AADIVAVRAM - Others

ఎక్కువ నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదన్నా ఓ చిన్న పాజిటివ్ అంశం కన్పిస్తే నేను ఎక్కువగా ఊహించుకుంటాను. ప్రతి విషయాన్ని మరీ ఎక్కువ పాజిటివ్‌గా మీరు ఊహిస్తారని చాలామంది నన్ను అంటూ ఉంటారు.
ఓ పెద్దాయన నా గురించి ఓ మీటింగ్‌లో ప్రస్తావిస్తే దాన్ని చాలా పాజిటివ్‌గా నేను తీసుకున్నాను. దాని ఫలితాలు ఓ ఆరు నెలల వరకు ఏమీ కన్పించలేదు. ఆ విషయం గురించి నేను ఎక్కువగా ఊహించుకున్నానని, ఎక్కువగా నమ్మినానని చాలామంది నాతో అన్నారు. కొన్ని సందర్భాలలో నా నమ్మకం సఫలీకృతం కాలేదు. అది దృష్టిలో ఉంచుకొని మా మిత్రుడు అలా అని ఉంటాడు. అయినా నేను నా నమ్మకాన్ని పోగొట్టుకోలేదు.
ఆరునెలల తరువాత ఆ పెద్దాయన ఆ సభలో ప్రస్తావించిన దాని ఫలితం కన్పించింది. నా నమ్మకం మరీ బలపడింది. అప్పుడు చాలామంది నా నమ్మకాన్ని విశ్వసించడం మొదలుపెట్టారు.
ప్రతి విషయాన్ని ఆశావహ దృక్పథంతో చూడాలి. ప్రతి చిన్న పాజిటివ్ అంశాన్ని ఎక్కువగా ఊహించుకోవాలి. అతి విశ్వాసం (ఓవర్ కాన్ఫిడెన్స్) వేరు. ఎక్కువ నమ్మకం వేరు (ఓవర్ బిలీవర్). ఎక్కువ నమ్మకం వుంచితే నష్టపోవడం ఉండదు. లాభం జరుగుతుంది. ఏదైనా సాధిద్దాం అన్న విషయంలో ఎక్కువ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో మన పనులు కొనసాగించాలి. అప్పుడు విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మన మీద మనకు నమ్మకం ఉండాలి.
గొప్ప పనులు చేస్తామన్న నమ్మకం ఉండాలి.
మన భవిష్యత్తు ఉజ్వలంలా ఉంటుందని
ఎప్పుడూ నమ్మాలి.
మనం అడిగిన దానికన్నా ఎక్కువ
భగవంతుడు ఇస్తాడన్న నమ్మకమూ ఉండాలి.
ఈ ప్రపంచాన్ని, కనీసం మన ప్రపంచాన్ని
మారుస్తామన్న విశ్వాసం
మన మీద మనకు ఉండాలి.
అన్నింటికన్నా ముఖ్యమైంది ఎక్కువ నమ్మకం ఉండటమే కాదు, ఆ నమ్మకం ప్రకారం మన అడుగులు పడుతూ ఉండాలి.
ఎక్కువ నమ్మకం వేరు.
అతి విశ్వాసం వేరు.
ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు.

జింబో 94404 83001