AADIVAVRAM - Others

దంత ఆరోగ్యంపై వీటికి శ్రద్ధ ఎక్కువ? (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి శుభ్రతపై శ్రద్ధ ఎక్కువే. మిగతా జంతువులతో పోలిస్తే ఆరోగ్యం కోసం శుచిశుభ్రతకు మానవులు కాస్తంత ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం పరిపాటి. అసలు నిద్రలేస్తూనే మనం పళ్లు తోముకోవడంతో శుభ్రతను పాటించడం మొదలుపెడతాం. ఇక శరీరం, తల, పట్టలు, ఇల్లూవాకిలి ఇలా అన్నింటినీ వీలైనంత మంచి వాతావరణంతో, పరిశుభ్రతతో ఉండేలా చూస్తూంటాం. కాస్తంత బద్దకస్తులైతే చెప్పలేంగాని ఎక్కువమంది దీనికి ప్రాధాన్యత ఇస్తారు. బలమైన, ఆరోగ్యవంతమైన, నిగనిగలాడుతూ మెరిసే దంత సౌందర్యంకోసం చాలామంది పరితపించిపోతూంటారు. కొందరు అతిశ్రద్ధ చూపి రోజుకు రెండుమూడుసార్లు పళ్లుతోముకుంటారు. ఈ బాపతు మనుషులు తక్కువే. వయసు పెరిగేకొద్దీ ఓపిక నశించి దంత సమస్యలు తలెత్తడం మనకు ఎదురయ్యే అనుభవమే. కానీ పెద్దవయసువారికి కూడా దంత ఆరోగ్యంపై ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ, ఇప్పుడు ఒక విశేషం చెప్పుకోవాలి. మనకన్నా ఆరోగ్యవంతమైన దంతాల కోసం వానరజాతి ఒకటి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. తరాల తరబడి దంతఆరోగ్యంపై మనిషి శ్రద్ధచూపిస్తున్నప్పటికీ వారికంటే ఒక జాతికి చెందిన వానరాలు తమ దంత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ఈ అధ్యయనాలు తేల్చాయి. మనదేశంలోని గ్రేట్ నికోబార్ దీవుల్లో నివసించే లాంగ్ టెయిల్డ్ మకావూ రకం కోతులకు పంటి సౌందర్యం, శుభ్రతలపై ఎనలేని శ్రద్ధ ఉందిట. మనం టూత్‌బ్రష్‌లు, వేపపుల్లలు, బూడిద, వివిధ రకాల పేస్ట్‌లు వాడతాం. అలాగే ఆ కోతులు తమ దంత సౌందర్యం, శుభ్రత కోసం వివిధ రకాల సాధనాలను వినియోగించడం చూస్తే అశ్చర్యపోవలసి వస్తుంది. నైలాన్ దారాలు, పక్షుల ఈకలు, కొబ్బరి పీచు, గడ్డిపోచలను వాడి వాటి దంతాలను అవి శుభ్రం చేసుకుంటూంటాయి. అవి రోజూ దంతధావనం చేయడం ఇక్కడ గమనార్హం. కొబ్బరి బొండాలను రాళ్లపై బాది విరిచి తినడం, జీడిపప్పులను తీసేందుకు వాటి కాయలను పగులగొట్టడం, వాటి తైలాన్ని వాడటం, ఆకులతో శుభ్రం చేసుకోవడం వంటి లక్షణాలు ఆ కోతులను ప్రత్యేకం. హిందూ మహాసముద్ర తీరాల్లోని కేవలం మూడు దీవుల్లో మాత్రమే కనిపించే ఈ లాంగ్‌టెయిల్డ్ మకావూ రకం కోతుల చేష్టలు, చర్యలపై తాజా అధ్యయనం కొనసాగింది. తాజా ఫలితాలు శాస్తవ్రేత్తలను ఆలోచింపచేస్తున్నాయి. జీడికాయలనుంచి వచ్చే తైలం, పాలను ఆకులతో శుభ్రం చేసే తెలివితేటలు వాటికి ఉండటాన్ని శాస్తవ్రేత్తలు గమనించారు. మానవుల శిరోజాలతో తమ శరీరాన్ని, దంతాలను ఈ రకం కోతులు శుభ్రం చేసుకోవడాన్ని ఒకప్పుడు థాయ్‌లాండ్ ఆలయ శిథిలాల్లో తిరుగుతున్న వాటినుంచి గమనించారు. అలాగే జపనీస్ మకావూ రకం కోతులు తమ సొంత బొచ్చునే సాధనంగా చేసుకుని పళ్లు తోముకోవడం, శరీరాన్ని శుభ్రం చేసుకోవడాన్ని శాస్తవ్రేత్తలు గుర్తించారు. కాగా వాటిన్నింటికన్నా, చివరకు మానవులకన్నా శ్రద్ధగా, తెలివిగా దంత ఆరోగ్యం కోసం మన తీరంలోని కోతులు ప్రయత్నించడం విశేషం.

-ఎస్.కె.ఆర్.