AADIVAVRAM - Others

సహనగుణం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహనం అనే గుణం మానవునికి ఆభరణం వంటిది. అది లోపించడం వలన అనేక వైషమ్యాలు కలుగుతున్నాయి. కలహాలు జరుగుతున్నాయి. సహనం అంటే క్షమా ఓర్పు అని కూడా చెప్పవచ్చు. పరీక్షన్మహారాజు వేటకై అడవికి వెళ్లిన సమయంలో దాహం వేసింది. చుట్టుపక్కల పరికించగా ఒక ముని ఆశ్రమం కనపడింది. అక్కడ శమీకుడనే ఋషి యోగనిష్ఠలో ఉన్నాడు. రాజు అతనిని సమీపించి మంచినీరు ఇవ్వమని కోరగా బాహ్యస్మృతిలో లేని కారణంగా ఋషి స్పందించలేదు. రాజు సహనం కోల్పోయి ఋషి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించి, దగ్గరగా చచ్చిపడి ఉన్న పామును వింటికొనతో తీసి అతని భుజంపై వేసి వెళ్లిపోయాడు. తరువాత శృంగి అను శమీకుని కుమారుడు అక్కడకు వచ్చి తండ్రికి జరిగిన అవమానం భరించలేక తన తండ్రిని ఈ విధంగా గేలి చేసిన వ్యక్తి ఏడు రోజులలో తక్షక విషాగ్నికి దగ్ధుడగుగాక అని శపించాడు. పిదప బాహ్యస్మృతిలోకి వచ్చిన తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడతడు ‘నాయనా! నిగ్రహం కోల్పోయి నన్ను అవమానించిన వ్యక్తిని దారుణంగా శపించావు. మునులకు ప్రధానమైనది క్షమాగుణం. దానిని విస్మరించావు’ అని మందలించి దివ్యదృష్టితో తనను అవమానించినది పరీక్ష్మన్మహారాజు అని గ్రహించి, తిరిగి కుమారునితో ‘తండ్రి వంటి ప్రభువును శపించావు. రాజు లేకపోతే అరాచకం ఏర్పడి అల్లకల్లోలాలు జరుగుతాయి. నీ తొందరపాటు ఎంత పని చేసిందో చూడు’ అని శిష్యుల ద్వారా రాజుకి శాప విషయం తెలియజేసి నివారణోపాయాలు అనే్వషించుకోమన్నాడు. తాపసుల శాపం తీవ్రమైనది. పరీక్షిత్తు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం తప్పలేదు. కౌశికుడనే ముని ఒక వృక్షంపై కూర్చుని తపస్సు చేసుకుంటుండగా పక్షి ఒకటి పైనుండి అతనిపై రెట్ట వేసింది. ముని పైకి తీవ్రంగా పక్షికేసి చూడగా అది మరణించి నేలపై పడింది. వెంటనే స్నానం చేసి భిక్షాటనకి బయల్దేరాడు. ఒక ఇంటి వద్ద భిక్ష వేయడం ఆలస్యమైంది. అందుకు ఆ గృహిణి యెడల లోలోపల ఆగ్రహం కల్గింది. అది ఆమె గమనించి, మీ వంటి మునులకు ప్రధానమైనది సహనం. అది నీవు కోల్పోయావు. భర్త సేవలో ఉండడం వలన ఆలస్యమైంది అని భిక్ష వేసి మిథిలా నగరంలో ధర్మావ్యాధుడనే బోయవాడున్నాడు. అతని వద్దకు వెళ్లి జ్ఞానార్జన చేయి అని చెప్పగానే ఆమెకు నమస్కరించి మిథిల వెళ్లి వ్యాధుని వద్ద జ్ఞానార్జన చేసి సహనశీలుడైనాడు. గ్రీసు దేశపు వేదాంతి అయిన సోక్రటీసు భార్య గయ్యాళి. ఒకరోజు అతనిని ఆమె దూషించడం ప్రారంభించింది. అతడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడామె ఒక బిందెతో నీళ్లు తెచ్చి అతనిపై పోసి వెళ్లిపోయింది. అది చూసిన వారు అతనిని ఎందుకు వౌనం వహించారు? అని ప్రశ్నించగా, ఉరుములు ఉరిమిన తరువాత వర్షం పడటం సహజమే కదా అని చెప్పగా వారు అతని సహన గుణానికి విస్మయం చెందారు. మహమ్మదు ప్రవక్త రోజూ సాయంత్రం అనుగ్రహ సంభాషణకి ఒక వీధి గుండా వెళ్లేవాడు. ఆ వీధిలో ఒక మేడపై నుంచి ఒక స్ర్తి అదే సమయంలో అన్యాపదేశంగా ఆయనను దూషించేది. ఆయన వౌనంగా వెళ్లిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం మేడపై నుండి ఆమె దూషణం వినిపించలేదు. ప్రవక్త లోనికి వెళ్లి ఇంటి వారిని ఆమె గురించి అడుగగా ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పాడు. అప్పుడాయన ఆమెను సమీపించి అమ్మా ఈ రోజు నీవు కనిపించలేదు. అందువలన నిన్ను చూద్దామని వచ్చాను అని ఆమెను స్పృశించగా జ్వరం తగ్గిపోయి లేచి కూర్చుని తన తప్పిదాన్ని మన్నించమని ప్రాధేయపడింది. అందువలననే ప్రవక్తను సహనానికి మారుపేరు అన్నారు. సహనం అసమర్థత అని భావించకూడదు.

-వేదుల సత్యనారాయణ