Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసిన దెల్ల మంచియని జేసితి చెయములిన్ని నాళ్లు నే
వ్రాసిన దెల్ల కావ్యమని భ్రాంతిని జెందుచు నుంటి సద్గురో
పాసన లేక యేదియును పాదును పందిరి లేని తీగయే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

కాసరమెంత జేసినను గడ్డియు గాదము నీరు చొప్ప యే
వేసపు గంగిరెద్దునకు వేడుక తిండియు పట్టు వస్తమ్రుల్
ఏ సరియెంత భాగ్యమదియే లభియించు గదమ్మ యేరికిన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!
అసమవర్తి దిక్పతియె నాతని వాహన మేమొదున్నయున్
ఈసుడు కూడా దిక్పతియె నాతని వాహనమెమొ యెద్దు సం
దీసుడటంచు యెద్దునకు యెన్నియొ పూజలు, దున్న దున్నయే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

వాసవుడైన గాని యహివల్లభుడైనను గాని ఘోర దు
ర్వాసుడు గాని బ్రహ్మయు మురారి, పురారులుగా నినీసము
ద్భాసితమైన మాయకు నిబద్ధులు కాకను దప్పదమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342