AADIVAVRAM - Others

అమ్మ జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంకలనెత్తిన
పిల్లలను చూసినప్పుడల్లా
నీవే గుర్తుకొస్తావు
పిల్లాడి బరువు
మోయలేక
అల్లాడిన ఆ భుజానికి
ప్రేమపాశము లేపనమై
స్వాంతన...
మారాం చేస్తున్న
పిల్లాడికే ఊరడింపు
ఆ చల్లని హృదయ స్పర్శ
ఆనంద లోగిలి
అదే కదా...
మామ తాతంటూ
బాంధవ్యాలు పెనవేస్తూ
గోరుముద్దలు తినిపిస్తున్న
అమ్మ మమకారాన్ని
చూసినప్పుడల్లా
అసంకల్పితంగా నా నోరు...
సుప్రభాత సేవలో
కోవెలలుగా
నీకిష్టమైన ఆరాధన
కమలాకుచ చూచుక
కుంకుమతో నా వీనులను
తాకినప్పుడల్లా
నీ జ్ఞాపకంగా
ఇప్పటికినీ
నా అలసిన కనురెప్పలుగా
కన్నీటి పొరను కప్పుకొని
నీ ఫొటోకై తదేకంగా చూస్తూ
అశ్రువులు చెంపలుగా రాలుతూ
పడిలేస్తూ లేస్తూ పడే
ఈడులోనే
ఇల్లంతా
నిశ్శబ్ద నీరవాన్ని...
నా లేత చేతులు
ఆ చల్లని హృదయ స్పర్శ కోసం
తల్లడిల్లుతూ
బిత్తిరి చూపులుగా
పైకేసి చూస్తే
ఆకాశమంత పరచుకొని
నీ
ముగ్ధమనోహర రూపం
నాన్నా అంటూ
ఇదిగో తొందర్లో
తిరిగొస్తానంటూ
మూడింతల ప్రేమను
పంచుతూ
నాన్నా అంటూ మళ్లీ
ఎంత
కరుణామయురాలివమ్మా...
నా దేహము
ఏ చిన్న ఒరిపిడికి
గురైనా
పలుకే బంగారమైన నా నోట
పుత్తడి పలుకు
అమ్మా అమ్మాంటూ
ఆ పిలుపు
అపురూపము
అద్వితీయము
అజరామరము
ఆసూర్య చంద్ర తారార్కము!!

-హరిహరనాథ్ మడిపల్లి 9603577655