AADIVAVRAM - Others

‘హైదరాబాద్ విముక్తి’లో బాటెన్ చొరవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్లమూలం: ఆచార్య ఎస్.వి.శేషగిరిరావు. ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు.. ఇప్పుడు ఛాన్సలర్: కేరళ కేంద్ర విశ్వవిద్యాలయం, కాసర్‌గోడ్
(‘ఇతిహాస సమాచార్’ దసరా - దీపావళి ప్రత్యేక సంచికలోని వ్యాసానికిది అనువాదం. ‘ఇతిహాస సమాచార్’ ప్రైవేట్‌గా నడిపే పత్రిక. కొంచెం దీర్ఘమైనా, నాటి చరిత్ర గురించి తెలుసుకోవలసిన, అనేకానేక విషయాల సమాహారం. శేషగిరిరావుగారి శిష్యుడు ‘చాణక్య’, వారి అనుమతితో, అనువదించిన వ్యాసమిది.)
*
1946 సంవత్సరాంతానికి- బ్రిటీష్ వారికి తామిక ఎంత మాత్రం భారతదేశాన్ని తమ పాలనలో ఉంచుకోలేమని స్పష్టమైంది. తాము వెళ్లేటప్పుడు, 1857 నుంచి తమకు పూర్తి సహకారాన్నందిస్తున్న ఇస్లాం రాజకీయ నాయకులకు బహుమతి లాంటిది ఇవ్వాలనీ, రెండవది -ఈ భారతదేశం, భవిష్యత్‌లో బలమైన జాతిగా ఆవిర్భవించకుండా ఉంచే ప్రయత్నం పూర్తిగా చేయాలనీ.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, ఈ ఆగ్నేయాసియాలో తమ సైన్యానికి సుప్రీం అధిపతి లూయిస్ వౌంట్ బాటెన్. కాబట్టి అతనే తమకు తగిన అధికారి అనుకున్నారు. దానికి తోడు ఈయన, ఈయన భార్య ఎడ్వినా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వామపక్ష అభిమానులుగా పేరు పొందారు.
బ్రిటీష్ పాలకులు, కమ్యూనిస్టులు పాకిస్తాన్ కోసం ఎంత ఉత్సాహంగా ప్రచారం చేసిందీ గమనించారు. అంతేకాదు, వారు కలకత్తా పాకిస్తాన్‌కు చెందాలని కూడా వాదించారు. దాదాపుగా, కమ్యూనిస్టులు, బ్రిటీష్ ఇంపీరియలిస్టులు, ముస్లిం లీగ్‌ల మధ్య ఆశ్చర్యకరమైన ఏకాభిప్రాయం, ద్యోతకమయింది. ఈ పరిస్థితులలో, ఒక్క వౌంట్ బాటెనే వైస్రాయిగా తగినవాడు అని బ్రిటన్ నిశ్చయించింది. ఇంకో కారణం, నెహ్రూగారు దాదాపుగా ప్రొ.లెఫ్ట్.
పైగా వౌంట్ బాటెన్ తన లెఫ్ట్ దృక్పథంతో, తనకు హిందువుల పట్ల గల వ్యతిరేకతను, ముస్లిం పట్ల అభిమానాన్ని దాయగలడు.
వౌంట్‌బాటెన్ ఇంటర్వ్యూ
చాలా సంవత్సరాల తర్వాత, లారీ కాలిన్స్ - డొమినిక్ లాపెర్లీలకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు: ‘నేను ముస్లిం లీగ్ వారిని అభిమానిస్తాను. వారు ఎక్కువగా భారత సైన్యంలోని, అధికార గణానికి చెందినవారు.. నేను నిజంగా ముస్లింలను ఇష్టపడతాను. వారిలో అనేక మంది నా స్నేహితులు.
‘్భరతదేశం చరిత్రను మరవవద్దు, అది బేసిక్‌గా ఒక విజయపరంపర. మొగలారుూలు వచ్చి, వారు ఇండియాను జయించి, ఇండియాను నడిపారు. దక్షిణ భారతంలో, నిజాం బోటివారు, ఆంగ్లేయుల వైస్రాయిలు. హిందువులు పూర్తిగా ఓడి, ఆక్రమిత శక్తిచేత ఆక్రమింపబడిన వారయ్యారు.
‘...సూటిగా చెప్పాలంటే, ఏ ముస్లిం, బ్రిటీష్ వారి మీద ఎలాంటి కుట్రలో పాల్గొనాలన్నా.. అది తమ స్థానానికి బలమిచ్చిందన్నారు. జిన్నా చివరగా కోరిందేమిటంటే, మనం వెళ్లాలని. మొదట్లో ఆయన చెప్పింది ప్రత్యేక పాకిస్తాన్ అవసరం లేదనీ, మనం ఉండాలనీ, వారి తరఫున మనం పగ్గాలు పట్టాలని. కాని హిందువులు, మనం వెళ్లాలని కోరారు. (He said first he did't want a seperate Pakistan, just wanted us to stay and hold the reins for them. But the Hindus wanted us to go)
సర్దార్ ఫటేల్ పట్ల వౌంట్ బాటెన్ అభిప్రాయం
‘ఆయన బలహీనులని భయపెట్టే ఒక పెద్ద, నేను దానిని గుర్తించాను. అలాంటి వారిని ఒకే విధంగా చూడాలి. బలంగా కొట్టండి, ఎంత బలంగా వీలయితే, అంత బలంగా (Hit him hard, as hard as you can.
