AADIVAVRAM - Others

పోరాడే పొట్టి గుడ్లగూబలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేడు అంగుళాలకు మించని ఈ పొట్టి నార్తర్న్ పిగ్మీ గుడ్లగూబలు చూడటానికి ముద్దుగా ఉంటాయి. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే చిన్నచిన్న పావురాల్లా కనిపిస్తాయి. రాత్రిపూట తెగ గోల చేసే ఈ పక్షులు ప్రమాదం ఎదురైనప్పుడు శరీరం చుట్టూ ఉన్న బొచ్చును ఉబ్బవేసి పెద్దగా ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. ఉన్న అతిచిన్న శరీరంలో తోక కాస్తంత పెద్దదిగా ఉంటుంది. విప్పారిన రెక్కల పొడవు మాత్రం పదిహేను సెంటీమీటర్ల మేరకు ఉంటుంది. ఎవరికీ కనిపించకుండా, రహస్యంగా ఉండటం వీటికి ఇష్టం. అవసరమైతే శత్రువులను, మనుషులను కూడా ఎదిరించి, దాడిచేయడానికి ఇవి ఏ మాత్రం వెనుకాడవు.

- ఎస్.కె.కె. రవళి