AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న

ఆంధ్రా వాల్మీకి అనే పేరు
ఎవరికి, ఎందుకు వచ్చింది?

హరికథ వినడానికి ఆశే్లష వెంట తల్లి శారదాంబ కూడా వచ్చింది. హారతి ఇచ్చి రాముడికి కొబ్బరికాయ కొట్టాక హరికథకుడు కథని మొదలుపెట్టాడు.
వారంతా చెప్పేది విన్నాక దశరథుడు పురజనులతో ఇలా చెప్పాడు.
‘నాకు ఇష్టుడైన రాముడు రాజు కావాలని మీరంతా కోరడం నాకు సంతోషంగా ఉంది.’
వశిష్ఠుడు, వామదేవుడు, ఇతర బ్రాహ్మణులు వెంటనే ఇలా చెప్పారు.
‘చెట్లు పుష్పించే మార్గశిర మాసం శుభకరమైన మాసం. కాబట్టి ఈ మాసంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయండి.’
అది విన్న వారంతా హర్షధ్వానాలు చేశారు. దశరథుడు అధికారులని ఇలా ఆజ్ఞాపించాడు.
‘బంగారం, రత్నాలు మొదలైనవి, పూజాద్రవ్యాలు, అన్ని ఔషధులు, తెల్లటి పుష్ప మాలలు, పేలాలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథం, అన్ని ఆయుధాలు, చతురంగ సైన్యం, చక్కటి ఏనుగు, తెల్లటి విసనకర్ర, గొడుగు, జెండా, నూరు బంగారు కుండలు, ఎద్దు, పులి చర్మాలని తెల్లారేసరికల్లా అగ్నిహోత్ర గృహంలోకి చేర్చండి. ఇవేకాక ఇంకా అవసరమైన చిన్న వస్తువులని కూడా తీసుకురండి. అంతఃపుర, నగర ద్వారాలని గంధంతో తొడిగి, పూల మాలలతో అలంకరించి సువాసన వచ్చే ధూపాలని వేయండి. వేలకొద్దీ బ్రాహ్మణులకి సమృద్ధిగా సరిపోయే పెరుగు, పాలు, ఇతర ఆహార పదార్థాలు, అన్నాన్ని సమకూర్చండి. వాటితో రేపు బ్రాహ్మణ ముఖ్యులకి సత్కారం చేయాలి. వారికి నెయ్యి, పెరుగు, పేలాలు, దక్షిణలు ఇవ్వాలి. రేపు సూర్యోదయ సమయంలో జరిగే స్వస్థి వచనానికి బ్రాహ్మణులకి తగిన ఏర్పాట్లు చేయించండి. రాజ వీధులని కడిగించి పతాకాలని కట్టించండి. తాళం వేసే నటులని, బాగా అలంకరించుకున్న వేశ్యలని రాజప్రసాదంలోని కక్షకి రప్పించండి. దేవాలయాల్లోని, వీధుల్లోని చెట్ల దగ్గర ప్రజల కోసం అన్నాలు, భక్ష్యాలు, దక్షిణలు, పూలమాలలతో సిద్ధంగా ఉంచండి. యోధులు కవచాలని ధరించి పొడవైన కత్తులతో, శుభ్రమైన దుస్తుల్లో మహారాజ ప్రాసాదం ముంగిట్లో నిలబడాలి’
తర్వాత దశరథుడు రాముడ్ని వెంటనే తీసుకురమ్మని సుమంత్రుడ్ని పంపాడు. ఆయన రాముడి కోసం వెళ్లాడు. తూర్పు, పడమటి, ఉత్తర, దక్షిణ దేశాల రాజులు, మ్లేచ్ఛ దేశాల రాజులు, ఆర్యావర్త రాజులు, వన, పర్వత పాలకులు కూర్చుని ఉన్న ఆ సభకి రథం మీద వచ్చే రాముడ్ని దశరథుడు ప్రాసాదంలోనే చూశాడు. రూపంలో, వేషంలో గంధర్వ రాజులా కనిపిస్తూ, చంద్రుడిలా మనోహరమైన ముఖంగల, ఏనుగులా నడిచి వచ్చే రాముడ్ని ఎంత చూసినా దశరథుడికి తృప్తి తీరలేదు. రథం దిగి రాముడు చేతులెత్తి నమస్కరిస్తూ మేడ ఎక్కి దశరథుడి దగ్గరికి నడిచాడు. అద్దంలో తనని చూసి మురిసిపోయినట్లుగా దశరథుడు రాముడ్ని చూసి మురిసిపోయి బంగారం, రత్నాలతో చేసిన అందమైన ఆసనం మీద కూర్చోబెట్టి, చిరునవ్వుతో పలకరించి ఇలా చెప్పాడు.
‘రామా! నా పెద్ద భార్యకి పుట్టిన నువ్వు మంచి గుణాల వల్ల నాకు ఇష్టమైన వాడివి. ఆ సద్గుణాలతో ప్రజలని ఆకట్టుకున్నావు. అందువల్ల పుష్యమీ నక్షత్రంలో నీకు పట్ట్భాషేకం చేస్తాను. సహజంగానే నువ్వు వినయంగా ఉంటావు. ఐనా నీకు మంచి మాటలు చెప్తాను. విను. వినయాన్ని ఇంకా వృద్ధి చేసుకో. ఇంద్రియాలని సదా నిగ్రహంలో ఉంచుకో. కామం, కోపం వల్ల కలిగే వ్యసనాలని అదుపులో ఉంచుకో. ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని వ్యవహరించే మంత్రులని సంతోషపెట్టు. ధాన్యాగారాన్ని, ఆయుధాగారాన్ని చక్కగా నింపుతూండు. అందరికీ ఆనందాన్ని కలిగించు. మంచి నియమాలని చేస్తూ భూమిని పాలించే వారి మిత్రులు అమృతం పొందిన దేవతల్లా ఆనందిస్తారు. ఆత్మనిగ్రహంతో ఉండు’
అది విన్న కొందరు కౌసల్య దగ్గరికి వెళ్లి ఆమెకి ఈ శుభవార్త చెప్పారు. వారికి ఆమె బంగారం, ఆవులు, వివిధ రత్నాలు బహుమతిగా ఇచ్చింది.
రాముడు దశరథుడికి నమస్కరించి మళ్లీ రథాన్ని ఎక్కి ప్రజలంతా పూజిస్తూండగా తన నివాసానికి వెళ్లాడు. (అయోధ్య కాండ సర్గ 3)
ప్రసాదం తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ తల్లి శారదాంబ ఆశే్లషతో చెప్పింది.
‘రామాయణం గుర్తుంచుకోవడం కష్టం. ఈసారి కూడా హరిదాసు కొన్ని తప్పులు చెప్పాడు. వాటిని చెప్తా విను’
ఆ తప్పులని మీరు కనుక్కోగలిగారా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