విభజన పథకం మొదలైంది
వౌంట్ బాటెన్, ఢిల్లీలో 1947, 22 మార్చిలో కాలూనాడు.
వౌంట్ బాటెన్ లండన్‌లో ఉండగానే, బ్రిటీష్ ప్రధాని ఆట్లీ, బ్రిటీష్ పాలన అంతమవబోతోందని, ఒక ప్రకటన చేశాడు. అందులో, రెండు ప్రధాన విషయాలున్నాయి.
‘బ్రిటీష్ పాలకులు (His Majesty's Government) ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నారు. తమ అధికారాన్ని, బాధ్యతాయుతమైన భారతీయుల చేతిలో, 1948 జూన్ లోపుగా, ఉంచదలచుకున్నారు.’
‘...ఒకవేళ, అలాంటి రాజ్యాంగం (1946 మే 16 ప్లాన్ ప్రకారం) పూర్తిగా ప్రతినిధుల అసెంబ్లీ చేత తయారుచేయబడకపోతే, ఆ తేదీన కేంద్ర ప్రభుత్వ అధికారాలు, ఆ తేదీన కొన్ని గాని, పూర్తిగా గాని బ్రిటీష్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి గాని, లేక కొన్ని ప్రాంతాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు గాని లేక తనకు చాలా హేతుబద్ధమని తోచిన విధంగా అప్పగించవచ్చు.’
బ్రిటీష్ వారు తమ నిష్క్రమణను హుందాగా చూపదలచుకుని, దానికి ‘అధికార బదిలీ’ (Transfer of Power) అని పేరుంచారు. ఇంకో విధంగా, హిందువులు గనుక పాకిస్తాన్‌కు అంగీకరించకపోతే, భారత్ ముక్కలు ముక్కలవుతుందని, ఒక గుప్త బెదిరింపు.
ఇలా, మేధావి వౌంట్ బాటెన్ ముందు, ఈ కార్యసాధనకు కేవలం 15 మాసాలే ఉన్నాయి సుమా!
1947 జూన్ 3
ఆట్లీ బ్రిటీష్ పార్లమెంట్‌లో, రెండు సార్వభౌమ రాజ్యాలకు 1947 ఆగస్టు 15కు ‘అధికారం బదిలీ’ చేయబడుతుందని ప్రకటించాడు. బ్రిటీష్ పార్లమెంట్ ‘ఇండియన్ ఇండిపెండెన్సు యాక్టు’ను (బ్రిటీష్ ఇండియాను పాకిస్తాన్‌గా, మిగిలిన ఇండియా (residuary India) గా విభజిస్తూ -ఆమోదించింది.
అంతేకాదు. బ్రిటీష్ సార్వభౌమాధికారాన్ని (Paramountacy) ఉపసంహరించుకుంది, తత్ఫలితంగా 590 కంటే ఎక్కువగా గల స్టేట్స్ స్వతంత్రమైనట్లు అర్థమవుతుంది. కాకపోతే, ఒక సలహా ‘ఇచ్చారు’. వారు పాకిస్తాన్‌లో కాని, ఇండియాలో గాని చేరవచ్చన్నారు.
రాడ్‌క్లిఫ్ మాయ
1947 జూన్ 30న, వౌంట్ బాటెన్ రెండు సరిహద్దు కమిషన్లను, బెంగాల్‌కు - పంజాబ్‌కు నియమించాడు. రెంటికీ అధిపతి, సిరిల్ రాడ్‌క్లిఫ్.
ఇందులో, వౌంట్ బాటెన్ ధోరణి స్పష్టమైంది. కారణం - జిన్నాగారు న్యాయవాదిగా రాడ్‌క్లిఫ్ ఆఫీసులో జూనియర్‌గా పని చేశాడు. ఈ రాడ్‌క్లిఫ్ ఐదు వారాలలో, కోట్లాది ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించాలి!
ఇక హిందువులకు, సిక్కులకు ఘోర అన్యాయం జరిగింది.
ఆ వివరాలు...
చిట్టగాంగ్ పర్వత ప్రాంతంలో (5007 చదరపు మైళ్లు) భాగాలను రాడ్‌క్లిఫ్, పాకిస్తాన్‌కు ఇచ్చాడు. అక్కడ ముస్లింలు కేవలం 3% మాత్రమే! 4805 చదరపు మైళ్లున్న ఖుల్నా జిల్లా - 55% హిందువులున్న ప్రాంతం - నిజానికి నాడియా, దినజాపూర్‌ల వలె విభజింప వలసిన దానిని, పాక్‌కు ధారపోశారు.
అస్సాంలోని సిల్హెట్ జిల్లాలో 17 పోలీసుస్టేషన్ల పరిధిలో, హిందువులే మెజారిటీ. దానినీ విభజించాల్సిందే, కాని అదీ పాక్‌కే ధారాదత్తమయింది. ధార్ - పార్కర్ జిల్లా (13,649 చదరపు మైళ్లు)లో హిందువులు, ముస్లింలు సమ సంఖ్యలో ఉన్నారు. దానిని విభజించే బదులు, అదీ పాక్‌కే ఈయబడింది.
