AADIVAVRAM - Others

గంటల తరబడి పనిచేస్తే ముప్పే (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. చక్కటి ఆహారం, కంటినిండా నిద్ర మంచి ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. శారీరక శ్రమ తగినంత అవసరం కూడా. కానీ గంటల తరబడి పనిచేస్తూ ఉంటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలిన అంశం. నిర్ణీత సమయానికి మించి అదేపనిగా విధుల్లో మునిగితేలిపోతూంటే గుండెకు ప్రమాదం తప్పదని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది. హృదయ స్పందన తీరును ఇది ప్రభావితం చేసి గుండె సంబంధ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి 35-40 గంటలు పాటు పనిచేసేవారిని, వారానికి 55 గంటలు పనిచేసే వారిని పోల్చి పరిశోధనలు చేసినపుడు కొన్ని అంశాలను శాస్తవ్రేత్తలు గమనించారు. తక్కువ సమయం పనిచేసేవారికన్నా ఎక్కువకాలం పనిచేసేవారిలో 40శాతం మేరకు ‘కర్ణిక దడ’ పెరిగినట్లు తేలింది. గుండెపోటు, పక్షవాతానికి ఇది దారితీసే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం తేల్చిచెబుతోంది. ‘40శాతం ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందన్న విషయం ముఖ్యమైనదే. వయసు, లైంగిక కార్యకలాపాలు, మధుమేహం, రక్తపోటు, ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం, ఊబకాయం, పొగతాగడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలతో ఉన్నవారు ఎక్కువ కాలం పనిచేస్తున్నట్టయితే వారి గుండెకు ఇలా అధికకాలం పనిచేయడం సమస్యలను తెచ్చిపెట్టడం ఖాయం’ అని మికా కివిమకి అంటున్నారు. లండన్ యూనివర్శిటీ కళాశఆలలో ఆయన ప్రొఫెసర్. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ మేరకు తాజా అధ్యయనంలోని అంశాలు ప్రచురితమయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్‌లాండ్‌లలో 85,494 మంది పురుషులు, మహిళలను పరిశీలించిన తరువాత వారి అధ్యయనంలోని అంశాలను వెల్లడించారు. కర్ణిక దడ లక్షణాలతో బాధపడుతున్న రోగులను పరశీలించినపుడు తక్కువ సమయం పనిచేసే ప్రతి వెయ్యిమందిలో 12.4 మంది గుండెపోటు, పక్షవాతం ముప్పును ఎదుర్కొంటూంటే దీర్ఘకాలం పనిచేసే రోగుల్లో 17.6 మంది ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం తేల్చింది.