ఎప్పుడు చేయకూడదో రాముడికి తెలుసు అని వాల్మీకి రాశాడు. కాని దాన్ని బీదలకి దానం చేసేవాడు అని హరిదాసు తప్పుగా చెప్పాడు.
5.సంగీత నృత్యాల్లో రాముడికి ప్రవేశం ఉంది. ఈ సుగుణాన్ని హరిదాసు చెప్పలేదు.
6.పట్ట్భాషేకం గురించి దశరథుడు రాజులని పిలిపించాడు కాని ఆ తొందరలో భరతుడి తాతైన కేకయ రాజుని, వియ్యంకుడైన జనక మహారాజుని దశరథుడు పిలిపించలేదు. వారు తర్వాత తెలుసుకుంటారని అనుకున్నాడు. ఈ ముఖ్య విషయం చెప్పడం హరిదాసు విస్మరించాడు.
7.అయోధ్యకాండలో మొదటి సర్గలోని ఆఖరి 50వ శ్లోకం దాకా హరిదాసు చెప్పాడు. ‘అయోధ్యకాండలోని మిగిలిన కథని రేపు కొనసాగిస్తాను’ అని హరిదాసు చెప్పడం తప్పు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి