Others

పాపం, పుణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరం కాలిపోయనా ఆత్మ చావదు. అట్లానే ఈ జన్మలో చేసిన పాపాలుకాని పుణ్యాలు కాని మరుజన్మకు వాసనారూపంలో అంటుకుని వస్తాయ. పుణ్యాల వల్ల సుఖసంతోషాలు ఎలా కలుగుతాయో చేసిన పనిలో విజయం ఎలా వస్తుందో ఆ విధంగా పాపాల వల్ల రోగాలు, దారిద్య్రం పుట్టుక నుంచి వదలకుండా పీడిస్తూ ఉంటాయ. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దాని సహజ లక్షణం ప్రకారం కాలినట్టుగా పాపాలు తెలియక చేసినా తెలిసి చేసినా వాటి ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.
పురాణాల్లో పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఉంటాయ. కానీ మనిషిలో పరివర్తన రాకుండా అయ్యో ఇలా చేశానే అనే వేదన కలుగుకుండా, ఇంకెప్పటికీ ఇలాంటి పనులు చేయకూడదు అని భావం రాకుండా ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా వచ్చే పుణ్యం ఏమీ ఉండదు. అంతర్మథనం తో రగిలిపోయ ఇక ఎప్పటికీ చేయను కాక చేయను అని మనసులో దృఢ నిశ్చయం తీసుకొని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఏదైనా మేలు జరుగుతుందంటారు ప్రాజ్ఞులు.
కనుక పాపపుణ్యాలను తెలుసుకోవడం, ధర్మాధర్మాలపై అవగాహన కలిగి ఉండడం అనేది అందరికీ అంత సులువైన పని కాదు. ధర్మవిచక్షణ జ్ఞానంతో కూడుకున్న పని. ఒకరికి మంచి అనిపించిది మరొకరికి చెడు అవుతుంది. భగవంతుడు అన్నింటినీ తన సృష్టిలో పరస్పరాధీనములు చేసి ఉన్నాడు. కనుక సులభంగా ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్పలేము. కనుక వేద వ్యాస మహర్షి పరులకు అంటే ఎదుటి ప్రాణికి హితాన్ని కలిగిస్తే అది పుణ్యకార్యమే. వారికి అహితాన్ని కలిగిస్తే అది పాపమే కనుక ఇక మంచి చెడు నీకు నీవే విచక్షణ తో ఆలోచించుకుని పనులు చేయ అన్నారు. జ్ఞానులు అసలు చేసే పని ఏదైనా దానిని ఈశ్వరార్పణం చేసి చేస్తే ఆ పని తాలూకూ ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం ఇది నా కర్తవ్యం అని చేస్తే చాలు మనకేమీ కావాలో ఆ భగవంతుడు ఇవ్వనే ఇస్తాడు అని అంటారు.
కలియుగంలో పుణ్యం సంపాదించడానికి కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే శరణ్యం అని పెద్దలు చెపుతారు. అయితే ఆ నామస్మరణ మనఃస్ఫూర్తిగా చెయ్యాలి. కేవలం ఆర్భాటం కోసమో, పేరుకోసమో, అందరూ నన్ను గుర్తించాలనో, లేక నేనే గొప్ప భక్తుడినన్న అహంకారంతోనో ఇంకేదైనా కారణాలు పెట్టుకుని భగవంతుని స్మరణ చేస్తే లాభమేమీ ఉండదు.
భగవంతుడిని పూజిస్తే ఆయనన్ను నమ్మితే మనసా వాచాకర్మణా భగవంతుడు తప్ప అన్యమేమీ లేదని స్థిర నిశ్చయంతో పూజ చేయాలి. అంతేకాని విజయం లభిస్తే అంతా నా కష్టార్జితం అని దుఃఖమో, అపజయమో వస్తే అంతా తలరాత ఇది అంతా ఆ దేవుని వల్ల వచ్చింది అంటే దీన్ని భక్తి అనరు.
ఏమైనా మన పురాణాల్లో చెప్పిన విషయాలను వినో, లేక చదివో వాటిని పూర్తిగా అర్థం చేసుకొని , బాగా ఆలోచించుకుని ఎందుకు చెప్పారో బాగా వివేచన చేస్తే అసలీ భగవంతుడు చెప్పినదేమిటి మనం చేస్తున్నదేమిటో అని ఎవరికి వారికి అవగాహనకు వస్తుంది. అపుడు ధర్మాధర్మాలు తెలుస్తాయ. వాటి వల్ల పాపపుణ్యాలు వస్తాయ. వాటి నుంచి సుఖసంతోషాలు కలుగుతాయ.
ఈ కలియుగంలో మనిషిగా పుట్టిన ప్రతివారు మానవసేవను మించిన మాధవసేవ లేదని ఎన్నో సందర్భాలలో మహాపురుషులు, మహాత్ములు చెప్పిన విషయాన్ని మరవకుండా మనం చేతనైనంతలో చేయాలి. అన్నార్తునికి ఆహారం ఇవ్వడం, ఒక దాహార్తునికి దప్పిక తీర్చడం మించిన పుణ్యం ముంటుంది కనుక ఎదుటి వారి దుఃఖాలను తెలుసుకొని దానికి స్పందించి చేతనైన సాయాన్ని చేసి వారి దుఃఖాన్ని దూరం చేస్తే చాలు. అదే పుణ్యం, దానే్న భగవంతుడు మెచ్చుతాడు. మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా, ఎన్ని రూపాలలో భగవంతుని దర్శించుకున్నా ఆపదలో, కష్టంలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయకపోతే అంతా నిష్ప్రయోజనమే అవుతుంది. దైవం మానుషరూపేణా అన్నారు కదా. అందుకే ప్రతి మనిషిలో దైవాన్ని చూడగలగాలి. అపుడే భగవంతునికి భక్తునికి తేడా కనిపించదు. అదే భక్తి పరమార్థంగా తెలుస్తుంది. భక్తి కలిగిన వారు పాపాలు చేయరు కదా.

- కూచిబొట్ల వెంకట లక్ష్మి