AADIVAVRAM - Others

స్ఫూర్తి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథం మాస్టారు క్లాసులో పాఠం చెప్తూ పిల్లల వైపు పరీక్షగా చూశారు.
వరుణ్ పక్కన కూర్చున్న శంకర్ తన పుస్తకంలో కాకుండా, వరుణ్ పైకి ఒరిగిపోయి వాడి టెక్స్ట్‌బుక్‌లో చూస్తూ కూర్చున్నాడు. మాస్టారికి కోపం వచ్చింది.
‘శంకర్..!’ అని గద్దించారు.
శంకర్ ఉలిక్కిపడి సర్దుకుని కూర్చున్నాడు.
‘నేను గొంతు చించుకుని పాఠం చెప్తుంటే నువ్వు వరుణ్‌తో ముచ్చట్లేంటి?’ అని ప్రశ్నించారు.
శంకర్ మాట్లాడలేదు. వరుణ్ భయం భయంగా మాస్టారి వైపు చూస్తున్నాడు. శంకర్ వౌనం మాస్టారికి కోపాన్ని ఎక్కువ చేసింది.
‘ఇట్లా రారా...’ అన్నాడు మాస్టారు.
శంకర్ మాస్టారు దగ్గరికి వెళ్లాడు. చెయ్యి చాచమని బెత్తంతో దెబ్బలు కొట్టాడు. శంకర్ బాధను ఓర్చుకుంటూ కన్నీళ్లు కార్చాడు.
మర్నాడు శంకర్ స్కూల్‌కి రాలేదు. ఎందుకో రాలేదనుకున్నాడు మాస్టారు. ఆ తర్వాత వరుసగా రెండు రోజులు కూడా రాలేదు.
హెడ్మాస్టర్ రామనాథం అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తుంటే శంకర్ స్కూల్‌కి రావడం లేదని తేలింది.
మర్నాడు హెడ్మాస్టర్ స్కూల్‌కి వస్తూ దారిలో ఉన్న శంకర్ ఇంటికెళ్లారు. శంకర్ తండ్రి వెంకటయ్య హెడ్మాస్టర్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.
‘సార్! మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్! కబురు పెడితే నేనే వచ్చేవాడిని’ అన్నాడు వెంకటయ్య.
‘్ఫర్వాలేదు. శంకర్ మూడు రోజుల్నుంచీ స్కూల్‌కి రావడం లేదు. ఏమైంది వాడికి? వొంట్లో బాగా లేదా?’ అని పరామర్శించారు హెడ్మాస్టర్.
‘బాగానే వున్నాడు సార్! స్కూలుకి పోనని మారాం చేస్తున్నాడు’ చెప్పాడు వెంకటయ్య.
‘ఎందుకు?’
‘విశ్వనాథం మాస్టారు అకారణంగా కొట్టాడట సారూ!’
‘విశ్వనాథం మాస్టారు కొట్టారా? ఎందుకు? శంకర్‌ని పిలువు’
శంకర్ వచ్చి హెడ్మాస్టర్ ముందు నిలబడ్డాడు.
‘ఏరా! మీ నాయన చెప్పింది నిజమేనా?’
‘ఔను సార్’
‘మాస్టారు ఊరికే ఎందుకు కొడతారు? నువ్వేం అల్లరి చేసావ్?’
‘నాకు టెక్స్ట్‌బుక్స్ లేవు సార్. నాయిన కొనలేదు. పాఠం చెప్తుంటే పక్కనున్న వరుణ్ బుక్‌లోకి చూస్తుంటే కొట్టాడు సార్!’ బిక్కమొహం వేసుకుని చెప్పాడు శంకర్.
హెడ్మాస్టర్‌కి పరిస్థితి అర్థమైంది. వెంకటయ్య బీదవాడు. ఊళ్లో వ్యవసాయ కూలీ. ఇల్లు గడవటమే కష్టం. అయినా కొడుకుని స్కూల్ మాన్పించకుండా చదివిస్తున్నాడు.
‘సరే! నేను మాస్టారుతో మాట్లాడతాను. నువ్వు ఈ రోజు స్కూలుకి రా! నేను టెక్స్ట్‌బుక్స్, నోట్స్‌లు అన్నీ ఏర్పాటు చేస్తాను’ అని వెళ్లిపోయారు హెడ్మాస్టర్.
స్కూల్‌కి వెళ్లిన తర్వాత విశ్వనాథం మాస్టారిని పిలిచి మందలించాడు హెడ్మాస్టర్. అసలే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు రావడం తగ్గింది. ఉన్న పిల్లల్తో జాగ్రత్తగా వ్యవహరించాలి కదా! అని చెప్పారు.
తర్వాత క్లాసుకి వచ్చి ‘శంకర్‌ది పేద కుటుంబం. కనుక బుక్స్ కొనుక్కోలేక పోయాడు. మీరంతా చందాలు ఇచ్చి వాడికి సహాయం చేయండి’ అని పిల్లల్ని కోరారు హెడ్మాస్టర్.
పిల్లలు ఉత్సాహంగా తోచిన డబ్బు తెచ్చి హెడ్మాస్టర్‌కి అందజేశారు. విశ్వనాథం మాస్టారికి ఇది నచ్చలేదు. ‘సార్! శంకర్‌కి మనమే పుస్తకాలు కొనిస్తే సరిపోయేది. దాని కోసం పిల్లలందరినీ ఎందుకు అడగాలి?’
హెడ్మాస్టర్ నవ్వి ‘అందరూ స్థితిమంతులు కాదు. కొన్ని పేద కుటుంబాలూ ఉంటాయి. కాబట్టి వున్నవారు లేనివారికి సహాయం చేయాలి అనే స్ఫూర్తి కలగడం కోసం ఆ పని చేశాను. కేవలం డబ్బు కోసం కాదు’ అన్నారు.

-వాణిశ్రీ