అసలీ రాడ్‌క్లిఫ్ అవార్డంతా, వౌంట్ బాటెన్ దుష్ట ఆలోచనలకు అనుగుణంగానే తయారుకాబడింది సుమా!
ఇక సాయుధ బలగాల విభజన
బ్రిటీష్ ఆఫీసర్ల సమావేశాల రహస్య వివరాలు (Secret minutes of the number of meetings held among British Co-officers) వౌంట్ బాటెన్, ఆయన అనుచర బృందం ఎంతగా, పాకిస్తాన్‌కు ముందు ముందు, భారత్ నుంచి ఏ ప్రమాదం రాకుండా చూడదల్చుకున్నారు సుమా!
వౌంట్ బాటెన్ ఈ సాయుధ బలాల విభజన విషయం, తాను పదవీ స్వీకారం చేసిన 4 రోజులలోనే, 28 మార్చి 1947న చర్చించాడు. తిరిగి ఏప్రిల్ 8న జరిగిన మీటింగ్‌లో, ఎరిక్ మెల్‌విల్ అనే అధికారి స్పష్టంగా చెప్పాడు. హిందువులే చక్కటి అధికారులనీ, విభజన ఫలితంగా అధిక డిపోలు, ఆయుధ కర్మాగారాలు భారతంలోనే ఉంటాయనీ చెప్పాడు. దాంతో వౌంట్ బాటెన్ తన ధోరణి ఇంకోసారి బయటపెట్టాడు. కేవలం 19% జనాభాతో, పాక్ సాయుధ బలగాల్లో 33% వాటా పొందింది. 170,000 టన్నుల సాయుధ సామగ్రిని 300 ప్రత్యేక రైళ్లు పాక్‌కు చేరవేశాయి. మంచి కేంద్రాలయిన క్వెట్టా, పెషావర్‌లు పాక్‌కే పోయాయి గదా.
15 ఆగస్టు 1947
ఆ రోజున, భారత - పాక్ బలాలకు, జనరల్ క్లాడ్ అకిన్‌లెక్ అధిపతి అయ్యాడు. ఆయన జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వౌంట్ బాటెన్ సూచనలతో పని చేశాడు. ఆ కౌన్సిల్ 1948 ఏప్రిల్ 1 దాకా పని చేసింది.
ఇక భారత కమాండర్ ఇన్ చీఫ్, పాక్ కమాండర్ ఇన్ చీఫ్‌లు, జనరల్ రాయ్‌బుబర్, జనరల్ ఫ్రాంక్ మా సర్వే, మిగతా బ్రిటీష్ ఆఫీసర్లంతా, ఒకే టీంలాగా, జనరల్ క్లాడ్ అకిన్‌లెక్‌కు రిపోర్టు చేస్తూ, తమతమ ప్రభుత్వాలను నామమాత్రపు అధికారులుగా భావిస్తూ వచ్చారు.
బ్రిటీష్ ఆఫీసర్లంతా పాక్ అభిమానులు, దానితో సర్దార్ పటేల్‌కు వారితో వ్యవహరించటం చాలా కష్టసాధ్యమైంది. (extremely difficult to rely on their cooperation)
ఇక రెండు వైపులా ఉన్న బ్రిటీష్ చీఫ్‌లు, తమతమ సమాచారాలను పంచుకునేవారు. పాక్ వైపు నుంచి, జనరల్ మనవైపు జనరల్ బుబర్‌కు, కాశ్మీర్‌పై కొండజాతుల దాడి విషయమై ఉప్పందించినా, బుబర్ మన ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు.
ఈ విశ్వాసఘాతుక చర్య తరువాత, వౌంట్ బాటెన్ ఎంతకాదన్నా, ఈ పదవిని రద్దు చేసి, 30 నవంబర్‌న, జనరల్ కె.ఎం.కరియప్పను, మన సైన్యానికి డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు.
భారత విచ్ఛిన్నానికి, వౌంట్‌బాటెన్ ప్రయత్నాలు
స్వతంత్ర భారతంలో, రెండు రకాలైన ‘స్టేట్స్’ ఏర్పడ్డాయి. 1.ముస్లిం నవాబుల పాలనలోని స్టేట్స్. 2.ముస్లిం మెజారిటీ ఉన్నా హిందూ మహరాజుల పాలనలోని స్టేట్స్. వౌంట్‌బాటెన్, తన అధికారాన్ని రాజకీయం ఇస్లాంను, రెండు రకాల స్టేట్స్‌లోనూ వాడదలచుకున్నాడు.
1947 జూన్‌లో వౌంట్‌బాటెన్ కాశ్మీర్ పర్యటన
ఆయన నాటి కాశ్మీర్ రాజు హరిసింగ్‌తో చెప్పాడు ‘నీవు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వపు పూర్తి అధికారంతో, నేనివ్వాళ ఇక్కడికి వచ్చాను. (Basically Patel, but he'd got the agreement of Nehru) నేను నీకొకటి చెబుతున్నాను, నీవు పాక్‌లో చేరితే, వారు ఇదొక సాదారణ విషయంగానే భావిస్తారు. ఎందుకంటే నీ స్టేట్ జనాభాలో అధికులు ముస్లింలు. నీ చర్య ఏ వ్యతిరేక భావాన్ని కలిగించనదు, వారు నీకు పూర్తి సహకారం అందిస్తారు (‘వారు’ అంటే పటేల్ మరియు నెహ్రూగార్లని అర్థం)
మహారాజా హరిసింగ్ ఆ సలహాను తిరస్కరించి, వౌంట్ బాటెన్‌తో స్పష్టంగా చెప్పాడు. ‘ఏ విధంగానూ, నేను పాకిస్తాన్‌లో చేరను’. వౌంట్ బాటనే, నెహ్రూగారి మనస్సులో ‘ప్లెబిసైట్’ అనే భావాన్ని నాటాడు. ‘నేను ఆయనకు, కాశ్మీర్ ఏ వైపు మొగ్గుతుందో తెలుసుకోవటానికి ప్లెబిసైట్ జరపమన్నారు. వారు దానికి అంగీకరించారు.’
