AADIVAVRAM - Others

మధురభక్తిలో సాధన (రాస క్రీడాతత్త్వము-2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ శుకుడు పరమ మనోహరమైన శ్రీకృష్ణుని శృంగారమయ తత్త్వంలో మునిగిపోయి ఉండటంవల్ల, చాలా సంగ్రహమైన సమాధానం మాత్రం చెప్పి, వినే పరీక్షిత్తుకి తృప్తి కలిగిందా, లేదా, అని చూసుకోకుండా, ముందు కదలోకి వెళ్ళిపోయాడు.

(ii) అక్కడ శుకుడు చెప్పిన సమాధానమల్లా ఒక్కటే. భగవంతునిలో తాదాత్మ్యం పొందటానికి ‘‘కామమైనా సరే, క్రోధమైనా సరే, భయమైనా సరే, స్నేహమైనా సరే, భకె్తైనా సరే, ఏదో ఒకటి తీవ్రంగా వుంటే చాలు. ఇంక వేరే ఏమీ అక్కర లేదు. దాంతోనే ముక్తి వచ్చేస్తుంది’’ అని.

(iii) శృంగార ఘట్టం సాగుతూ వుండగా, స్వయంగా శ్రీకృష్ణుడిచేత కొంత తత్త్వోపదేశం చేయించి, మళ్ళీ శృంగారంలోకి వెళ్ళిపోయాడు, వ్యాస భగవానుడు.

(iv) అందుకే, శ్రీమద్భాగవత వ్యాఖ్యాతలలో ప్రముఖుడైన శ్రీ్ధరాచార్యుడు ఈ ఘట్టాన్ని ప్రారంభిస్తూ-
బ్రహ్మాది జయ సంరూఢ
దర్ప కందర్ప దర్పహా
జయతి శ్రీపతిర్గోపీ
రాసమండల మండనః ॥
(బ్రహ్మాది దేవతలను జయించటంచేత మన్మథుడికి గర్వం బాగా పెరిగి పోయింది. శ్రీకృష్ణుడు అతని గర్వాన్ని తొలగించాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆయన రాసలీలలోకి దిగి, గోపికా మండలమధ్యంలో ఒక అలంకారంలాగా నిలిచి జయించాడు) - అని సొంత శ్లోకం ఒకటి రాశాడు.

(i) ఆ వ్యాఖ్యాత తన శ్లోకం మీద తనే ఒక పూర్వపక్షం లేవదీస్తూ- ‘‘నను విపరీతమిదం పరదార ఇలా చేయటం ద్వారా వ్యాసుడు సాధించినదేమిటంటే - ఈ ఘట్టాన్ని ఉపదేశం పొందేందుకు అందరూ అర్హులు కారనీ, మధురభక్తి మార్గంలో కొంత సాధనచేసిన వారికోసం మాత్రమే ఈ ఘట్టాన్ని వ్రాస్తున్నాననీ, ఆయన ఈ రచనాశిల్పం ద్వారా సూచన చేస్తున్నాడు.
అయితే పురాణ రచన అన్నది సామాన్య జనులందరి కోసం చేసే రచన కనుక, దీన్ని అన్ని రకాలవారూ చదువుతారు. మధురభక్తిలో ఒక స్థాయిని సంపాదించనివాడు చదివినా, వాడు ఈ ఘట్టంవల్ల చెడిపోకూడదు. చేతనైతే వాడు ఇకపైన మధురభక్తిలోకి ప్రవేశించాలి. లేకపోతే వాడు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాడో, ఆ మార్గం దీనివల్ల గట్టిపడాలి. ఆ లక్ష్యంతోనే వ్యాసభగవానుడు ఈ ఘట్టాన్ని ఈ రకమైన రచనా శిల్పంతో తీర్చిదిద్దాడు. కవిత్వపరంగా కూడా ఈ ఘట్టం రససిద్ధికి ఒక చక్కని ఉదాహరణ.
ఈనాడు సామాన్యంగా అందరి హృదయాలూ సందేహాలతో కలుషితమైనందు వల్ల, మనం ఈ ఘట్టాన్ని చెప్పుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా చెప్పుకోవాలి. కనుక, వ్యాసుడు ఈ ఘట్టం చివరలో చేసిన చర్చను ముందే చెప్పుకుని, ఆ తరువాత అసలు ఘట్టంలోకి ప్రవేశిద్దాం.

పరీక్షిత్తు ప్రశ్నలు :-
కథ వింటున్న పరీక్షిత్తు ఈ ఘట్టంలో నిర్మొహమాటంగా కొన్ని ప్రశ్నలు గుప్పించాడు. అవి ఇలా వున్నాయి -
(i) శ్రీకృష్ణుడు ధర్మస్థాపనకూ, అధర్మ నిర్మూలనకూ, అవతరించాడని చెప్పారు గదా. అలాంటివాడు అధర్మం చేసి చూపించవచ్చా?

(ii) ఆయన కన్యలతో మాత్రమే కాక, ఇతరుల భార్యలతో కూడా క్రీడించాడు గదా. ఇది సాహసం గాదా? (సాహసం అంటే తెలిసి చేసే అధర్మం.)

(iii) ఆయనకేమీ కామం లేదు. భక్తులను తృప్తిపరచడానికే అలా చేశాడంటారేమో? ఆయన ఉద్దేశం ఏదైనా, తాను ఇతరులకు ఆదర్శంగా వుండవలసినవాడై వుండి, లోకదృష్టికి నింద్యమైన పని చెయ్యవచ్చా?

iv) గొప్పవాళ్ళు ఏమి చేస్తే లోకులూ అదే చేస్తారని ఆయనే చెప్పాడు గదా. (యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః - అని భగవద్గీత.) మరి, ఆయనే ఇలాంటి పనులు చేస్తే, లోకులంతా ఆయన చేసినట్టే చేసి, మేమూ ఇతరుల తృప్తి కోసమే చేశాం-అనరా?

(v) మొత్తం మీద ఆయన చేసిన ఈ పనివల్ల లోకానికి కీడు రాదా?-అని.

ఈ రోజుల్లో మేము నాస్తికులమనుకునేవాళ్ళు కూడా ఇంత లోతుగా ప్రశ్నించలేరు. ఎలా ప్రశ్నించాలో కూడా వ్యాసుడే మనకు బోధిస్తున్నాడని మనం తెలుసుకోవాలి.
శుకయోగీంద్రుడు ఈ ప్రశ్నలకు అనేక కోణాల నుంచీ సమాధానాలు చెప్పాడు. మన శాస్త్రాల సాంప్రదాయంలో అనేక పక్షాలను వివరించేటప్పుడు ఒక్కొక్క పక్షమూ, ఒక్కొక్క దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, వారు చెప్పే వరుస కూడా వారికి ముఖ్యమే. ఒక దృక్కోణం కన్నా, మరింత మెరుగైన దృక్కోణం చూపించటం కోసం, దృక్కోణాల వరుసను నిర్దేశిస్తారు. చిట్టచివరి దృక్కోణంలో అసలైన సిద్ధాంతం వుంటుంది. శుకబ్రహ్మ ఆ విధానానే్న పాటించాడు.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060