AADIVAVRAM - Others

చిన్నారులకు ఆ శక్తి ఉంది!( విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేడు నెలల పిల్లలకు జరగబోయే, జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని, ఊహించుకునే శక్తి ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సంభావ్య పరిణామాలను ఊహించగలిగే శక్తి వారికి ఉంటుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఆరేడు నెలలప్పుడు ఎదురయ్యే ముప్పును పసిగట్టగలగడం, వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచించడం వారికి చేతనవుతుందని వారు అంచనావేస్తున్నారు. జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ కాగ్నిటివ్ అండ్ బ్రెయిన్ సైనె్సస్ (ఎమ్‌పిఐ సిబిఎస్), స్వీడన్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఉప్సలా శాస్తవ్రేత్తల బృందం సంభావ్య పరిణామాలపై శిశువుల వైఖరి ఎలా ఉంటుందన్న అశంపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఏ రంగులో ఉన్న బంతులు ఎక్కువగా చిన్నారులను ఆకర్షించాయో, ఆ రంగుకు దగ్గర పోలికలున్న బంతులు ఏవో వారు పసిగట్టడాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో జరిగిన పరిశోధనల ప్రకారం నాలుగు నెలల లోపు పిల్లలకు సంభావ్య పరిణామాలను అంచనా వేసే శక్తి ఉండదని తేల్చాయి. అయితే ఆరునెలలకు వారికి ఆ శక్తి అబ్బుతుందని తాజాగా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. మనం పుట్టిన తొలిరోజుల్లో చుట్టుపక్కల పరిస్థితులు, వాతావరణానికి సంబంధించిన గణాంకాలను, గుర్తులను మన మెదడు భద్రపరుస్తుందని, దీని ఆధారంగా ఆరునెలల లోపు పిల్లలు జరుగుతున్న పరిణామాలను, ఒకదానికి, ఆ తరువాతి దానికి గల సంబంధాన్ని వారు అర్థం చేసుకోగలరని శాస్తవ్రేత్తలు అంచనాకు వచ్చారు. ఎమ్‌పిఐసిబిఎస్‌కు చెందిన న్యూరో సైంటిస్ట్ ఎజ్గి కేహాన్ ఈ మేరకు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆరు, పనె్నండు, పద్దెనిమిది నెలల వయస్సున్న 75 మంది పిల్లలకు యానిమేటెడ్ క్లిప్పింగ్స్ (షార్ట్ ఫిల్మ్) చూపించడం ద్వారా వారిలో వచ్చిన వ్యక్తీకరణలను గమనించి ఎగ్జి ఈ పరిశోధన ఫలితాలను లెక్కగట్టారు. ఒక యంత్రంలో ఎక్కువగా నీలి బంతులు, కొన్ని పసుపు రంగుతో ఉన్న బంతులను నింపారు. ఎదురుగా రెండు తొట్టెలను పెట్టి ఒక దానిలో నీలి బంతులు, రెండో దానిలో పసుపు బంతులను విసిరేలా ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ యంత్రం బంతులను విసురుతున్న దృశ్యాన్ని చిత్రంగా తీసి ఈ చిన్నారుల ఎదుట ప్రదర్శించి వారి స్పందనను పరిశీలించారు. ఈ మిషన్ ఎక్కువసార్లు నీలిబంతులను ఒక బాస్కెట్‌లోకి విసిరింది. పసుపు బంతులు తక్కువ సంఖ్యలో విసరబడ్డాయి. పిల్లలు ఎక్కువ సేపు తమ దృష్టిని నీలిబంతులు పడుతున్న బాస్కెట్‌వైపు కాకుండా తక్కువగా పడుతున్న పసుపు బంతుల బాస్కెట్‌వైపే ఉంచారు. ఆ బాస్కెట్‌లో పసుపు బంతులు పడతాయేమోనన్న అంచనాతో వారు అలా చేసి ఉంటారన్నది భావన. ఇది శాస్తవ్రేత్తలను సంభ్రమపరిచింది. దాదాపు 625 సార్లు నీలి బంతులు బాస్కెట్‌లో పడితే చిన్నారుల కళ్ల కదలికలను ట్రాక్ చేసి వారి దృష్టి ఎక్కువగా ఎక్కడ ఉందన్నది కనిపెట్టారు. ఎరుపు, ఆకుపచ్చ బంతులతోనూ వారిని శాస్తవ్రేత్తలు పరిశీలించారు. కానీ పసుపు రంగు బంతులపైనే చిన్నారుల దృష్టి ఎక్కువగా ఉండిపోయింది.

-ఎస్.కె.ఆర్.