AADIVAVRAM - Others

శరీర దుర్గంధానికి సులువైన చికిత్స (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: శరీరంలోంచి ఎక్కువగా దుర్గంధం వస్తోంది. నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోంది. ఇలా ఎందుకు వస్తోందో వివరంగా చెప్పగలరు. తగ్గించే ఉపాయం ఏమిటి?
జ: ఇతరుల కంపుని భరించలేక పోవటం ఎవరికైనా సహజమే. కానీ, ఎవరి కంపు వారికి తెలియదు. మనిషి చెమట వాసనని పోలీసు శిక్షణ పొందిన శునకాలు పసికట్టగలుగుతాయి. మనిషికి లేని ఒక అతీంద్రియ శక్తి శునకాలకుంది.
తన శరీర దుర్గంధం గురించి అందరికన్నా ఆఖరికి తెలుసుకునేది ఆ వ్యక్తే! ఇతరులు చెప్తేనే కొందరికి తెలుస్తుంది. ఇందుకు కారణం శరీర పరిశుభ్రత మీద శ్రద్ధ లేకపోవటమే.
శరీరం అనేక విష దోషాలను, వ్యర్థాలను బయటకి విసర్జిస్తుంటుంది. చెమట వీటిలో ముఖ్యమైంది. ఇది శరీర దుర్వాసనకు కారణం అవుతుంది. మనుషులందరికీ ఇది సమానమే. శరీర పరిశుభ్రతా నియమాలను పాటించడమే ఇందుకు పరిష్కారం.
బాహుమూలాల్లోనూ, గజ్జల్లోనూ, పాదాల దగ్గర, స్తనాల దగ్గర, చెవుల మూలాల్లోనూ, ఇంకా ఇతర భాగాల్లోనూ పట్టే చెమటలో దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. ఎపోక్రయిన్ గ్రంథులు ఈ చెమటను పుట్టిస్తాయి. ఇక్క్రెయిన్ గ్రంథులని చెమట గ్రంథులు మరొక రకం ఉన్నాయి. అవి తక్కిన శరీర భాగాల్లో చెమట పట్టేలా చేస్తాయి.
నిజానికి చెమట ఎలాంటి వాసనా లేని ఉప్పని ద్రవ పదార్థం. మన చర్మం మీద నివసించే బాక్టీరియా ఈ చెమటని ఆమ్లాలుగా విరగ్గొడుతుంది. ఈ ఆమ్లాలు చెమట కంపు కలిగిస్తుంటాయి. దీన్ని సాంకేతికంగా ఇ్య్దౄజజ్యూఒజఒ, యఒౄజజ్యూఒజఒ లేదా యచ్యీష్ద్యూఆజ్ఘ అని పిలుస్తారు. శ్రమ వలన శరీరం బాగా అలసిపోయినప్పుడు ‘ఒళ్లు పులిసిపోయింది’ అని అంటుంటాం. చెమటని బాక్టీరియాలు ప్రొపియోనిక్ యాసిడ్ తదితర ఆమ్లాలుగా విడగొట్టడం వలన మొదట పుల్లని వాసన వెలువడ్తుంది. ఈ పుల్లని వాసన రాగానే శరీరాన్ని కడుక్కుంటే చెమట దుర్గంధం రాకుండా ఉంటుంది.
యవ్వనాంకురాల్లో అంటే ప్యూబర్టీ వచ్చినట్టు స్పష్టమైన సంకేతం ఏమిటంటే, 14-17 సంవత్సరాల వయసు పిల్లల చంకలు, గజ్జల్లోంచి చెమట వాసన మొదలుకావటమే.
మంచుకొండల ప్రాంతాల్లో నివసించే వారికి చెమట తక్కువ. అయినా, రోజుకొకసారి కనీసం ప్రతీ వ్యక్తీ స్నానం చేసి తీరాలని ఆధునిక వైద్య శాస్త్రం సూచించింది. మనది ఉష్ణ మండలం. చెమట నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది. చలికాలం అయినా మనకు శరీర వ్యాయామం, శ్రమ చేసినప్పుడు చెమట పడ్తుంది. దుర్వాసన వస్తుంది. మనం రెండు పూటలా ఉదయం, సాయంత్రం విధిగా స్నానం చేయాలి. లేకపోతే మన మిత్రులు కూడా మన పక్కన నిల్చోవటానికి ఇబ్బంది పడతారు. మానసిక ఆందోళన, భయం, దిగుళ్లు కూడా చెమట ఎక్కువగా పట్టేలా చేస్తాయి.
ఒక్కోసారి వ్యక్తి వదిలే ఊపిరి నుండి కూడా దుర్వాసన వస్తుంది. ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, కోడిగుడ్లు, మాంసం లాంటివి అధికంగా తీసుకున్నప్పుడు, వారి శరీరం నుండి, ముఖ్యంగా నోటి నుండి గవులుకంపు వెలువడుతుంది. చుట్ట, బీడీ, సిగరెట్, మద్యం తాగి వచ్చిన వారి పక్కన నిల్చోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొందరు మన పక్క నుండి నడిచి వెడ్తున్నా మనకు కడుపులోంచి తెములుకొస్తుంది. రైళ్లలోనూ, బస్సుల్లోనూ, విమానాల్లోనూ ఇలాంటి వాళ్లు వచ్చి పక్కన కూర్చున్నపుడు వారి దుర్వాసనని మనం భరించలేక పోవచ్చు.
చాలా మంది చెమట కంపు పోవడానికి బట్టలకు సెంటు కొడుతుంటారు. సెంటు కొట్టుకోవటంలో రెండు ప్రయోజనాలున్నాయి. తాను పరిమళ భరితంగా ఉండటం ఒకటైతే, తన కంపు ఇతరులకు తెలియకుండా మూసేయటం రెండోది.
