Others

మధురం మధురం రామశబ్దం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగంలోని రాముడిని నేడు కూడా సర్వ వేళలయందు స్మరిస్తూ ఉంటారు. ఈ రామశబ్దం కేవలం భారతదేశంలోనో, అందు లో తెలుగునాటలోనే కాదు ప్రపంచం అంతా ఆ రామశబ్దం వినిపిస్తూ ఉంటుంది. రామ రాజ్యం కావాలని కలలు కనేవారు ఉంటారు. పాలకుల చేతికి రాజ్యం లేదా రాష్ట్రం దక్కగానే రామరాజ్యాన్ని నా పాలన లో తెస్తాను అని ప్రజలకు చెప్పే పాలకులు ఉంటారు. ప్రతి వ్యక్తీ తాను రాముడిలాగా ధర్మాచరణను చేస్తానని చెబుతాడు.
అసలు ఎందుకింతగా రాముడు ఇంతమంది ని ఆకర్షిస్తున్నాడు. ఆకర్షించే గుణం ఉన్నది కృష్ణుడికి కాని రాముడికి కాదుకదా. రాముడు అంటే ఆనందమే కదా. మరి ఆనందమూ ఆకర్షక గుణమున్నదే కదా. దాని వల్లే యుగాలు మారినా రామశబ్దం మీద ప్రీతి తగ్గటం లేదు. అంతేకాదు ధర్మమే మూర్తిగా రూపొందిన వాడు రాముడు కనుక రామశబ్దం నిత్యనూతనమై నిలుస్తుంది. రామాయణం పారాయణ చేసేవారు ప్రతి నలుగురిలో ఇద్దరు ఉంటారంటారు. కనుకనే రాముణ్ణి చూచి నాడే కాదు నేడు కూడా ప్రేరణ పొందేవాళ్లే ఎక్కువ.‘‘ రాతిని నాతిని చేసిన ఓ రామా నా బతుకుతెరువీ నావ.. దీన్ని మార్చకయ్యా రామా’’ అని గుహుని లాగా భయపడుతున్నట్టు కనిపించినా .. శబరి లాగా రాముని రూపాన్ని చూడాలను కొనేవారు ఉంటూనే ఉంటారు.
వారి కన్నా ‘‘శరణు శరణు... నీవే తప్ప ఇతఃపరం బెరుగ రామా... రక్ష రక్ష ’’ అంటూ వచ్చిన విభీషణుని లాంటివారు చాలామందే ఉంటారు. రాముడు అంటే అధర్మపరులకు ముచ్చెమటలు పడుతాయ. రామ లోని ‘‘ర’’ అనే అక్షరం వింటేనే నాకు మృత్యు భయం పడుతుంది అనే మారీచుడిలాంటి వాళ్లు కలియుగంలో ఉన్నారు. ఈమారీచులున్నా ఫర్వాలేదు కానీ రావణాసురుని లాంటివాళ్లు కలియుగంలో ఎక్కువగా తారసపడు తున్నారు. రాముని గురించి తెలుసు కానీ మేము ఇట్లానే జీవిస్తాం అధర్మమే చేస్తాం అనేవాళ్లుఇపుడు పుడుతున్నారు. ఇలాంటి వారిని నిర్మూలించాలంటే వారితో యుద్ధం చేయడం కన్నా వదలక రామనామం పలుకుతుంటే రాముడు ఆచరించి ధర్మానే్న ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మమూ, ఆ నామము శత్రువులను మట్టికరిపిస్తుంది.
కనుక సదా రామనామాన్ని జపించాలి. ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి.
ప్రతివారు ధర్మమూర్తులుగా నిలవాలి. హైందవజాతి పునర్వైభవాన్ని పున్మర్నించాలి. సర్వం విష్ణుమయం జగత్ అనే మనం మానవులందరినీ విష్ణుస్వరూపులుగా గుర్తించాలి. ఎదుటి వారి సంపద ఎంతెత్తునున్నా కన్న తల్లి, కన్ననేలతల్లి నే మిన్న అని చెప్పే రాముణ్ణి కలనైనా మరవరాదు. జననీ జన్మభూమిశ్చఅనే రామునికి మనం వారుసులుగా నిలవాల్సిన బాధ్యతను ప్రతివారు తలకెత్తుకోవాలి.
ఉన్నదానితో తృప్తి పడాలి. పరుల సొమ్మును పాముతో సమానంగా చూడాలి. ధర్మం ప్రకారం ఎంత సంపద ఒనకూడు తుందో దానినే తీసుకోవాలి. తృప్తిని పెంచు కోవాలి. తృప్తి లేని జీవికి సప్తసముద్రాలు ఇచ్చి నా అసంతృప్తగా నే ఉంటాడు కనుక తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. సర్వప్రాణికోటి రాముని రూపులుగా భావించాలి. దాంపత్యధర్మానికి, భాతృప్రేమకు, స్నేహ ధర్మానికి తార్కాణంగా నిలిచినా నాటి రాముణ్ణి ప్రతివారు తమ భావన లో అనుసంధానం చేసుకోవాలి. రామునికి మారురూపులుగా తయారుకావాలి. ఎన్ని కష్టాలు కన్నీళ్లు వచ్చినా వారు ధర్మాన్ని తప్పకూడదు. అపుడే రామరాజ్యం కలియుగం లోను విలసిల్లుతుంది.

- జి. కృష్ణమూర్తి