Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాసియొకర్తి రాజునకు దారుణ మారణ కారణమ్ము యా
దాసియె రామచంద్రునకు దండక కానన వాసకారణం
బేసమయమ్మునందు మరియెవ్వరొ దేనికి మూల కారకుల్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

భూసురుడై జనించి పరిపూర్ణము వేదములన్ బఠించి కై
లాస గిరీంద్రమున్ భుజ బలమ్ము నగ్రక్క దలించి గర్వ దు
ర్వాసితుడైన హేతువున రక్కసుడాయెను రావణుండు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!
బాసలు నేర్చి లోకలు సెమాసన వేదికలెక్కి నేయుప
న్యాసములిచ్చి చప్పటుల కచ్చెరువందుచు నా విలాస వి
న్యాస ఘనమ్ములన్న భ్రమలందితి నిన్ను స్మరింపనైతి నే
వాసర వాసినీ ప్రధిత వాగ్వరదాయిని ! శ్రీ సరస్వతీ!

ఈ సువిశాల విశ్వమది యెట్టెదుటన్ గనుపట్ట జేయు నీ
భాసుర శక్తి తత్త్వమును భావన జేసి గ్రసించు లోపలున్
అసురి మాయ గ్రమ్ముకొని యైహిక మోహములందు ముంచు నే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342