AADIVAVRAM - Others

సాధించెనే ఓ మనసా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాధించెనే ఓ మనసా
సమయానికి తగు మాటలాడి’
అన్నది త్యాగరాజకృతి
భక్తిరాగాల శృతి
కొందరికి మాత్రం
అర్థంకాని అపశృతి
నేటి మేటి మేధావుల
సమాజంలో సమయానికి
తగుమాటలే కాదు
తగవు మాటలలు తగని మాటలు
ముచ్చెమటలు పోయిస్తున్నయ్
సమయాన్ని సమయస్ఫూర్తిగా
సమాజ శ్రేయస్సు కోసం
మానవతావాదులు వినియోగిస్తుంటే
సంస్కార హీనులు, ద్వేషభూషణులు
వేష భాషలను దిగజార్చుకొని
సంస్కృతీ సంప్రదాయాలకు
చరమగీతం పాడడానికి
పావులు కదుపుతూ పావురాల్లా
ఎగురుతున్నారు ఎదుగుతున్నారు
మంచి ఆలోచనల లోచనాలు
సంచలనాలు సృష్టిస్తేగానీ,
మంచి బుద్ధులు పుట్టి
మంచి సమయం ఆసన్నమై
ప్రసన్న వదనంతో
‘సాధించెనే ఓ మనసా’ అని
పాడుకోలేరూ, పరవశింపలేరు.

షణ్ముఖశ్రీ 88978 53339