AADIVAVRAM - Others

కృత్రిమ మేధతో మెదడు సంకేతాల గుర్తింపు (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మెదడు పంపే సంకేతాలను గుర్తించగలిగే కృత్రిమ మేధో విధానాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. పక్షవాతం కారణంగా శరీర భాగాలు అచేతనంగా మారిపోయినవారికి, ఇతర నాడీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి ఈ విధానంతో మేలు జరగనుంది. మనిషి మేధస్సును సవాలు చేసే విధంగా వివిధ రంగాల్లో ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యాలను అధిగమిస్తోంది. జర్మనీకి చెందిన న్యూరోసైంటిస్ట్ టోనియో బల్ సారథ్యంలో జరిపిన పరిశోధనల్లో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మానవ మస్తిష్కం పంపే సంకేతాలను డీకోడ్ చేసే సెల్ప్‌లెర్నింగ్ అల్గరిథమ్ ద్వారా ఇఇజి (ఎలక్ట్రో ఎన్‌సెఫలొ గ్రామ్) గుర్తించడాన్ని ఆ శాస్తవ్రేత్తల బృందం ప్రదర్శించింది. చేతులు, కాళ్ల కదలికలకు సంబంధించి మెదడు పంపిన సంకేతాలు లేదా ఆదేశాలను వీరు గుర్తించారు. ఎపిలెప్టిక్ సీజర్స్, నాడీసంబంధ రుగ్మతలను గుర్తించగలగడం, పూర్తిగా అచేతనమైన రోగుల్లో కదలికలు తెప్పించడం సరికొత్త ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం వల్ల సాధ్యమేనన్నది శాస్తవ్రేత్తల భావన. ‘మానవ మెదడే స్ఫూర్తిగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్) నమూనాలు రూపొందించాం. మెదడు పంపే సహజసిద్ధమైన సంకేతాలు (్ఫనెటిక్స్)ను డీకోడ్ చేయడంలో ఇది సఫలీకృతమైంది.’ అని ఫ్రీబర్గ్ యూనివర్శిటీ హాస్పిటల్ రాబిన్ టిబర్ ష్క్రిమీస్టర్ చెప్పారు. ‘మానవశరీరంలోని నాడీకణాల మధ్య బంధాన్ని, వాటి మధ్య విద్యుత్ సంకేతాల తీరు’ ఆధారంగా ఈ నమూనాలు పనిచేస్తాయని చెప్పారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సిద్ధాంతాలు వచ్చినప్పటికీ ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత కృత్రిమ మేధస్సు మెదడు పంపే సంకేతాలను గుర్తించే అవకాశం ఉందని తేలిందని ఆయన వ్యాఖ్యానించారు. హ్యూమన్ బ్రెయిన్ మ్యాపింగ్ జర్నల్‌లో ఈ మేరకు ఓ వ్యాసం ప్రచురితమైంది.