1947 అక్టోబర్ 22న ఆఫ్రిదీలు, మహసూద్‌లతో కూడిన గిరిజనులు, మాజీ సైనికులు, పాక్ సైన్యం - మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ నాయకత్వాన, జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేశారు. దాదాపుగా వారు శ్రీనగర్ దాకా చేరారు. 27 అక్టోబర్‌ర. మహారాజా హరిసింగ్, ఇండియన్ యూనియన్‌లో చేరటం జరిగింది. భారత సైన్యం భీకర యుద్ధం జరిపి, దాదాపుగా వారిని వెళ్లగొట్టే స్థితిలో ఉన్నారు. కానీ అప్పుడు నెహ్రూగారు, ఐక్యరాజ్యసమితి జులై 6, 1948 నాటి యుద్ధ విరమణ తీర్మానాన్ని ఆమోదించారు. ఫలితంగా 35% కాశ్మీర్ -సుమారు 78,114 చదరపు కిలోమీటర్లు, నేటికీ పాక్ ఆక్రమణ కిందే ఉంది. కాశ్మీర్ ఈనాటికీ మండుతూనే ఉంది, అమాయకులను మన రక్షణ దళాలలోని వారు ఆహుతవుతున్నారు. ఇదంతా, వౌంట్ బాటెన్ కుట్ర, మహారాజా తటపటాయింపు, 1947 నెహ్రూగారు ఐక్యరాజ్యసమితికి పరుగెత్తటంతో వచ్చిన ఫలితాలే సుమా!
నైజాం సార్వభౌమత్వాన్ని ప్రకటించాడు
మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సిద్దిఖీ -7వ నిజాం -ఇండియన్ యూనియన్‌కు లొంగటం ఏ మాత్రం ఇష్టం లేక, సార్వభౌమత్వ కలలు కనటం ప్రారంభించాడు. 1947 జులై 11న తనకు డొమినియన్ హోదా ఇవ్వాలనే కోరికతో, ఒక ప్రతినిధి వర్గాన్ని, వౌంట్ బాటెన్ వద్దకు పంపాడు. అంతేకాదు, బేరార్‌ను (ఎప్పుడో 1903లో లార్జ్ కర్జన్ మధ్య రాష్ట్రాలలో విలీనం చేసిన 4 జిల్లాలను) తనకివ్వాలని కోరాడు. నిజాంకు రాజ్యాంగ సలహాదారుడైన వాల్టర్ మాంక్‌టన్, వౌంట్‌బాటెన్‌కు దగ్గరి మిత్రుడు. దానితో, వౌంట్ బాటెన్‌కు, ఒక ఆట ఆడటానికి ఆస్కారం ఏర్పడ్డది. వౌంట్ బాటెన్, భారత నాయకులతో, నిజాం మీద భారత్‌లో చేరాలని ఒత్తిడి తేవద్దనీ, అలా చేస్తే, నిజాం పాకిస్తాన్‌లో చేరవచ్చనీ సలహా ఇచ్చాడు. 1947 ఆగస్టు 15, తరువాత 3 నెలలు నిజాం తేల్చుకునేందుకు, కాలపరిమితిని పెంచాడు. దానితో, నిజాం 8 ఆగస్టున, వౌంట్ బాటెన్‌కు తాను భారత్‌లో విలీనం కాకుండా, ప్రభుత్వంతో ఒక అంగీకారానికి (అగ్రిమెంట్) వచ్చేందుకు సిద్ధమని వ్రాశాడు. అంతేకాదు ఒకవేళ భారత్, పాక్‌ల మధ్య యుద్ధం సంభవిస్తే, తాను తటస్థంగా ఉంటానన్నాడు.
1947 ఆగస్టు 27న, హైదరాబాద్ స్వతంత్రమైందని ప్రకటించాడు. రెండోవైపు జిన్నాతో రహస్యంగా, ఈ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తేందుకు జఫ్రుల్లాఖాన్ సేవలు తీసుకున్నాడు.
1947 సెప్టెంబర్ 22న, ఒక త్రిసభ్య సంఘాన్ని ఢిల్లీ పంపాడు. అందులో వాల్టర్ మాంక్టన్ ఒక సభ్యుడు. ఈ సంఘం, వౌంట్ బాటెన్‌తో, ఏది ఏమైనా హైదరాబాద్ ముస్లింలు భారత్‌లో విలీనానికి అంగీకరించరని, ఏదన్నా బలప్రయోగానికి పాల్పడితే, ఒక్క నైజాంలోనే కాక యావత్ దక్షిణ భారతంలో, రక్తపాతం తప్పదన్నారు.. దీనితో ఒక ఉత్తరం, యథాతథ ఒప్పందం (stand still agreement) తయారయింధి. దానికీ రెండు మాసాలు తాత్సారం చేసి, చివరకు 1947 నవంబర్ 29న దాని మీద సంతకం చేశాడు నిజాం.
