Others

‘మనసే మార్గదర్శి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుంటే మార్గముందని నానుడి. అంటే ఏ పనైనా చేయాలనే మనసుంటే- ఆ పని ఎలా పూర్తిచేయాలన్న మార్గం అదే చూపుతుందని దాని తాత్పర్యం. కనుక ‘మనసే’ అన్ని క్రియాశీలక చర్యలకు మూలం. కానీ, విచిత్రమేమిటంటే ఆ ‘మనసు’ బహు చంచలమైనది. పూదోటలో ఎగిరే సీతాకోక చిలుకలా నిరంతరం అలౌకిక విషయ విహారం చేస్తూనే ఉంటుంది. ఆశల ఊయలలో డోలాయమానంగా ఊగుతూనే ఉంటుంది. కోరికల కోటలపై చేతకాని కేతనాన్ని ఎగురవేస్తునే- జీవితాన్ని దుర్భరంగా- దుఃఖ బాజనంగా మార్చుకుని- నిరాశావాదమనే నిప్పులో- అత్యాశ అనే ఆజ్యాన్ని పోస్తూ నిరంతరం ఆనందానికి దూరవౌతుంటుంది. ఇదంతా ఏ ఒక్కరి విషయంలోనో కాదు, ఇంచుమించు మనందరి విషయాల్లోనూ రోజూ జరిగే నిత్యకృత్యమే! అందుకే మనసును పరమ పదిలంగా- పనికొచ్చే పనులవైపుకే మళ్లిస్తూ జీవితాన్ని విజయపధంలో నడిపించుకోవాలి. కాలానుగుణమైన మార్పులతో-కాలాతీతం కాని తీర్పులతో సుందర భవిష్యాన్ని నిర్మించుకోవాలి. అందరూ మనని చూసి అసూయపడేంత ఎత్తుకు ఎదగాలి! ఏది ఏమైనా ఇదంతా మన చేతిలోని-చేతల్లోని పనే. మనస్సు సామాన్యంగా రెండుమార్గాల గుండా క్రియలు చేపడుతుంది. ఒకటి మంచిమార్గం రెండోది చెడు మార్గం. కానీ విచిత్రంగా మానవుడి మనసు చెడువైపు ఆకర్షింపబడినంత తొందరగా మంచి వైపు మళ్లదు! కాబట్టి చెడువైపుకు లాగుతున్న మనసును- మంచి మార్గంవైపునకు మళ్లించే పనిచేయాలి. అది చెప్పినంత సులభం కాదు కనుకనే మనందరి జీవితాల్లో ఇన్ని తిప్పలు- ఇబ్బందులు! ఈ సుడులన్నీ దాటుకొని రావాలంటే- మనసును ఎల్లపుడూ మంచి మార్గవైపే మళ్లించే ప్రయత్నం చేయాలి. అభ్యాసంతోనే అన్నీ సాధ్యపడతాయి కనుక- మన దైనందిన జీవితంలో అటువంటి అభ్యాసాన్ని అలవరుచుకోవడం అన్నింటా అనివార్యం. ఇంక మనోనిగ్రహం మానవులందరికీ అత్యవసరమయిన దినసరి దినుసు. అది లేనిచో ఇంద్రియ నిగ్రహం సాధ్యపడదు. సకల పాప కార్యాలకు ఇంద్రియాలే మూలం కనుక-ఆ దిశగా జీవితానికి పరిధులు- పరిమితులూ విధించుకుంటే ప్రతి మనిషీ లోకోపకారం చేసినట్లే! కనుక విజ్ఞత పొందాలంటే, మానవుడు తన మనసులోని దోషాలను గ్రహించి వాటిని వీలైనంతవరకూ తొలగించుకుని, వాటి స్థానంలో సాధ్యమైనన్ని సద్గుణాలను పెంపొందించుకుని అనుక్షణం ఇంద్రియ నిగ్రహంతో మనసును జయించే ప్రయత్నంచేస్తూ ఉండాలి. ఎప్పుడూ మనసు చెప్పినట్లు మనం చేయడం కాకుండా, ‘మనం’చెప్పినట్లు ‘మనసు’ వినేలా మార్చుకుంటే మన జీవితం నవ్వుల నావలా, పువ్వుల పడవలా హాయిగా ప్రశాంతమైన మానస సరోవరంలో ప్రయాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనసనే మట్టిముద్దను- మనం ఏ రూపంకావాలో ఆ రూపంగా మార్చుకుంటే- నియంత్రణకు వీలుకల్గుతుంది. మనసుకు మార్గదర్శి వేరెవరో కాదు- మన మనోబలమే! వేదనకైనా- వేడుకకైనా ఆ మనసే మూల కేంద్రం. మంచి-చెడుల నిర్ణయాత్మక నిర్దేశం కూడా జరిగేది ఆ ప్రధాన కేంద్రంలోనే! కనుకనే అనుభవజ్ఞులైన మన పూర్వీకులు ‘యద్భావం తద్భవతి’అని సూత్రీకరించారు. అంటే మన మనసులో భావాలను అనుసరించే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని దాని భావన! అందుకే ఎప్పుడూ శుభం జరుగుతుందని భావించాలి. ఆ శుభ సంకల్పంతోనే ప్రతి పనీ ఆరంభించాలి. విధినైనా ఎదిరించే మనస్థైర్యం మనదైతే విధిరాతను కూడా మార్చే శక్తి మన మనసుకు అలవడుతుంది! అటువంటి మంచి అలవాటుకు మనమంతా నేటినుంచే అలవాటు పడదామా? సర్వేజనో సుఖినోభవంతు!!

- మరువాడ భానుమూర్తి 8008567895