AADIVAVRAM - Others

ఓ మామూలు క్షురకుడు 400 కార్లకి అధిపతి (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసే పని మీద శ్రద్ధ, ఆ పనంటే గౌరవం ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. అందుకే పెద్దలు పనిని ప్రేమించమన్నారు. సరిగ్గా ఆ కోవకే చెందిన వాడు రమేష్‌బాబు. బెంగళూరుకు చెందిన రమేష్‌బాబు నాలుగు వందల కార్లకు అధిపతి. అలాగని అతను పుట్టుకతోనే సిరిసంపదలు కలిగిన వాడేమో అనుకునేరు... కానే కాదు. ఇంకా చెప్పాలంటే అతనొక బార్బర్. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కూడా కాదు. ఇంకా తక్కువ స్థాయిలోనే అతను గతంలో జీవించాడు. అయితేనేం పనిని ప్రేమించాడు, ఆ పనే శ్వాసగా జీవించాడు కనుకనే ఇప్పుడతను బెంగళూరులోనే కాదు... ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన బార్బర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
బెంగళూరులో రమేష్‌బాబు తండ్రి ఒక సాదాసీదా బార్బర్. అతను 1989లో మరణించాడు. దాంతో వారి కుటుంబం సమస్యల్లో చిక్కుకుంది. అప్పుడు అతని తల్లి ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. అప్పుడు రమేష్‌బాబు చిన్నవాడు. చదువుకుంటూ ఉండేవాడు. రమేష్‌బాబు తల్లి తమ బార్బర్ షాపును రోజుకు అయిదు రూపాయల అద్దెకి వేరెవరికో ఇచ్చింది. అలా కష్టపడి వచ్చిన డబ్బుతోను, బార్బర్ షాపు ద్వారా వచ్చే బాడుగతోను కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. అయినా దుర్భరంగానే ఉండేది. ఈ దశలో రమేష్‌బాబు తానే స్వయంగా బార్బర్ షాపు నడపాలని భావించాడు. అనుకున్నదే తడువు ఆ పని చేయడం మొదలుపెట్టాడు.
కొత్త ట్రెండ్‌ని ఇట్టే పట్టేయడం, ప్రపంచాన్ని చదవడం బాగా ఆకళింపు చేసుకున్న రమేష్‌బాబు కస్టమర్లు ఫిదా అయిపోయేలా కొత్త పుంతలతో హెయిర్ డ్రెస్సింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేవాడు. దాంతో పెద్దపెద్ద మిలిటరీ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, ఆటగాళ్లు, ఇతర సెలబ్రిటీలు కూడా అతనితోనే జుత్తు కత్తిరింపజేసుకునేవారు.
అలా అతని బిజినెస్ అనూహ్యంగా పెరిగిపోయింది. సెలూన్‌ని నూతన హంగులతో అలంకరించాడు.
ఆది నుండి కష్టాలను చవి చూసి ఉండడంతో రమేష్‌బాబు కష్టపడడం ద్వారా వచ్చిన డబ్బును వృథా చేసేవాడు కాదు. ఇంటి అవసరాలు తీరగా మిగిలిన దానిని పొదుపు చేసేవాడు. అలా పొదుపు చేసిన డబ్బుతో అతను తొలుత ఒక మారుతీ ఓమినీ వ్యాన్ కొన్నాడు. దానిని సొంత అవసరాలకు వాడుకోలేదు. రోజువారి బాడుగకి ఇచ్చేవాడు. అలా బార్బర్ షాపు ద్వారా వచ్చే ఆదాయం, వ్యాన్ అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాస్తూ బ్యాంకు బాలెన్స్‌ని వృద్ధి చేసి మరిన్ని కార్లు కొన్నాడు. వాటితో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు.
కొత్త వ్యాపారం చేపట్టానని అతను బార్బర్ షాపును నిర్లక్ష్యం చేయలేదు. రెండింటినీ సమానంగా ప్రేమిస్తూ అదే పట్టుదలతో కష్టపడ్డాడు. ఫలితమే అనతికాలంలోనే అతని వృద్ధి. ఇప్పుడతని వద్ద మొత్తం నాలుగు వందల కార్లు, వ్యాన్లు ఉన్నాయి. అతని వద్ద అత్యంత ఖరీదైన మెర్సిడిస్ ఇక్లాస్ లగ్జరీ సెడాన్, రోల్స్‌రాయిస్ ఘోస్ట్ వంటి కార్లు కూడా ఉన్నాయి. రోల్స్‌రాయిస్ ఘోస్ట్ కారు ధర 3.1 కోట్లు. అతని వద్ద ఉన్న లగ్జరీ కార్లు 67. వాటిని అతను రోజుకి 75 వేలు తీసుకుని అద్దెకిస్తాడు. అతని కార్ల బారులో ఇప్పుడు మెర్సిడిస్ సి, ఇ, ఎస్ క్లాస్, రోల్స్‌రాయిస్ సిల్వర్ ఘోస్ట్, బిఎండబ్లు 5,6,7 సిరీస్, మెర్సిడిస్ వ్యాన్, టయోటా మినీ బస్సులు ఉన్నాయి.
ఈ విధంగా చేసే పని పట్ల నిబద్ధత ఉంటే ఏ మనిషైనా ఎలా ఎత్తులకి ఎదగవచ్చో రమేష్ బాబు చేసి చూపించాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్