Others

భగవత్ గీతా జయంతి ( నేడు కార్తీక అమావాస్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన దినంగా పరిగణిస్తారు. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశిని కూడా భగవద్గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవద్గీత ఒకశాస్త్రం. ఒక ఐతిహ్యం. జీవన్ముక్తికి మార్గదర్శి. ద్వాపరంలో సంప్రాప్తించి, ఆచంద్రార్కం మానవాళిని నడిపే జీవిత నావ. కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ద ప్రారంభ దినంగా భావించ బడుతుంది. కార్తీకమాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు, కౌరవుల వద్దకు రాయబారానికి పయనమైనట్లు భారతంలో ఉంది. కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు. వస్తూ కర్ణునితో మాట్లాడాడు. సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్దం ప్రారంభం కాగలదని కర్ణునికి చెపుతాడు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టపరచ బడింది. భీష్మాచార్యులు యుద్దం చేసింది పది రోజులు. భారత యుద్ద ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘ శుద్దాష్టమి. అదీగాక భారతయుద్ద ప్రారంభంలో అర్జునుడు బంధు వధకు శంకిస్తాడు.
ఆసందర్భంలోనే శ్రీకృష్ణుడు, విజయునికి తత్త్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం యుద్దం ప్రారంభ దినాన జరిగింది. ఆ దినాననే గీతా జయంతి (్భగవద్గీత పుట్టినదినం)గా జరపడం కొన్ని చోట్ల ఉంది. అయితే మార్గశిర శుక్లపక్ష త్రయోదశి నుండి పుష్య శుద్ధ పాడ్యమి వరకు 18దినాలు భారతయుద్ధం జరిగిందని, శుద్ధ త్రయోదశికి రెండు దినాల ముందు ఏకాదశి నాడు భగవద్గీత చెప్పబడిందని, ఆరోజే గీతా జయంతి జరపడం సమంజమని కొందరి విశ్వాసం.
అందువల్ల కార్తీక అమావాస్య, మార్గశీర్ష శుక్ల ఏకాదశి గీతా జయంతిని జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494