AADIVAVRAM - Others

జీవితానికి సంబంధించిన చిన్ని రహస్యం (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గురువు తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తితో ‘జీవితానికి సంబంధించిన చిన్ని రహస్యం ఇది. ఎవరేం చెప్పినా, చివరికి గురువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు. ఏదీ మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. నవ్వుడం నేర్చుకో - ప్రతిదాన్నీ చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో. అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు’ అన్నాడు. ఆ వ్యక్తి గురువు మాటల్ని వింటున్నాడు. గురువు కొనసాగించాడు.
‘నా దగ్గర నలుగురు శిష్యులు వున్నారు. వాళ్లు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లకు గొప్ప శారీరక, ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాను. మొదటి శిష్యుడు బలహీనుడు. తట్టుకోలేక పారిపోయాడు. రెండవ శిష్యుడు జాగ్రత్తపరుడు. ప్రతిదాన్నీ మరీ తీవ్రంగా పట్టించుకుని పిచ్చివాడై పోయాడు. మూడవ శిష్యుడు తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ మానసిక, శారీరక శిక్షణకు లోనై తట్టుకోలేక కిందపడి మరణించాడు. నాల్గవ శిష్యుడు మాత్రమే నెమ్మదిగా, హాయిగా, ఆరోగ్యంగా ఉన్నాడు’ అన్నాడు.
ఆ వ్యక్తి ‘అతను అలా ఉండడానికి కారణం ఏమిటి?’ అన్నాడు.
గురువు ‘నేను చెప్పిన కఠిన శిక్షణకు సంబంధించిన ఒక వ్యాయామాన్ని ఆ శిష్యుడు పరిశీలించి బుర్ర ఉన్నవాడు ఎవడూ ఈ వ్యాయామం చెయ్యడు. మీరు చెప్పింది నేను చెయ్యగలను అనుకుంటే మిమ్మల్ని నేను పిచ్చివాడుగా భావిస్తాను. మీరు చెప్పారు కదా అని నేను చెయ్యాలనుకుంటే నేనో పిచ్చివాడిని అన్నాడు. అందుకే నేను చెప్పింది చెయ్యడానికి అతను తిరస్కరించాడు’ అని చెప్పి గురువు నవ్వాడు.

- సౌభాగ్య, 9848157909