AADIVAVRAM - Others

ఈ రోడ్లు.. గుండె గుభిల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూమి అందంగా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవు. ఇలా ప్రకృతి ఆరాధకులు, సౌందర్య పిపాసులు చెప్పే మాటలకి రెండవ కోణం కూడా ఉంది. అదే ఈ భూమి ఎంత అందంగా ఉందో... అంతకు రెండింతల ప్రమాదకరమైన ప్రదేశాలతోనూ నిండి ఉందని. అలాంటి కొన్ని ప్రమాదకరమైన మన దేశంలోని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
జమ్మూలోని కిష్‌త్వార్ కైలాష్ రోడ్డు
ఇది జమ్మూలోని బేస్‌క్యాంప్‌కు దగ్గరలో గల రోడ్డు. విచిత్రంగా, భయంకరంగా ఉంటుంది. ఎత్తయిన కొండ మీద సన్నని దారి ఇది. పైగా ఈ దారిలో రాకపోకలకు అడ్డంగా ముందుకు పొడుచుకొచ్చిన అతి భారీ శిలలు ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంటాయి. ఇక్కడ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీటర్ల కొద్దీ దిగువన ఉన్న అగాథంలో పడిపోవడం ఖాయం. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్‌త్వార్ జిల్లాలో గల ఈ రోడ్డు సన్నగా, శిలలు ముందుకు పొడుచుకుని రావడం వల్ల కొన్నిచోట్ల ఎదురెదుగా వాహనాలు వస్తే ఇక ప్రయాణానికి మంగళం పాడాల్సిందే. అటువంటి సమయంలో మళ్లీ రోడ్డు వెడల్పుగా ఉండే చోటు వరకు వాహనాలు వెనక్కి వెళ్లాల్సిందే. అక్కడ ఒకవైపు వాహనాలు ముందుకెళ్లిపోతే ఎదురుగా రావాలనుకున్న వాహనం ప్రయాణం చేయడానికి వీలు కుదురుతుంది. విచిత్రం ఏమిటంటే ఘాటీలో ఇలాంటి రోడ్డులో కనీసం మనకి ఎక్కడా రెయిలింగులు కూడా కనిపించవు. ప్రయాణికులు, వాహన చోదకులు ఎవరి రక్షణ వారే చూసుకోవాలి. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దారిగా పేరు గాంచింది.
గురుదోంగ్‌మార్ లేక్
సిక్కింలో కనిపించే గురుదోంగ్‌మార్ సరస్సు ప్రదేశం మన దేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పేరు తెచ్చుకుంది. ఆసియాలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో గల సరస్సులో ఒక సరస్సుగా గురుదోంగ్‌మార్ సరస్సు పేరు తెచ్చుకుంది. అందంగా, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా చెప్పుకునే ఈ ప్రదేశపు అందాలను ఆస్వాదించడానికి మాత్రం వీలు పడదు. ఇతర టూరిస్టు స్పాట్స్‌కి వెళ్లిపోయినట్లు ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే సంబంధిత అధికారుల నుండి అనుమతులు ముందుగానే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రదేశమంతా ఆక్సిజన్ లెవల్స్ ఒక రీతిలో ఉండవు. ఒక్కోసారి అస్సలు ఆక్సిజన్ లేకపోనూ వచ్చు. బాగా ఎత్తులో ఉండడం వల్ల ప్రాణవాయువు ఇక్కడ తగినంతగా లభించకపోవడం వల్ల మనుషులకు ప్రాణహాని ఉంటుందని అధికారులు ఈ ప్రదేశానికి వెళ్లడానికి అనుమతులు ఇవ్వరు.
లమ్‌ఖాగా పాస్ ట్రెక్
హిమాచల్‌ప్రదేశ్‌లో గల లమ్‌ఖాగా పాస్ ట్రెక్ కూడా మన దేశంలో గల ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. చుట్టూ కొండలు, మంచు, ఒంటిని సుతారంగా స్పృశించే చలచల్లని గాలులతో అలరారే ఈ ప్రదేశానికి పర్వతారోహకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఇతర చోట్లలా ఇది పర్వతారోహణకూ అంతగా వీలు కలిగించే ప్రదేశం కాదు. అయిదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో గల ఇక్కడి కొండల మీద ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈడ్చిపడేసే గాలులు, హఠాత్తుగా విరిగిపడే మంచు ఖండాల వల్ల ఈ ప్రదేశానికి ఎవరు పడితే వారు వెళ్లడానికి వీల్లేదు. ఇక్కడికి వెళ్లాలంటే స్థానిక అధికారుల అనుమతులు తప్పనిసరి.
నార్త్ సెంటినల్ ఐలాండ్
బే ఆఫ్ బెంగాల్ సముద్ర ప్రాంత పరిధిలో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్ అండమాన్ దీవులకు చెందిన ప్రదేశం. ఇక్కడ పురాతన అండమాన్ తెగల వారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జీవిస్తున్నారు. వీరు నాగరిక ప్రపంచంతో కలవకుండా బతుకుతుండడం వల్ల మనలాంటి వారిని చూస్తే దాడులు చేయడానికి వెనుకాడరు. పైగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఇక్కడికి సాధారణ పౌరులు వెళ్లాలంటే అనేక రకాల అనుమతులు తీసుకోవాలి. ఒకవేళ అనుమతులు వచ్చి నార్త్ సెంటినల్ ఐలాండ్‌కి వెళ్లినా అక్కడి ఆది మానవుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం మాత్రం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే ఇది కూడా మన దేశంలో గల ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పిన్ పార్వతీ ట్రెక్
ఇది కూడా హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉంది. నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే అంత సులువు కాదు. ఎక్కడా దారి సమాంతరంగా ఉండదు. కొండలు, రాళ్లు, గుట్టలతో నిండి ఉండడం వల్ల నిష్ణాతులు తప్ప ఇక్కడ అడుగు తీసి అడుగేయలేరు. దానికి తోడు హఠాత్తుగా విరిగిపడే మంచు పెళ్లలు, తోసేసే ఈదురుగాలి, అమాంతం కుంగిపోయినట్లుండే లోతైన భూ ప్రదేశాల వల్ల ఇక్కడ నడవడమే కష్టం. ఈ ప్రదేశంలో ప్రయాణించాలంటే ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్ అధికంగా ఉండాలని ట్రెక్కర్లు చెబుతుంటారు.

- దుర్గాప్రసాద్ సర్కార్