AADIVAVRAM - Others

బాధ్యత(సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజుల్లో పోల్చుకోవడం మరీ ఎక్కువై పోయింది. పోల్చుకుంటే పర్వాలేదు. పోల్చుకుని బాధపడటం మరీ ఎక్కువ అవుతోంది.
చాలామంది ఇతరుల ఆస్తిపాస్తులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఇతరుల అందచందాలని చూసి రంగును చూసి బాధపడుతూ ఉంటారు.
చాలామందికి తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. మరి కొంతమంది అక్రమంగా ఆస్తులని సంపాదిస్తారు. కష్టపడి ఆస్తులని సంపాదించే వాళ్లూ ఉంటారు. కష్టపడి ఆస్తులని సంపాదించిన వ్యక్తుల గురించి ఆలోచిస్తే అంతగా బాధ ఉండదు. తల్లిదండ్రుల దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి.
అందమనేది, రంగు అనేది ఎవరి చేతిలో లేనిది. ఈ రెండింటికి తల్లిదండ్రులు కారణం కాదు. కానీ చాలామంది తల్లిదండ్రులని బాధ్యులని చేస్తూ ఉంటారు.
తల్లిదండ్రులు తమని బాగా పెంచలేదని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులని నిందిస్తూ ఉంటారు. సరిగ్గా పెంచకపోవడం తల్లిదండ్రుల తప్పే. దాన్ని కాదనలేం. దానికి పిల్లలు బాధ్యులు కారు. కానీ గతంలో బతకడం ఎప్పుడూ గతం గురించి ఆలోచించడానికి పిల్లలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పనిలో నైపుణ్యం అనే దానికి ఎవరూ బాధ్యులు కారు. కానీ మన పనిలో నైపుణ్యానికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మన పని నైపుణ్యంలో అత్యున్నత వైభవం చూపించాల్సింది మనమే.
మన చుట్టూ ఎంతోమంది వ్యక్తులు ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో బలహీనత కన్పిస్తుంది. వాళ్ల వైఖరులు కూడా ఏదో రకంగా ఉంటాయి. దానికి మనం బాధ్యత వహించకూడదు. కానీ వారి ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.
మంచి వాళ్ల ప్రభావం మన మీద పడే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.
మనకు నచ్చని అంశాలు ఎన్నో ఉంటాయి. మనకు చిరాకు కల్గించేవి కూడా ఎన్నో ఉంటాయి.
వీలైతే వాటిని తొలగించాలి.
వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి.
అంతేకానీ అంతా చెత్త అని అనుకుంటూ అక్కడే కూర్చుంటే ఫలితం ఉండదు.
మన పనిలో పురోగతి సాధించడం మనం చేయాల్సిన పని. ఈ పురోగతి ప్రతిరోజూ కన్పించాలి.
ఈ పని చేస్తే చాలు. బాధ్యులని చేయడం సులువు. బాధ్యత వహించడం కష్టం.

- జింబో 94404 83001