Others

మార్గదర్శి మారుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామనామము ఎక్కడ జపిస్తుం టారో అక్కడ చిరంజీవి ఆంజనేయుడు పద్మాసనారూఢుడై కొలువుతీరి ఉంటాడు. రామకథాగానం చేస్తున్న ప్రతిచోటా హనుమంతునికి ఒక ఉచితాసనం ఏర్పాటుచేయడం మన సంప్రదాయం. కారణజన్ముడు చిరంజీవి హనుమ. సప్త సముద్ర లంఘనాశక్తిని శివుడు, నీటినుంచి హానిలేని వరాన్ని వరుణుడు, అగ్నిచే హానిలేని వరాన్ని అగ్ని, మృత్యుజయాన్ని యముడు, నిత్య సంతోషాన్ని కుబేరుడు, సకల వాస్తు నిర్మాణ జ్ఞానాన్ని విశ్వకర్మ, కామజయాన్ని కామదేవుడు, అష్టసిద్ధులను సూర్యుడు ఏకకాలంలో హనుమంతునికి ఒకానొక సందర్భంలో ప్రదానం చేశారు.
మనసుకంటే వేగవంతమైన మనోజవుడు. వాయు సమాన చలన శక్తిగల మారుత తుల్యవేగుడు. ఫలాపేక్ష రహిత భక్తితత్పరుడు అంజనీసుతుడు. కార్యసాధకులకు మార్గదర్శి. ప్రభు భక్తి పరాయణుడు కేసరి నందనుడు. త్యాగానికి మారుపేరు హనుమ. అతులిత బలధాముడు. జితేంద్రియుడు. క్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించగల బుద్ధిశాలి. వాయుదేవుని వరపుత్రుడు కావున వాతాత్మజుడు.
ఆత్మస్వరూపమైన సీతామాతను కనుగొన్న శ్రీరామదూత. బంగారు వర్ణముగల దేహము కావున హేమశైలాభదేహుడన్న ఖ్యాతి నొందాడు. రావణునికి హితబోధ చేసిన మహాజ్ఞాని.ఎన్నో కష్టాలు, ఆటంకాలకోర్చి సీతానే్వషణలో విజ యం పొందిన సంకట మోచనుడు. ప్రియభాషణతో అందరినీ మెప్పించిన నవవ్యాకరణ పండితుడు. ఋగ్వేదములో వృషకపి. రామాయణంలో మహాకపి. ద్వాపర యుగంలో కపిభ్రాత మరియు విజయకేతుడు. కలియుగంలో అభయాంజనేయునిగా హిమాలయములలో కొలువైన చిరంజీవి ఆంజ నేయుడు. తలచినంతనే భయమును పటా పంచలు చేసి ఎనలేని ధైర్యమును ప్రసాదించు మహిమాన్వితుడని అందరూ కొనియాడు తుంటారు. దుస్సాధ్యమైన కార్యసిద్ధి కలగాలంటే ముందు హనుమను తలుచుకుని అడుగు వేయాలి. హనుమంతునికి మనపై దయ కలగాలంటే ముందుగా మనం రామభక్తులమై ఉంటే చాలు. ఒకసారి అంగదుడు విపత్గకర సమయాన్ని అనుకూలంగా మార్చుకోలేక ప్రాణాలను వదిలి వేస్తాననుకొంటుంటే హనుమంతుడు అంగదుని దగ్గర కూర్చుని ఆయనలోని అష్ట సద్గుణాలను, పదునాలుగు అద్భుత లక్షణాలను గుర్తుచేసి కార్యోన్ముఖునిచేశాడు. సీతమ్మ కూడా రాముడు రావడం లేదని ప్రాణత్యాగం చేద్దామనుకొంటూ ఉంటే ఆమెకు రాముడు తప్పక వస్తాడు నిన్ను ఏలుకుంటాడన్న విశ్వాసాన్ని కలుగచేసిన ధీశాలి హనుమ.
సీతమ్మను దూరం చేసుకొని ఆవేదన చెందే రామునికి, తన భార్యను దూరం చేసుకొని తన అన్నచేత అనేక కష్టాలు పడే సుగ్రీవునితో సఖ్యం ఏర్పరిచిన వివేకశాలి హనుమ. సముద్ర లంఘనం చేసి సీతమ్మ జాడ తెలుసుకొని రామన్నతో వానరవీరులను జతచేసి లంకపై దండెత్తి రామవిజయానికి కారణమైన అభ యంకరుడు ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడిని మార్గదర్శిగా భావించి నడవడిని తీర్చి దిద్దుకుంటే చాలు వారు అజేయులై నిలుస్తారు అనడంలో అతిశయం లేదు. ప్రతిరోజు హనుమాన్ చాలిసీ లేదా హనుమంతుని దండకాన్ని చదువుకున్న విద్యార్థులకు సకల విద్యలు లభ్యమవుతాయ.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి