AADIVAVRAM - Others

చిక్కెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇంట్లో
రేకుల కింద
ఓ ఇనుప చువ్వ
రెండువైపులా
వంచబడి
వేలాడుతూ

ఏళ్లుగా
ఎన్నో జ్ఞాపకాలను
మధురమైనా విషాదమైనా
తనలో భద్రంగా దాచుకుంది
తోకలేని పిట్టలెన్నో
ఎగిరి ఎగిరి వచ్చి
అలసిపోయి అమ్మయ్యనుకుంటూ
మా చేతుల్లో వాలి
మా సంబురాలను
మా ఆనందభాష్పాలను చవిచూచి
మా కన్నీళ్ల వెనుక ఆంతర్యాలను పసిగట్టి
ఆ ఇనుపచువ్వ వైపే పోయేవి
మా మదిలో
తారీఖులను వెనక్కి
తీసుకెళ్లాలన్నా
సంతోషాలను
నెమరేసుకోవాలన్నా
ఆ వేలాడే చువ్వపై
వాలిన పిట్టలు
మా ఒళ్లో సేదతీరేవి
రేకుల కింద
ఇనుపచువ్వయే
ఉత్తరాల చిక్కెం

-గిరిప్రసాద్ చెలమల్లు 94933 88201