ఈ యథాతథ ఒప్పందం ప్రకారం, 15 ఆగస్టు 1947కు ముందు, నిజాం రక్షణ, విదేశీ వ్యవహారాలు వగైరా విషయాలలో ఏ విధమైన ఒడంబడికలు చేసుకున్నాడో, అవి యధాతథంగా ఒక సంవత్సరంపాటు చెల్లుబాటవుతాయి. ఆ కాలంలో నిజాం పాక్‌లో చేరకూడదు.
ఇది ఆధారంగా, సికిందరాబాద్ నుంచి భారత సైనిక స్థావరం ఎత్తివేయబడింది. భారత కరెన్సీ నిషేధించబడింది. ఇండియన్ యూనియన్‌కు, బంగారం ఎగుమతి నిషేధించబడింది.
నిజాం కావాలనే, ఒడంబడికలోని ప్రతి అంశానికీ తూట్లు పొడవ ప్రారంభించాడు. తన ఏజంట్లను, పాకిస్తాన్‌లోనే కాకుండా, బ్రిటన్ ఇంకా ఇతర దేశాల్లోనూ నియమించాడు. రహస్యంగా, పాకిస్తాన్‌కు 20 కోట్లు తరలించాడు. విదేశాల నుంచి, వాయుదళంతో సహా, ఆయుధాలు సేకరించాడు. సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా, గోవా ద్వారా ఆయుధాలను తరలించాడు. ఢిల్లీ - మద్రాస్, బాంబే - మద్రాస్ రోడ్ల ప్రయాణాలు, ప్రమాదకారులయ్యాయి.
ఖాశిం రజ్వీ నాయకత్వం క్రింద, శిక్షణ పొందే రజాకార్ల సంఖ్య 2 లక్షలకు పెరిగింది.
1948 ఫిబ్రవరిలో, రజ్వీ భారత్‌పై యుద్ధం ప్రకటించాడు. రజ్వీ భాషణ ‘తక్షణమే ఇండియన్ యూనియన్‌తో సంభాషణలలు ఆపివేయాలి, పాకిస్తాన్‌తో అంగీకారానికి రావాలి. మనం హైదరాబాద్ ప్రభుత్వాన్ని, స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్‌ను చించి ముక్కలు చేయమనాలి. ఇది ఒక నెలలోపే జరిగి తీరాలి.. ఈ నా ప్రకటనను, ఒక యుద్ధ ప్రకటనగా తీసుకోవచ్చు.’ (This declaration of mine can be taken as a declaration of War)
లండన్‌లో వాల్టర్ మాంక్టన్ 1948 ఫిబ్రవరి - మార్చి మాసాలలో, హైదరాబాద్ సార్వభౌమత్వానికి ప్రచారం మొదలుపెట్టడు. చర్చిల్‌తో అనుబంధమే కాకుండా, లండన్‌లోని రెండు పత్రికలలో తన ప్రచారం మొదలుపెట్టాడు. భారత సైన్యాలు 1948 ఏప్రిల్ 10-15 తేదీల మధ్య, నైజాంను ముట్టడించబోతున్నాయన్నాడు.
31 మార్చిన, హైదరామాద్ దారుస్సలాంలో, ఖాశిం రజ్వీ రాయలసీమ 4 జిల్లాలు - కడప, కర్నూలు, అనంతపూర్, బళ్లారిలను తిరిగి పొందాలని పిలుపునిచ్చాడు. ‘ఛలో ఢిల్లీ’ అనే నినాదాన్నిచ్చాడు.
12 ఏప్రిల్‌న, తాను హైదరాబాద్ సామ్రాజ్యాన్ని బంగాళాఖాతం దాకా విస్తరిస్తానన్నాడు.
సర్దార్ పటేల్ స్పష్టత
16 ఏప్రిల్‌న, నిజాం ప్రధాని లాయక్ ఆలీ, సర్దార్ పటేల్‌ని కలిస్తే, వారు స్పష్టంగా చెప్పారు. ‘... ప్రస్తుతం హైదరాబాద్‌ను ‘డామినేట్’ చేస్తున్న, రజ్వీ అనే పెద్ద మనిషి, మాకు సమాధానమిచ్చాడు. ఇండియన్ యూనియన్ గనుక ఇప్పుడు హైదరాబాద్ వస్తే, వారికి ఒకటిన్నర కోట్ల హిందువుల ఎముకలు, బూడిదే దొరుకుతుంది. అదే కనుక నేటి పరిస్థితి అయితే, అది నైజాం, అతని పాలన, భవిష్యత్‌నూ పూర్తిగా ధ్వంసం చేస్తుంది.. హైదరాబాద్ సమస్య, మిగతా రాష్ట్రాలలో ఎలా పరిష్కరింపబడిందో, అలాగే జరగాలి. ఇంకో మార్గం సాధ్యంకాదు. (No other way is possible)
వౌంట్ బాటెన్, వాల్టర్ మాంక్టన్‌లు అనేకసార్లు, భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, నిజాంకు స్వయం ప్రతిపత్తి (autonomy) ఇప్పిద్దామని చూశారు. ప్రత్యేక హోదా (కాశ్మీర్‌లో, 370 ఆర్టికల్ లాంటిది) వౌంట్ బాటెన్ మనస్సులో ఉంది. కానీ ఈ ఇరువురు బ్రిటిషర్లు చేత సూచించబడినవన్నీ, నైజాం చేత 1947 జూన్ 17న నిరాకరించబడ్డాయి.