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గంథకం ఎక్కువగా ఉండే ఉల్లి, వెల్లుల్లి, కాబేజీ, కాలీఫ్లవర్ ఇవి దుర్వాసన కలగటానికి కారణం. వీటిలో ఉల్లి వెల్లుల్లి మనల్నించి వెలువడే దుర్వాసన భరించలేక ఇతరులు దూరంగా పారిపోయేలా చేస్తాయి కాఫీ, టీ, కెఫీన్, కోక్ కలిసిన ఆహార పదార్థాలు, పానీయాలు నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. టిఫిన్ చేశాక కాఫీ తాగాలనే నియమం ఋగ్వేదంలో వ్రాసి ఉన్నదన్నంత నియమంగా పాటిస్తుంటాం మనం. ఏదైనా తిన్నాక కాఫీ తాగటం, పొగ తాగటం విచిత్రమైన అలవాట్లు. కాఫీ తాగితే ఆనియన్ దోశె లాంటివి తిన్నందువలన నోరు ఉల్లి కంపు కొట్టకుండా ఉంటుందనుకుంటున్నారా.. కాఫీ, టీలు కూడా నోటి దుర్వాసన తెస్తాయి.
అవసరానికి మించి చెమట పట్టడానికి స్థూలకాయం ఒక కారణం. ఒబెసిటీ వలన శరీర దుర్గంధం పెరుగుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వేడి తగ్గడానికి శరీరమే చెమటను ప్రేరేపిస్తుంది. చెమట పెరిగే కొద్దీ దుర్వాసనా పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టేవారు వదులు బట్టలు, ఎక్కువగా కాటన్ బట్టలు ధరించాలి. పంచెకట్టు సౌకర్యవంతంగా ఉంటుంది. నలక్కుండా ఉంటాయని కట్టుకునే పాలియెస్టర్ బట్టలు చెమటని పెంచుతాయి.
నోటి దుర్వాసన కూడా శరీర దుర్గంధానికి కారణమే! బాక్టీరియాలకు నోరు అనేది స్టోర్ హౌజ్ లాంటిది. రెండు పూటలా బ్రష్ చేసుకోవటం, మధ్యమధ్యలో నీళ్లు బాగా పుక్కిలించి ఉమియటం చేస్తుండాలి. దుర్వాసనకు బాక్టీరియా కూడా కారణం అవుతుంది. శరీర పరిశుభ్రత పాటించని వారిపై బాక్టీరియా దాడి ఎక్కువగా ఉంటుంది.
పాదాల్లోంచి వచ్చే చెమటకు సాక్స్ బాగా తడిసి ఉంటాయి. బూట్ లోపల ఉంటాయి కాబట్టి ఆ చెమట ఆరక, బాక్టీరియా, ఫంగస్‌లు చేరటానికి కారణం అవుతాయి. సాక్స్‌ని తరచూ మార్చటం, అవకాశం కుదిరినప్పుడు బూట్లు విడుస్తూ ఉండడం అవసరం. మడమల చుట్టూ డెడ్ స్కిన్ బెరళ్లు కట్టి ఉంటే దాన్ని బ్రష్‌తో గానీ, రాయితో గానీ తొలగించటం వలన పాదాల్లోంచి దుర్వాసన తగ్గుతుంది. ఇలాంటి వ్యక్తులు చెప్పులు వేసుకుని తిరిగితే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
థైరాయిడ్ గ్రంథి వలన కలిగే లోపాలు, షుగర్ వ్యాధి, బీపీ గుండె జబ్బుల్లో, మూత్రపిండాల వ్యాధుల్లో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. మహిళల్లో మెనోపాజ్ కూడా అతిగా చెమట వచ్చే కారణాల్లో ఒకటి. షుగర్ వ్యాధిలో చెమట మిగల మగ్గిన అరటిపండు వాసనలో ఉంటే శరీరంలో కీటోన్ల శాతం పెరిగి ప్రమాద పరిస్థితి ఏర్పడినట్టు లెక్క. లివర్, కిడ్నీ వ్యాధుల్లో విష దోషాలు ఎక్కువగా ఉండటం చేత చెమట దుర్గంధంలో ఒక విధమైన కుళ్లు వాసన ఉంటుంది.
చంకల్లోనూ, గజ్జల్లోనూ నూనె రాసుకుని, మెత్తని మొక్కజొన్నల పిండిని తడిపి అక్కడ పట్టించి, కొద్దిసేపు ఆరిన తరువాత దాన్ని వలిచేస్తే, అక్కడున్న బాక్టీరియా ప్రభావం తగ్గుతుంది. పెసర పిండి లేదా శనగపిండిని కూడా వాడవచ్చు. వన మూలికలతో తయారైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవటం ఉత్తమం. ఈ సున్నిపిండికి ఒక చెంచా మోతాదులో తీసుకుని, తినే సోడా ఉప్పు ఒక చెంచా కలిపి తడిపి ముద్దలా చేసి, చంకల్లో, గజ్జల్లో, పాదాలకూ నలుగు పెట్టుకొంటే బాక్టీరియా నశిస్తుంది. ఈ బాక్టీరియా ఆమ్ల వేగం కలిగింది. అక్కడ క్షారాన్ని పట్టిస్తే, బాక్టీరియా నశిస్తుంది. తినే సోడా ఉప్పు ఇందుకు తేలికగా దొరికే ఉపాయం. హైడ్రోజన్ పెరాక్సైడ్ మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని పావుగ్లాసు నీళ్లలో ఒక చెంచా మోతాదులో బాగా కలిపి చంకల్లోనూ, గజ్జల్లోనూ పట్టిస్తే, అక్కడి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.

*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com