Others

ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓనమాలు దిద్దలేని ప్రాయానికి..
ఊహల ఉషస్సులో ఉరకలెత్తాలని ఆశ
పరిజ్ఞానాన్ని పెంచలేని పరువానికి..
స్వేచ్ఛగా స్వైరవిహారం చేయాలని ఆశ...
సున్నితంగా వికసించే కుసుమానికి..
సుకుమారిణిగా సౌరభాలు సుమగంధించాలని ఆశ..
క్షణభంగురమైన ఔన్నత్య ఊహను క్షణికావేశం
కట్టడి చేస్తున్న వేళ..
మదిలో మోహరించిన మంచితనంతో దాన్ని
ఓదార్చాలని ఆశ..
వినూత్న రహస్యాల సృష్టికి నిలయమైన విశ్వానికి..
డోలయామాన స్థితిలో ఊగిసలాడ్తున్న మదిని
ఆలోచనల ఉప్పెనతో ఊరడించాలని ఆశ..
మరులు గొల్పే మంచితనం మదిలో నిండుకుంటున్న వేళ..
పరిణితి అనే సాధనాన్ని మదిపై సంధించాలని ఆశ..
ఆశే- జీవితమైన వేళ..
దానే్న జయించాలని ఆశ.
*

-శృంగవరపు రచన.. 9959181330