AADIVAVRAM - Others

మూడో హారం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం సిరిపురం గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చాలా మంచివారు. కాకపోతే అమాయకులు. ఏ పని చేసినా కలిసి చేసేవారు. వచ్చిన ప్రతిఫలాన్ని సమానంగా పంచుకునేవారు. తృప్తిగా జీవించేవారు. అయితే వచ్చే ఆదాయం చాలకపోవటంతో వ్యవసాయం చేసి సంపాదించుకోవాలి అనుకున్నారు. వారికి పొలం లేదు. జమీందారు వద్ద ఓ ఎకరం పొలం కౌలుకు తీసుకున్నారు. అది బీడు భూమి. బాగు చేయాలంటే చాలా చాకిరీ చేయాలి. కౌలు తక్కువగా ఉండటంతో దానే్న ఖాయం చేసుకున్నారు. బాగు చేయటం మొదలుపెట్టారు. చెట్లన్నీ నరికారు. రాళ్లను తవ్వి తీశారు. ఇలా తవ్వుతున్నప్పుడు ఓ బండ ప్రక్కన భూమికి రెండడుగులు లోతులో మూడు బంగారు హారాలు దొరికాయి. ఆ ప్రాంతం పూర్వం ఓ అగ్రహారం. ఊరు అభివృద్ధి చెందక పోవటంతో అక్కడ ఉండేవారంతా వలసపోయారు. ఇది జరిగి వందల ఏళ్లయింది. ఈ హారాలు ఆనాటివే.
దొరికిన మూడు హారాలలో చెరొకటి పంచుకున్నారు. మిగిలిన ఒక హారంతోనే సమస్య వచ్చింది. కంసాలి వద్దకు వెళ్లి చెరిసగం పంచమని అడుగుదామంటే, విషయం కంసాలికి తెలుస్తుంది. జమీందారుకు చెబుతాడు. పోనీ పట్నం వెళ్లి హారం అమ్మితే, విషయం పొక్కుతుందేమోనని భయం. అందువల్ల మూడో హారాన్ని వారి వద్దే ఉంచుకున్నారు. ఆ హారాన్ని రామయ్య వద్ద ఉంచాడు సోమయ్య. ‘జాగ్రత్త’ అని హెచ్చరించాడు. హారం వచ్చిన దగ్గర నుండి రామయ్యకు నిద్ర కరువయింది. పొద్దస్తమానం దాని చుట్టే ఆలోచనలు. దాన్ని దాచిపెట్టలేక అతలాకుతలం అయ్యాడు. ఒకవేళ పోయిందంటే సోమయ్యకు ఏం చెప్పాలి. నిజంగా పోయినా అబద్ధం ఆడుతున్నాననే అనుకుంటాడు. అందువల్ల ఆ హారానికి తాను కాపలా ఉండలేకపోయాడు. తిరిగి సోమయ్యకు ఇచ్చాడు. అతడినే దాచమన్నాడు. సోమయ్య మొదట సంతోషంగా వొప్పుకున్నా, దాచటం కష్టమైంది. రామయ్యకు కలిగిన కష్టమే కలిగింది. తీసుకొచ్చి రామయ్యకే ఇచ్చాడు. ‘దీని కాపలా మనవల్ల కాదు. కాబట్టి దీన్ని దొరికిన చోటనే దాచేద్దాం. కొంతకాలం గడిచిన తరువాత తిరిగి తీసుకుందాం. అప్పుడైతే ఎవరికీ అనుమానం రాదు’ అనుకున్నారు.
మూడో హారాన్ని మూటలా చుట్టారు. గుంతలో వేసి పూడ్చే ముందు కౌలుకిచ్చిన జమీందారు వచ్చాడు. వారు చేస్తున్న పనేమిటో ఆయనకు అర్థం కాలేదు. మూటకు ముడి వేయక పోవటం చూసి ‘ముడేది’ అన్నాడు. వారు తత్తరపడ్డారు. ఆ తత్తరలో వారికి ‘మూడేవి’ అన్నట్టు వినిపించింది. జమీందారే అక్కడ మూడు హారాలు దాచి ఉంటాడు అనుకున్నారు. వెంటనే ‘మా దగ్గరే ఉన్నాయి’ అన్నారు ఇద్దరూ ఒకేసారి తడుముకోకుండా. జమీందారుకు అర్థం కాలేదు. అయినా అదేదో తెలుసుకోవాలనుకున్నాడు.
‘అయితే తీసుకురండి’ అన్నాడు. ఇద్దరూ ఇంటికి వెళ్లారు.
వారి దగ్గరున్న హారాలు తెచ్చారు. మూటలో వున్న మూడో హారం కలిపి ఆయనకు ఇచ్చారు. జమీందారు వారి అమాయకత్వానికి జాలిపడ్డాడు. వారి నిజాయితీకి కరిగిపోయాడు.
‘సరే! మీరు మంచివారులా ఉన్నారు. మీరే తీసుకోండి’ అని వారి హారాలు వారికే ఇచ్చాడు. మూడో హారం ఆయన తీసుకొని వెళ్లిపోయాడు. ఇక రామయ్య, సోమయ్యలు జమీందారు పొలం కౌలు చేస్తూ కలిసి మెలిసి జీవించారు. మూడో హారం చేరాల్సిన చోటికే చేరింది.

- దార్ల బుచ్చిబాబు