Others

అప్పుడిది పుణ్యకార్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంభూవ్యం సదపత్యవ ద్వర కరాద్రక్ష్యంచ సుక్షేత్రవత్
సంశోధ్యం వ్రణితాంగవత్ ప్రతి దినం వీక్ష్యంచ సన్మిత్రవత్
బధ్యం వధ్యవ దశ్లధం దృఢ గుణైః స్మర్యం హరే ర్నామవత్
నైవం సీదతి పుస్తకం ఖలు కదాప్యేత ద్గురుణాంవచః
పూర్వులు తాటాకు పుస్తక రక్షణ గూర్చి చెప్పిన ఈ శ్లోకం మానవుని నిత్య జీవనంలోని జాగరూకత వలెనే అనిపిస్తుంది. పుస్తకాన్ని నీ సంతతి వలె భూషించు, పరహస్త గతం కాకుండా పొలాన్ని రక్షించినట్లు దీన్ని రక్షించు, శరీరంలో గాయాలైతే శుద్ధి చేసి నట్లే దీన్ని జాగ్రత్తగా చూడు, మిత్రునివలె ప్రతి దినమూ సందర్శించు , పత్రాలను చెదరగొట్ట కుండా గట్టి త్రాళ్లతో బంధించు , దైవనామం వలె నిరంతరం వీటిని స్మరించు అప్పుడే గ్రంథం నిలుస్తుందనేది ఈ శ్లోకానికి అర్థం.
తాళపత్ర గ్రంథాలు పూర్వ సంస్కృతిని తెలుసుకోవడానికి కొన్నాళ్ల క్రితం వరకు వాహికలుగా ఉండేవి. అప్పటికాలంలో తాళపత్రాలను సేకరించడం, వాటిని భద్రపర్చడం, వాటిపైన లిఖించడానికి అనువుగా మార్చడం అనేది గృహపరిశ్రమగా కూడా ఉండేది. తాటిచెట్లను పెంచడం ఒక పుణ్యకార్యంగా ఆరోజుల్లో భావించేవారు. ఈ వృక్షాన్ని వేటూరి వారు ఆంధ్రుల కల్పవృక్షమని కూడా కీర్తించారు.
ఈనాడు పేపర్ సిద్ధం చేయడానికి యూకలిప్టస్ మొదలైన చెట్లు పెంచిన విధముగనే పూర్వం తాటి వనాలను పెంచి, ఇదొక పుణ్య కార్యముగా భావించిన వారున్నారు. దాదాపు 700 సంవత్సరాల నాటిదైన పిఠాపుర శాసనములో- ‘‘నాలుగు లక్షలున్నా అరవై వేలు తాళ్లు నాటించెను. ఇటువంటి ప్రతిష్టలు విష్ణు ప్రతిష్ఠలున్ను చేయించిన పుణ్యపురుషుడు గాక వాసిరెడ్డి పోతి నేందు జేయును. దేవేంద్రుడవును. - మంగళ మహాశ్రీ’’ అని ఉంది. మరియొక శాసనములో తల్లి ధరణి మొదలుగాన ఈ తాటి యెవ్వరు నాంటిరి, వారు భూమి ప్రజలకు బుద్ధిన్ని, మతి విశేషమున్ను, ధర్మమున్ను చిరుకుదురుగాను.. అని తెల్పి.. ‘‘రుూ తాటాకులనే పంచాంగములు,పురాణములు, శాస్తమ్రులు, ధర్మకర్తలు వ్రాసి చదువుంగాను అందున్నుండుంగాని బుద్ధిమాటలం జెప్పరాదు. గాన సకల ధర్మాలన్ను తాటి వృక్షమే మూలము’’ అని ఉంది. ఇట్లాంటి తాటి చెట్టు ఉపయోగాలను చూసి అవిభావితరాలకు తెలియాలని అప్పటివారు శాసనాలు కూడా వేయంచారు.
దేనిని వ్రాయడానికైనా పనికి వచ్చే ఈ తాటి చెట్లకు నీటివసతి అవసరం ఉండేదికాదు. మెట్ట ప్రాంతంలో కూడా ఏపుగా పెరుగేవి. వృక్షశాస్త్ర ప్రకారమిది ‘పామె’ జాతి ఏకదళ బీజ కుటుంబానికి చెందినది. సమశీతోష్ణ ప్రదేశములలో ఇవి అభివృద్ధి చెందుతాయి. వృక్షజాతులలో పెద్దవి - బరువైనవది ఆకులు గల విభాగ వృక్షము తాటిఒకటి. ఆకు మొదట మట్ట దృఢముగా నుండి నార కలిగి యుండి బరువును సహించడానికి వీలుగా ఉండేవి. వృక్ష శాస్తవ్రేత్తలు దీనిని ‘‘పాలికార్పిక్’’ జాతిగా నిర్థారించినారు. వీని పత్రములతో మనవారు (పుస్తకాన్ని) గ్రంథాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రతి తాటియాకు లేఖనోచితం కాదు. గ్రంథాలకు వాడే వెడల్పయిన ఆకుల కొరకు ప్రత్యేకంగా ఈ చెట్లను పెంచేవారు.
వీటిపైన వ్రాసేవారుకూడా ప్రత్యేకంగా ఉండేవారు. కొందరు కవులు వారే వారి రచనలు లిఖించుకునేవారు. మరికొందరు వ్రాయసగాండ్లను పెట్టి మరీ వ్రాయంచేవారు. ఈ తాటిఆకుల పైన వ్రాసేవారు తర్వాతి కాలంలో వారి ఇండ్లపేరు కూడా వ్రాయసగాండ్లు అన్న ఖ్యాతిని తెచ్చుకున్నారు.
ఇపుడు వీటిఅవసరం లేదు. కానీ నేడు సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార్యవ్యవహారాలను అసలు వేటినైనా తరతరాలకు అందించాలంటే కాగితాలే ఒక్కటే మార్గం కాదు ఎన్నో రకాల వసతులున్నాయ.. కానీ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే తర్వాతి తరాలకు మనం మన వారసత్వ సంపదను ఇచ్చేందుకు వీలుంటుంది.

- డా. ఎ. రాజమల్లమ్మ