Others

విలువలు నేర్పే గృహస్థాశ్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిపరాశక్తి బ్రహ్మను సృష్టించి సృష్టి రచన చేయమని బోధించింది. అమ్మ ఆదేశం మేరకు చతుర్ముఖుడు సృష్టి రచన ప్రారంభంచేశాడు. దానిలో భాగంగా కర్దముని కోరిక తెలుసుకొన్న బ్రహ్మ అతనిని వివాహం చేసుకొని సృష్టిని పెంచమని చెప్పాడు. కర్దముడు తాను సృష్టికి ఉపయోగపడుతాను కానీ కామసుఖాలను నాకు వద్దు. నేను నిరంతరం దేవదేవుడైన నారాయణుని సంస్మరణలోనే కాలం గడపాలన్నది నా అభిలాష అని చెప్పాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి నీకోరిక సఫలం కావాలంటే నీవు నారాయణుని గూర్చి తపస్సు చేయమని చెప్పాడు.
కర్దముడు నారాయణుని కోసం తపస్సు చేశాడు. పదివేల యేండ్లు తపస్సు సాగిన తర్వాత కర్దమునికి నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘కర్ధమా! నీకోరిక ఏమి? దేనికోసం ఇంత తీవ్రమైన తపస్సును సాగిస్తున్నావు? నీకోరిక నేను తీరుస్తాను. కోరిక ఏమిటో చెప్పుము’ అని మహావిష్ణువే కర్దముడిని అడిగాడు.
కర్దముడు తన కోరికను మహావిష్ణువుకు తెలియచెప్పాడు. కర్దముని కోరిక విన్న మహావిష్ణువు తథాస్తు. అటులనే జరుగుతుంది. నీకు నాపై ఉన్న భక్తికి మెచ్చాను. నేను నీకుమారుడిగా పుడతానులే. సుఖసంతోషాలతో వర్థిల్లు అని వరం ఇచ్చి వెళ్లిపోయాడు. కర్దముని ఆనందానిక అవధులు లేవు. అదే సమయంలో స్వాయంభువ మనువు తన కూతురు దేవహూతిని, తన భార్య శతరూపను వెంట బెట్టుకుని కర్దముడి దగ్గరకు వచ్చాడు.
రాజును సత్కరించి ఏ పని మీద ఇక్కడకు వచ్చారు అని అడిగాడు కర్దముడు మనువును.
మనువు మునివర్యా! నీ తపస్సు గురించి , నీ రూప లావణ్యాల గురించి తెలుసుకొన్నాను. నీ తపఃప్రభావమెంతటిదో నారదుని వలన విన్నాను. నేను కూడా అతిలోక సౌందర్యవతి యైన నా బిడ్డకు పెండ్లి చేయదల్చుకుని వరానే్వషణలో ఉన్నాను. నాకూతురు అని కాక అసలీమె గుణగణాల గురించి చెబుతాను వినుము. దేవహూతి అందచందాలలో గుణరూపాల్లో లక్ష్మిసమానురాలు. ఈమెను వివాహ మాడే వాడు విష్ణువంతటి వాడు కావాలని నేను కలలు కన్నాను. ఆ సమయంలోనే నీ గురించి నాకు తెలిసింది. పెండ్లిండ్లు దైవనిర్ణయాలు అంటారు కదా. మరి నేను నా పుత్రికను నీకిచ్చి వివాహం చేయాలని వచ్చాను. మీరు దీనికి ఒప్పుకుంటే మీకిద్దరికీ వివాహం చేస్తాను అని మనవు తన మనసులోని మాటను చెప్పాడు.
కలసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్లు నేను కోరుకున్న వధువు నా దగ్గరకు వచ్చేసింది. ఈమె గురించి నేను వినే ఉన్నాను కదా. దైవకార్యమైనధర్మబద్ధమైన సృష్టిని వృద్ధిచేయాలనే కాని కామం కోసం తాను వివాహం కోరుకోవడం లేదనే నా షరత్తులను చెప్తాను. వాటికి ఒప్పుకుంటే నేను గృహస్థాశ్రమంలోకి అడుగు పెడతాను అనుకొన్నాడు. వెంటనే తన నియమాలను కర్దముడు దేవహూతి ఎదురుగా మనువుకు చెప్పాడు. మనుష్య జన్మ నెత్తిన వారు కేవలం విషయ వాంఛలకోసం కాక నారాయణుని తత్వం తెలుసుకొంటూ మనుగడ సాగించాలి కనుక నేను నా కర్తవ్యం పాటిస్తూనే తపస్సును ఆచరిస్తాను. దీనికి మీరు సమ్మతమైతే నన్ను కృతార్థుడిని చేసిన వారు మీరు అవుతారు అని కర్దముడు చెప్పాడు. దేవహూతి కర్దముని మాటలు విని వివాహం ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఇతనినే పెళ్లి చేసుకోవాలి. అపుడే ఈ దేహవాంఛలను తీర్చుకుంటూనే సద్గతి పొందే మార్గం సులువు చేసుకోవచ్చు అని అనుకొంది. తన కన్నులతోనే తన తల్లిదండ్రులకు తన సమ్మతిని తెలియచేసింది. మనువు తన కుమార్తె మనో వాంఛ తీరుతుంది కదా. ఇక నేనెందుకు ఆలస్యం చేయాలి అనుకొని కర్దమునికి సమ్మతిని తెలియచేసి కర్దమ మహామునికి దేవహూతికి పెళ్లి అంగరంగ వైభవంగా వివాహం చేయించాడు. వారిద్దరూ దాంపత్యధర్మానికి కట్టుబడి భోగేచ్ఛలను పొందుతున్నారు.

- ఎస్. రేఖ