Others

కళానిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు
మృదు తరంగ మృదుపద మంజీర నాదాలతో
వాక్ భూషణ పండితులతో.. సాహితీ సభలతో
నిరంతరాయంగా.. అద్వితీయంగా వెలిగింది
మహా విద్వాంసులతో సంగీత ఝరులు
వీనుల విందుగా వినిపించేవి

ఆ దారి వెంట వెళ్లేవారెవరైనా సరే
అక్కడ జరిగే సభలోకి
ఒక్కసారి తొంగి చూశారంటే...
కాళ్లు రానని మొరాయిస్తాయి

ఆ సరస్వతీదేవి
సంగీత సాహిత్యాలతో కలిసి
ఆ వేదికపై.. నిత్యం నర్తిస్తూనే ఉంటుంది
అక్కడ ఆసనాలన్నీ
పలకరిస్తే పద్యం చెబుతాయి
అక్షరం ముక్క రానివాడైనా
ఆ సభాస్థలిలో
అడుగుపెడితే.. సాహితీ సంపదను
మూట గట్టుకుని వెళ్లాల్సిందే...

నిశిరాత్రి వేళ కూడా
ఆ ప్రాంగణంలో.. శ్రోతల చప్పట్లు
మారుమోగుతూనే ఉంటాయి
కళలకు కాణాచి అయిన
ఆ సాహితీ సౌధం
ఈ ప్రపంచీకరణ.. నగరీకరణ నేపథ్యంలో
‘ఐమ్యాక్స్’గా రూపుదిద్దుకుంది
ఆ కళానిలయం పునాది మీద
పాశ్చాత్య భూతం విలయతాండవం చేస్తోంది
*

-లక్ష్మిమైథిలి ములుగు