AADIVAVRAM - Others
స్టేటస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 March 2019
-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505
అది ఓ నగరం.. మహానగరం...
అందొక పొదరిల్లు.. చుట్టూరా ఆకాశాన్నంటే
సుందర హర్మ్యాలు..
ఏపుగా ఎదిగి ఊర్ధ్వాకాశాన్ని తాకే
పలురకాల పాశ్చాత్య వృక్షాలు...
రకరకాల రంగురంగుల క్రోటన్ మొక్కలు...
పూలు పూయవు పరిమళించవు
ఆకులు రాలవు కాకులూ వాలవు
సుమ సుగంధ మకరందాలకై మాధుర్యాలకై
జుమ్మను భ్రమరమ్ములు ఇట చేరవు
బహుశా పూసౌరభాలు పరిమళించకనేమో
కోయిల కుహూకుహూ గీతికల్లేవు
రామచిలుకలు వాలవు గొరవంకలు దరి చేరవు
మనుషులకు పశుపక్ష్యాదులకి
ఆరోగ్యాన్నొసగే వేప మామిడి
కరివేపాకు మునగ ఇత్యాదులు
మరి అగుపించవు
అట్టి సుందర వనం... మనకెంతో ఘనం...
పాశ్చాత్య నాగరికాభిలాషులకు
స్టేటస్ సింబల్.