AADIVAVRAM - Others

గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో విదేశీ సైన్యం పాల్గొందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.రాజ్‌పథ్, న్యూఢిల్లీలోనే కాక మరే ఇతర ప్రాంతాలలో గణతంత్ర దినోత్సవం పెరేడ్ జరుగుతుంది?
ఎ) విక్టోరియా మెమోరియల్, రెడ్ రోడ్, కోల్‌కతా, పెరేడ్ గ్రౌండ్స్, సికిందరాబాద్
బి) శివాజీ పార్క్ స్టేడియం, ముంబై, మానెక్‌షా పెరేడ్ గ్రౌండ్స్, బెంగళూరు
సి) కామారాజార్ సలై (మెరీనా బీచ్ రోడ్), చెన్నై, అమరావతి, ఆంధ్రప్రదేశ్
డి) పైన పేర్కొన్నవన్ని ప్రదేశాలు

2.2015 నాటి గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం లేదా రథం ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. 2014 జూన్‌లో ఏర్పడిన తెలంగాణ 2015 గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో మొదటిసారి అరంగేట్రం చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల శకటాల ఇతివృత్తాలు ఏమిటి?
ఎ) అమరావతి మరియు గోల్కొండ కోట
బి) సంక్రాంతి సంబరాలు మరియు బోనాలు
సి) లేపాక్షి మరియు వేయి స్తంభాల ఆలయం
డి) మహానంది మరియు రామప్ప ఆలయం

3.గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి 29 నాడు విజయ్ చౌక్‌లో భారత సైన్యం, వైమానిక దళం మరియు నేవీ బ్యాండ్ల ప్రదర్శనతో జరుగుతుంది. ఆ కార్యక్రమం పేరేమిటి?
ఎ) బాలలకు ధైర్య సాహసాలకిచ్చే పురస్కారం
బి) గేలంట్రీ అవార్డులు
సి) 21 గన్ సెల్యూట్లు
డి) బీటింగ్ రిట్రీట్

4.్భరత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళల మోటార్ సైకిల్ రైడర్స్ కూడా మొదటిసారి గణతంత్ర దినోత్సవ పెరేడ్ 2018లో మోటార్‌సైకిల్ స్టంట్లను పాల్గొన్నారు. ఆ 113 మహిళా మోటార్ సైకిల్ దళం పేరేమిటి?
ఎ) సీమా భవాని (ది బోర్డర్ బ్రేవ్స్)
బి) సీమా సురక్ష బల్ రైడర్స్
సి) ఉమెన్ డేర్‌డెవిల్స్
డి) మా దుర్గా సేన

5.్భరతీయ రాజ్యాంగ ఒక సేకరించి సంచి (బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్) అని ఎందుకు పిలుస్తారు?
ఎ) భారత రాజ్యాంగం పౌరులందరూ రుణాలు తీసుకోవటానికి హక్కు కల్పించింది.
బి) ఇతర దేశాలు భారత రాజ్యాంగాన్ని నకలు చేశాయి
సి) భారతదేశ రాజ్యాంగంలోని అనేక అంశాలకి ప్రేరణ, వివిధ దేశాల రాజ్యాంగం నుంచి తీసుకొనబడింది.
డి) పైన పేర్కొన్నవేవీ కాదు

6.ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి భారతదేశ పంచవర్ష ప్రణాళికను తీసుకోవడం జరిగింది?
ఎ) యునైటెడ్ కింగ్‌డమ్
బి) సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ యూనియన్
సి) జపాన్
డి) ఫ్రాన్స్

7.్భరత రాజ్యాంగంలో ప్రస్తుతం ఇంచుమించు 449 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్, 5 అనుబంధాలు మరియు 113 సవరణలు ఉన్నాయి.
ఎ) ఒప్పు బి) తప్పు

8.్భరత రాజ్యాంగం 1950లో రాసి స్వీకరించి అమలుపరచిన సమయంలో 395 ఆర్టికల్స్, 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్లు మాత్రమే ఉండేవి.
ఎ) ఒప్పు బి) తప్పు
9.1950లో భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటి ప్రధాన అతిథిగా ఏ దేశాధ్యక్షుడు వచ్చారు?
ఎ) కొరియా
బి) యుఎస్‌ఎస్‌ఆర్
సి) ఇండోనేషియా
డి) జపాన్

10.1950లో గణతంత్ర దినోత్సవ పెరేడ్ ప్రారంభమైనప్పటి నుండి మొదటిసారి, ఒక విదేశీ సైన్యం పాల్గొని రాజ్‌పథ్‌లో కవాతు చేసింది. ఏ దేశం యొక్క సైన్యం మరియు ఏ సంవత్సరంలో?
ఎ) ఫ్రాన్స్, 2016
బి) యుఎస్‌ఎ, 2015
సి) యుఎఇ, 2017
డి) రష్యా, 2007

11.్భరత రాజ్యాంగాన్ని 1949లో రాజ్యాంగ సభ ఆమోదించింది. ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ దినోత్సవ వార్షికోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు?
ఎ) 4 నవంబర్
బి) 26 నవంబర్
సి) 26 జనవరి
డి) 24 జనవరి

12.చరిత్రలో మొదటిసారి గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో పది దేశాల ఆసియాన్ నాయకులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. 2018 గణతంత్ర దినోత్సవం కోసం వారిని ఆహ్వానించే ప్రాముఖ్యత ఏమిటి?
ఎ) ఆసియాన్ 50 సంవత్సరాల నిర్మాణం పూర్తి చేస్తుంది
బి) ఆసియాన్ గ్రూప్ భారత్‌కు 25 సంవత్సరాల భాగస్వామ్యం పూర్తవుతుంది
సి) ఎ మరియు బి
డి) పైన పేర్కొన్నది కాదు

ఆంధ్రభూమి పాఠకుల కోసం వారం వారం అందించే క్విజ్ ఇది. ఈ వారం ప్రశ్నలకు వచ్చే శనివారం (10వ తేదీ)లోగా సరైన సమాధానాలు రాసి పంపిన వారి పేర్లను ప్రచురిస్తాం.
అడ్రస్
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్ - 500 003
సమాధానాలు sundaymag@andhrabhoomi.net కు pdf లోనూ పంపొచ్చు.

-సునీల్ ధవళ