Others

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

17.ఓం హిరణ్య రేతాయ నమః
హరుని తేజము శరవణ సరసునపడే
కనకమాయె, స్కందునికృతి కలుకుడిపిరి
కార్తికేయ నామాన విఖ్యాతుడయ్యె
శంభుడు ‘హిరణ్యరేతుడై’ జగము మురిసె

18. ఓం దుర్ధర్షాయ నమః
విక్రమించి యుద్ధ మున పరాక్రమింప
శర్వు నెదిరింప నెవరికి సాధ్యమగును ?
విలయకాలుడైనను ప్రేమ నిలయుడతడు
పేరు‘దుర్ధర్షుడ’ని కల్గె - వినుతి జేతు

19. ఓం గిరీశాయ నమః
మంచుకొండల రేడు హైమవతిజోడు
ఉన్నస్థితి నుండి ఎదిగి సర్వోన్నతమగు
పరమపదమును జేరెడు పథము జూపి
అల ‘గిరీశుడై’ కీర్తితో అలరినాడు

20. ఓం అనఘాయ నమః
పాపపుణ్యంబు లంటని భాస్కరుండు
భోగిపై యోగిపై కుక్క పులులపైన
మలముపై మంచుపై మల్లెమాలపైన
పడిన తనకాంతి కేయ్టు పట్టుకోదు
‘అనఘ’ నామార్థమిది మనసార గొలుతు

-- కడియాల మధుసూదన రావు 9030907191