హైదరాబాద్ విముక్తి ఆలస్యం చేయబడింది
వౌంట్ బాటెన్‌కి, తనకి తెలియకుండా సైనిక దళాలు తయారు చేయబడుతున్నాయని కోపం వచ్చింది. రాజుగారికి ఈ విషయం చెప్పారు.
‘మార్చి 8 నుంచి 16 దాకా నేను ఢిల్లీలో లేకుండా బర్మా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాంల పర్యటనలో ఉన్నాను. నేను లేనపుడు, హైదరాబాద్ విషయమై ఒక నూతన పరిణామం ఏర్పడింది. నేను తిరిగి వచ్చిన తరువాత కూడా, కొన్ని రోజుల దాకా నా దృష్టికిది రాలా. ఒక ప్రైవేట్ సంభాషణలో, దక్షిణ భారత కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ గొడార్డ్, నన్ను ‘పోలో’ గురించి నా అభిప్రాయమేమిటన్నారు. భారత సైనిక బలగాలను, హైదరాబాద్ మీదికి నడపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, నాకు మొదటిసారి తెలిసింది.
‘నేను వెంటనే కమాండర్ ఇన్ చీఫ్, జనరల్ బుబర్‌ను పిలిచి, ఈ ‘పోలో’ సంగతి వివరించమన్నాను. అయితే నాకెంత తెలుసో, బుబర్‌కు అంతే తెలుసు. కారణం అతనూ అప్పుడే లండన్ నుంచి తిరిగి వచ్చాడు.
‘తరువాత నాకీ వివరాలు అందించబడ్డాయి. ఒకవేళ హైదరాబాద్‌లో, హిందువులపై మారణకాండ జరిగితే, ఆ సందర్భంలో భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదనీ, ఆ సందర్భమై ఈయబడ్డ ఆదేశాలే, సదరన్ కమాండ్‌లో తప్పుగా అర్థం చెప్పబడ్డాయని జనరల్ బుబర్, నాతో తాను ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని, హైదరాబాద్ ముట్టడితో వచ్చే అంతర్గత సమస్యలు, మొత్తం దక్షిణ భారతంలో ఈ ముట్టడి లేపే మత సంబంధమైన బాధలన్నిటినీ, భారత ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నానన్నాడు.’
భారత సైనిక ప్రధానాధికారి, జనరల్ బుబర్, ప్రభుత్వం హైదరాబాద్ పట్ల మిలిటరీ చర్య తీసుకోకుండా చూచేందుకు, తన శాయశక్తులా ప్రయత్నించాడు. 13 మేన, వౌంట్ బాటెన్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కమిటీలో చర్చించబడింది.
కనీసం తను ఢిల్లీలో ఉన్నంత కాలంలో, అది జరగకుండా వౌంట్ బాటెన్ చూశాడు. (He saw to it that the military would not move into Hyderabad, atleast during his tenure in Delhi).
హైధరాబాద్ విముక్తి అలా ఆలస్యం చేయబడటం, దానితో అనేకానేక మంది అమాయకులు దుర్మరణం పాలవటం జరిగింది. పటేల్ కూడా నిస్సహాయుడయ్యాడు. పరాయి పాలనలో చివరి వైస్రాయిని, స్వతంత్ర భారతం ప్రథమ గవర్నర్ జనరల్‌గా ఉంచుకున్నందుకు కలిగిన ఫలితమిది. Thanks to Nehru.
ఎట్టకేలకు ఈ వౌంట్ బాటెన్‌గారు, 1948 జూన్ 21న మన దేశం విడిచారు. వారి హయాంలో అనేక ప్రాణాలు, ఆస్తులు మన స్వతంత్ర భారతం మొదటి 10 మాసాల్లో కోల్పోవలసి వచ్చింది. ఈ జూన్ 1948 దాకా, అన్ని కీలక నిర్ణయాల్లో బ్రిటీష్ వారి మాటే చెల్లుబాటయింది, మనం పేరుకే సర్వస్వతంత్రులమయ్యాం!
జూన్ 1948లో భారత ప్రభుత్వం, ఆహారం - మందులు తప్ప ఇంకేమీ హైదరాబాద్‌కు పంపగూడదని నిషేధం విధించింది.
హైదరాబాద్ సంస్థానంలో రానురాను క్రూర చర్యలు అదుపులేకుండా పెరగటంతో, ప్రభుత్వం జులై 26, 1948న ఒక శే్వతపత్రాన్ని ప్రకటించింది. సర్దార్ పటేల్ కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలో మాట్లాడుతూ, భారత హృదయం మీద హైదరాబాద్ ఒక పుండుగా తయారయిందనీ, దానికి శస్తచ్రికిత్స తప్పదన్నారు.
