AADIVAVRAM - Others

యశంబుచాటు వత్సరాధిపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలంబ వత్సరేశ్వరుండు పృథ్వినేల వచ్చెనే
విలంబమేల స్వాగతంబు వేడ్కతోడ పల్క, కో
కిలంబ కూజితాలు సల్పుకింశుకాల భక్షణన్
భళీ! యటన్న పాలనంబు భాగ్యమందజేయగన్

విజేతవై, భవత్సహోదరాళి వెల్గుమా! విలంబరో!
విజృంభణంబుతోడ శాంతివృద్ధి చెంది ధాత్రిపై
భజింపగా వసంత సౌఖ్యమట్లు స్వాంతమందునన్
ప్రజల్, సుఖంబునందు భవ్యపాలనంబు సల్పుచున్

మరుత్తు లాలనార్ద్ర భావమార్దవంపు స్పర్శలన్
ధరిత్రి జీవపాళి మారుదాస్య శృంఖలంబులన్
వరించి సంచరించగోరు వైభవంబు పోలెడున్
సరాగమొప్పు పాలనంబు సల్పుమా! విలంబరో!

అళుల్, సుమాళిచెంత నాట్యమంద మొప్పజేయుచున్
భళీ! మరంద పానలోల వర్తులౌ విధంబునన్
విలంబ! నీదు పాలనంబు తెల్గు వీధులందు సద్విధిన్
మెలింగి సాధుసన్నుతంబువైన మేలు కల్గి పొల్చెడున్

వరాల జల్లులే బిరాన వైభవింప జల్లుచున్
ధరిత్రి యందె ఆంధ్ర సీమ తళ్కులందు తీరునన్
హరోం హరాయటంచు మద్యమాకృతిన్ మెలింగి యే
సిరుల్ కొరంత లేని రీతి శ్రేయమీ! విలంబరో!

తెలుంగు వారి పౌరుషంబు తేటతెల్లమంద, ఓ
విలంబ! ఉద్యమించి ఆంధ్రివెల్గు నందజేసెడున్
ప్రలోభ శూన్య పాలనంబు రాజిలంగ మెల్గుచున్
భళీ! యశంబుచాటు, నవ్యవత్సరాధి నాయకా!

-రా.సీతారామశర్మ 9701764878