AADIVAVRAM - Others

మనస్సు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ప్రతి విషయంలో కృతజ్ఞతతో ఉండాలి. ఇది చెప్పడం సులువుగా అన్పిస్తుంది. కానీ అమలు చేయడం కష్టం. కానీ తప్పదు. మనం కృతజ్ఞతతో వుంటే కృతజ్ఞత చెప్పాల్సిన విషయాలు మనకి ఎన్నో కన్పిస్తాయి.
ఉదయం లేస్తాం. లేవగానే ఆ కొత్తరోజు మన జీవితంలోకి వచ్చిందని భగవంతునికి కృతజ్ఞత చెప్పవచ్చు. భగవంతుడు మన నుంచి కృతజ్ఞతను కోరుకోడు. కానీ కృతజ్ఞత చెప్పడం మన ధర్మం.
మన మనస్సు అన్నింటికి మూలం. మన మనస్సుని ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంచాలి. అప్పుడు అన్నీ మనకు ఉత్సాహభరితంగా అన్పిస్తాయి.
మన దృష్టి చాలా విషయాల మీద కాకుండా మన గోల్స్ మీద కేంద్రీకృతం చేయాలి. మనం ఏది కోరుకుంటున్నామో మనం వాటి మీద కేంద్రీకరించాలి. ఉద్యోగ అవకాశాలని మనం కాంక్షిస్తుంటే మనం వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు అవకాశాలు లభిస్తాయి.
ఆశావహ దృక్పథంతో మన రోజు ప్రారంభించాలి. అలా వుంటే మన పనులు విజయం వైపు పరుగు పెడతాయి. మన లక్ష్యం వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తే ఆ గోల్స్ మనకు దగ్గరవుతాయి.
మన ఆలోచనా ధోరణి చాలా ముఖ్యమైంది. ఈ ఆలోచనా ధోరణి మనలని రెండు వైపులా ప్రయాణం చేయిస్తుంది.
అది విజయం కావొచ్చు.
అపజయం కావొచ్చు.
అందుకని మన ఆలోచనా ధోరణి మన నియంత్రణలో వుండాలి. అది నియంత్రణలో వుంటే మన లక్ష్యం వైపు ప్రయాణం చేస్తాం.
చాలాసార్లు గమనిస్తూ వుండాలి.
మన మనస్సు ఏమి ఆలోచిస్తుంది.
ఎటువైపు ప్రయాణం చేస్తుంది.
ఇది ముఖ్యం.
మన మనస్సు కృతజ్ఞత వైపు
ప్రయాణం చేస్తుందా లేదా చూడాలి.
మంచి వాళ్లు కూడా కృతజ్ఞతలని ఆశిస్తారు.

మంగారి రాజేందర్ ‘జింబో’