ఈ శే్వతపత్రం స్పష్టంగా ఇలా ఉద్ఘాటించింది. ‘హైదరాబాద్‌లో ఇలాంటివి ఒక రూల్‌లాగా జరుగుతుంటే, భారత ప్రభుత్వం ఒక నిస్సహాయ ప్రేక్షకుడుగా మిగలలేదు. అక్కడి లా అండ్ ఆర్డర్ పరిస్థితి దినదినానికి దిగజారుతూ పతనస్థాయికి చేరుతుంటే, భారతదేశంలోని శాంతిభద్రతలకు భంగం కలిగించే దశకు వస్తుంటే, భారత ప్రభుత్వం తప్పక జోక్యం చేసుకుంటుంది.’
నెహ్రూ గారికి మొదటి నుంచీ హైదరాబాద్ సమస్యను మిలిటరీ ధోరణితో పరిష్కరించటం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేదు.
‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక మాజీ సంపాదకుడు దుర్గాదాస్, దీనిని గురించి ఈ విధంగా వ్రాశాడు. ‘ఈ రోజులు న్యూఢిల్లీలో, ముఖ్యంగా మంత్రివర్గంలో హైడ్రామా జరుగుతున్న రోజులు. నెహ్రూగారింకా శాంతియుత పరిష్కారానే్న కోరుతున్నారు, కారణం పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని. పటేల్ మట్టుకు, వౌంట్ బాటెన్ వెళ్లిన దగ్గర నుంచి, పోలీసు యాక్షనే కోరుతున్నారు. పటేల్‌కున్నా అడ్డంకి వౌంట్ బాటెన్ - ఆయనెంతసేపూ హైదరాబాద్‌కు స్పెషల్ స్టేటస్‌కే ప్రయత్నించేవాడు - ఆయన నిష్క్రమణతో, తొలిగిపోయింది.
వౌంట్ బాటెన్ వెళ్లిన తరువాత, ఇంకా నైజాం ఏదో ఒడంబడిక అంటూ మాట్లాడితే, ‘అది ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయింది’ అన్నాడు పటేల్.
మిలటరీ యాక్షన్‌కు నెహ్రూగారి వ్యతిరేకత, స్పష్టంగా రెండు సందర్భాలలో బయటపడింది. జోక్యానికి తాను నిర్ణయించిన రెండు ముహూర్తాలను పటేల్, చివరి నిమిషంలో, నెహ్రూగారి జోక్యంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చివరిసారిగా 1948 సెప్టెంబర్ 13 రాత్రికి పటేల్ ముహూర్తం నిశ్చయించారు. ఆ 12 రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత, నెహ్రూగారు చివరిసారి తన ప్రయత్నం చేశారు.
కానీ సర్దార్జీ, అప్పటికే సైన్యం హైదరాబాద్‌కు ప్రయాణమయిందనీ, దానిని ఆపేందుకు ఏమీ చెయ్యలేమన్నాడు (Sardar told him bluntly that the army had already moved into Hyderabad and nothing could be done to halt it.)
నిజానికి, ఏ మిలిటరీ ఛర్య యొక్క విజయమైనా, దాని రహస్యాన్ని కాపాడటం, నిర్వహణలో మిలిటరీ యొక్క తొందర మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి రహస్యాన్ని కాదనటం, ద్రోహం మాత్రమే. 1948 జూన్ 22 తరువాత, వౌంట్ బాటెన్ మనకు గవర్నర్ జనరల్ కానేకాడు.
అయినా 29 ఆగస్టున, పోలీసు యాక్షన్‌కు 2 వారాల ముందు, నెహ్రూ మనం సైనికులను హైదరాబాద్‌కు పంపటం, వౌంట్ బాటెన్‌కు బహిర్గతం చేశారు. చాలా బాధతో ఇలా వ్రాశారు.
‘ఇక్కడ మేం చాలా కష్టకాలంలో ఉన్నాము. నేను నా మీద మోపబడిన బాధ్యత బరువును చాలా బాధతో మోస్తున్నాను. చాలా బాధాకరమైన నిర్ణయాలు మేం తీసుకోవలసి వస్తుంది. ఆ నిర్ణయానికి ప్రత్యామ్నాయాలు కూడా సమానంగా అవాంఛనీయమైనవే. జీవితంలో మేం చాలాసార్లు, తక్కువ నష్టానికి చాలాసార్లు వెతుక్కోవాల్సి వస్తుంది.. హైదరాబాద్ చాలా రోజుల నుంచి మాకొక పుండయితే, ఇప్పుడది భరింపశక్యం కానీ న్యూసెన్స్, దానికన్నా హీనమయిందయింది.. ఇదంతా, ఈ విషయంలో, చివరికి ఇంకా పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు, తప్పక మిలిటరీ యాక్షన్‌కే దారి తీస్తుంది...
కానీ మీకు నేను మాట ఇస్తున్నాను, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలున్నా, మేమెవరి మీదా యుద్ధం ప్రకటించం. కాని మేం తప్పక ఏదో ఒక చర్య, దానిని పోలీస్ యాక్షన్ అనండి, తప్పక సమీప భవిష్యత్‌లో తీసుకోవల్సి వస్తుంది.. మేమిక్కడ మీరు లేకపోవటాన్ని అనుభవిస్తున్నాం.’