సప్త ఋషులు ఎవరు?
- కాశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. కొన్నిచోట్ల సప్త ఋషుల్లో కాశ్యపుడి బదులు అగస్త్యుడి పేరు ఉంది.

కిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1.తెల్లటి గొడుగు కింద తన దేహం ముసలిదై పోయిందని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు బంగారు గొడుగు కింద అని చెప్పాడు.
2.‘పుష్యమీ’ నక్షత్రంతో కూడిన చంద్రుడిలా బదులు హరిదాసు ‘ఆశే్లషా’ నక్షత్రంతో కూడిన చంద్రుడిలా అని తప్పు చెప్పాడు.
3.నువ్వు ఎన్నో ‘వేల’ సంవత్సరాల వయసుగల వృద్ధుడివి అని చెప్పడానికి బదులు హరిదాసు తప్పుగా ‘వందల’ అని చెప్పాడు.
4.ప్రజలకి ఆనందం కలిగించడంలో చంద్రుడితో, క్షమలో భూమితో అని చెప్పడానికి బదులు హరిదాసు ప్రజలకి ఆనందం కలిగించడంలో భూమితో, క్షమలో చంద్రుడితో అని తప్పుగా చెప్పాడు.
5.వాల్మీకి కేవలం కాశ్యపుడి పేరు రాసాడు తప్ప ‘సప్త ఋషుల్లో ఒకడైన’ కాశ్యపుడికి అని రాయలేదు. అది నిజమే కాబట్టి హరిదాసు దాన్ని జోడించి చెప్పాడు.
6.‘ఇందీవర శ్యాముడు’ శతృ సంహారకుడు ఐన రాముడి అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు ఇందీవర శ్యాముడు అని చెప్పడం విస్మరించాడు.
7.ఉత్తమ గుణ సంపన్నుడైనకి మునుపు ‘విష్ణువుతో సమానమైన’ అనే ఉపమానాన్ని వాల్మీకి వాడాడు. దాన్ని హరిదాసు చెప్పడం విస్మరించాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి