AADIVAVRAM - Others

ప్రముఖ శాస్తవ్రేత్తలు జోసెఫ్ లిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోసెఫ్ లిస్టర్ 1827లో ఇంగ్లండ్‌లోని ఎసిక్స్‌లో జన్మించాడు. తండ్రి రాబర్ట్ లిస్టర్ ఒక నాటువైద్యుడు. తరతరాలుగా వస్తున్న నాటు వైద్యం చేస్తూ కాలం గడిపేశాడు. తండ్రి చేసే చికిత్సలను గమనిస్తూ లిస్టర్ ఎంతో ఆలోచించేవాడు. అపరిశుభ్రమైన వైద్యం చాలా బాధాకరంగా ఉండేది.
పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి లండన్ వెళ్లి లండన్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకుని 1852లో మెడిసిన్ పూర్తి చేశాడు.
అనంతరం రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్‌లో ఫెలోషిప్ తీసుకుని, వైద్యవృత్తి చేస్తూ తన పరిశోధనలు సాగించాడు. సర్జరీలో అనేక ప్రక్రియలు చేసి, ఎడింబర్గ్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ చేరి తన పరిశోధనలు ఉధృతం చేశాడు. అతని పరిశోధనల ఫలితాలను పుస్తకంలో ‘రోగికి ఆపరేషన్ చేసినప్పుడు అతనిలో బాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంది. దానిని నివారించడానికి మూడు పద్ధతులున్నాయి. మొదటిది ఆ గదిలోకి బాక్టీరియా క్రిములు రాకుండా జాగ్రత్త పడాలి. రెండవది అతని శరీరం వేడిగా ఉంటే బాక్టీరియా చేరదు. పై రెండూ అసంభవాలే కనుక ఇక మూడవది సెప్టిక్ కాకుండా యాంటీసెప్టిక్ మందు వాడాలి. ఇది సంభవం కనుక ఈ మందును కనిపెట్టాలి.’ ఆనాటి నుండి అనేక ప్రయోగాలు నిరంతరం చేస్తూనే ఉన్నాడు. పేషెంట్ల అభిప్రాయాలను సేకరించి, చివరకు పూర్తిగా నిరపాయకరమైన యాంటీసెప్టిక్‌ని కనిపెట్టి, మానవ కోటికి మరపురాని మహోపకారం చేశాడు లిస్టర్. యాంటీసెప్టిక్ మందుతోపాటు, ఆపరేషన్ చేసే డాక్టర్లు, నర్స్‌లు ధరించవలసిన గ్లౌవ్స్, తలకు, ముక్కుకు, నోటికి, బట్టలు, పొడవైన కోటు, రబ్బరు బూట్లు ప్రవేశపెట్టి ఆపరేషన్ చేసే పరికరాలను మరిగే వేడినీటితో శుభ్రం చేయవలసిన పరిస్థితి గురించి ఇతర డాక్టర్లకు వివరించాడు. విక్టోరియా మహారాణి లిస్టర్‌ను పిలిపించి తనకు గల ఒక పుండును ఆపరేషన్ ద్వారా నయం చేయించుకుంది. లిస్టర్ కేవలం యాంటీసెప్టిక్ మందును కనిపెట్టడమే కాకుండా ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి అతికించే విధానంలో కొత్త ప్రక్రియలు రూపొందించాడు. ఆ మహానుభావుడు 1912 ఫిబ్రవరి 10న మరణించాడు.

-పి.వి.రమణకుమార్