వౌంట్ బాటెన్ ఈ మిలిటరీ యాక్షన్ సమాచారాన్ని నైజాంకు చేరవేశాడో లేదో మనకు తెలియదు. కానీ పోలీసు యాక్షన్‌కు, కేవలం 3 రోజులకు ముందే, ఐక్యరాజ్యసమితికి జోక్యం చేసుకోమని కోరాడు. దీనితో ఆయన అసలు ఉద్దేశం బయటపడింది.
ఆపరేషన్ ‘పోలో’
హైదరాబాద్ మిలిటరీ 30,000 అని అంచనా. అందులో అరబ్‌లు, పాకిస్తాన్ పఠానులు, కేరళ మోప్లాలు, స్థానిక ముస్లింలు అంతా ఉన్నారు. సైన్యాధిపతి ఆరబ్. మేజర్ జనరల్ సయ్యద్ అహమ్మద్ ఎల్ ఎడ్రూస్.
భారత సైన్యాలు, మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నాయకత్వాన 13 సెప్టెంబర్ 1948న సంస్థానంలో ప్రవేశించాయి. మేజర్ జనరల్ బ్రార్, మేజర్ జనరల్ రుద్ర, బ్రిగెడీర్ శివదత్ సింగ్‌ల ఆధ్వర్యాన, మన సైన్యాలు బాంబే, మద్రాసు, మధ్యప్రదేశ్‌ల నుంచి కదిలాయి. భారత వాయుసేన వీరికి కవర్ ఇచ్చింది.
నిజాం సైన్యాలు, రజాకార్ల ప్రతిఘటన, దాదాపుగా లేదనే చెప్పవచ్చు. నవ్‌దుర్గ్, ఆదిలాబాద్, జల్‌కోట్, తాల్మడా, తుల్జాపూర్, మాణిక్‌ఘర్, కణాడ్‌గోన్, బోనీకల్‌లు - మొదటి రోజే విముక్తి అయ్యాయి. వరంగల్, బీదర్, రాయచూర్, ఔరంగాబాద్ మొదటి రోజే, మన వైమానిక బలం వలన, వారికి పనికిరాకుండా పోయాయి. 14 సెప్టెంబర్‌న, నైజాం సైన్యాలను ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేటల నుంచి తరిమేశారు. రజాకార్లు చనిపోవటమో, ఖైదీలుగా తీసుకోబడటమో జరిగింది.
ఇక మూడవ రోజున, నిజాం సైన్యం జహీరాబాద్, అక్కడి నుంచి వికారాబాద్‌కు తిరోగమించింది. దానిని భారత వాయు సైన్యం, దెబ్బ తీసింది. షోలాపూర్ - హైదరాబాద్ మార్గంలోగల హుమ్నాబాద్, జైనా - హైదరాబాద్ మార్గంలోగల షాదాన్, ఖమ్మంలు విముక్తి చేయబడ్డాయి.
16 నవంబర్‌న భారత సైన్యం, ప్రాముఖ్యంగల జహీరాబాద్, పర్భని జిల్లాలోని హింగోలీలను ఆక్రమించి, సూర్యాపేట సమీపంలో మూసీనదిని దాటింది. శత్రువులు అనేక వంతెనలను నాశనం చేశారు.
ఈ ఆపరేషన్ జరిగిన అన్ని రోజులలో, నైజాం పాకిస్తాన్‌తో మాట్లాడుతూనే ఉన్నాడు. కాని దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 12న జిన్నా మరణించాడు.
దానితో పాకిస్తాన్ దుఃఖంలో ఉంది. అది తేరుకుని, పరిస్థితులు సమీక్షించే నాటికి, అక్కడి నుంచి తనకే సహాయం అందదని, నైజాంలకు స్పష్టమయింది. రెండోపక్క, భారత సైన్యం రాజధాని హైదరాబాద్ వైపు దూసుకొస్తోంది. నైజాం సైన్యం దయనీయ స్థితిలో ఉంది. కనీసం రెండు రోజులైనా తాను పరిస్థితిని కాపాడలేనని నైజాం నిశ్చయించుకున్నాడు.
నైజాం చివరకు తన 55 మంది భార్యలు, 28 మంది కుమారులు, 44 మంది కుమార్తెలను, తననూ రక్షించుకోలేననే నిర్ణయానికొచ్చాడు. 17 ఉదయానికి, భారత సైనికులు రైలు మార్గం ద్వారా బీబీనగర్ చేరారని, హైదరాబాద్ వైపు వస్తున్నారనే వార్త చేరింది.
దాంతో నైజాం రేడియో ద్వారా, కాల్పుల విరమణను ప్రకటించాడు. అప్పటికి భారత సైన్యం సాయంత్రం 5 గంటలకు పటాన్‌చెరువుకు చేరుకుంది. ప్రధాని లాయక్ ఆలీ రాజీనామా చేశాడు.
నైజాం సైన్యాధిపతి ఎల్‌విడ్రూస్, మేజర్ జనరల్ చౌదరి ముందు లొంగిపోయాడు. రెండు శతాబ్దాల దౌష్ట్య పాలనకు చిహ్నమైన అసఫ్ జాహీ పతాకం దాచివేయబడి, భారతదేశపు త్రివర్ణ పతాకం ఎగురవేయబడింది.
18 తేదీ ఉదయానికి, హైదరాబాద్ సంస్థాన ప్రజానీకం, స్వాతంత్య్ర వాయువులను పీల్చింది.

-చాణక్య