AADIVAVRAM - Others
ప్రయాణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనం ఏమీ ఆలోచించకుండానే జీవితం కొనసాగుతుంది.
ఓ నదిలో కాగితం ముక్క నది ప్రవాహం ఎటు తీసుకొని వెళితే అటు వెళ్తుంది.
ఏ ప్రయత్నం చేయకుండానే జీవితం కొనసాగుతుంది.
అది సరైందేనా?
ఎలాంటి గమ్యం లేకుండా, ఉద్దేశం లేకుండా ప్రయాణం కొనసాగాల్సిందేనా?
మనలని ఇతరులు ప్రోత్సహించారా?
మనం ఇతరులని ప్రోత్సహించాలా?
మనల్ని మనం నిర్వచించుకోవాలా?
మనల్ని ఇతరులు నిర్వచించాలా?
మన నిర్ణయాలు మనం తీసుకోవాలా?
మన గురించి ఇతరులు నిర్ణయాలు తీసుకోవాలా?
మన జీవితం గురించి ఎవరు బాధ్యత వహించాలి?
మనమా?
ఇతరులా?
ఏమీ ఆలోచించకుండా జీవితం గడవాలా?
మనం ఆలోచించినట్టు జీవితం గడవాలా?
ప్రవాహంలోని కాగితం ముక్కలా జీవితం గడవాలా?
పడవలా మన జీవితం గడవాలా?
గమ్యం వైపు కొనసాగాలా?
ఏదోలా జీవితం జరగడం కాదు.
మనం అనుకున్నట్టు జీవితం జరిగేలా మనం ప్రయత్నం చేయాలి.
జీవితం సంగతే కాదు.
రోజు సంగతి.
మనం అనుకున్న మాదిరిగా రోజు గడిచే విధంగా ప్రణాళిక రచించాలి.
అది అమలుపరిచే విధంగా మన ప్రయత్నం కొనసాగాలి.