AADIVAVRAM - Others

మనిషిగా బ్రతుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిగా బ్రతుకు
ఆ తర్వాతే వెతుకు
నీ కులమేమిటో
మతమేమిటో
అప్పుడనిపిస్తుంది
మనిషిగా బ్రతకడమంటే
తమాషా కాదని
ఒకడు పచ్చగా వుంటే
వాడిలా నువ్వు లేవని
వెచ్చనై పోతావు
వాడిని రెచ్చగొట్టాలని
రెచ్చిపోతావు
రచ్చ కీడ్చాలని చూస్తావు
ఏదో ఒక ఇజంతో
గింజుకుంటుంటావు
ఎవడ్ని బడితే వాణ్ని
నంజుకోవాలని చూస్తావు
నిజం చెప్పాల్సి వస్తే
తడబడతావు
ఆస్తులు కూడబెట్టాలని
అక్రమ మార్గాలలో
నడుస్తావు అవినీతి చేతికంటాక
కటకటాలపాలై కంట తడిబెడతావు
ఇలా ఎందుకు చేస్తావో తెలుసా
నువ్వు మనిషివని మర్చిపోయినందుకు
మానవత్వాన్ని మంటగలిపినందుకు అందుకే
మనసును అదుపులో పెట్టుకొని
మనిషిగా బ్రతుకు!

-షణ్ముఖశ్రీ.. 8897853339