Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాసగుణమ్ము లేని బహుదాన గణమ్ము నిరర్థకమ్ము వి
శ్వాసము గల్గి యుండియును భక్తి పరత్వము లేని పూజలున్
దోసము , మూర్ఖతత్వమగు దుష్ఫల దాయి గదమ్మ రుూశ్వరీ
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

దోసిలు లొగ్గి భక్తి గుణ ద్రోహలులై బహు వత్సరమ్ములా
వాసము జేయు వారలు భవత్కరుణాలవలేశ సిద్ధికై
ఏ సమయమ్ము నందెటుల యేరికి యేమి యనుగ్రహింతువో
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!
కేసరమున్న పుష్పములకే మధుపమ్ముల జోల పాట వి
ద్యాసుమగంధమున్న విబుధావలికేమరియాద మన్ననల్
శ్రీ సముపేతు సన్నిధి కె జేరుదు రెందరో స్తోత్ర పాఠకుల్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

దోసము తామసాగ్రహము దుస్సహమై యపకీర్తి దు
ర్వాసుడు తాపసీంద్రుడుగ వాసిని గాంచియు యంబరీషు పై
రోసము బూని భంగపడి రొప్పడె యార్తిని మూడులోకముల్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని శ్రీసరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342