AADIVAVRAM - Others

యుద్ధం తరువాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో ఒకరు మొదలుపెట్టాక
యుద్ధం వొక ముగింపులేని కథనే...

బలాలు.. బలగాలన్నీ
ఆక్రమించే కోరికకు దాసోహమైతే..
నెత్తుటి నెగళ్లలో చలి కాచుకుంటాయి

వేటకత్తులు మర ఫిరంగుల విధ్వంసానికి
తెగిన తాళిలు, చెరిగిన నుదుటి బొట్లే సాక్ష్యం

పచ్చని నేలకి రక్త్భాషేకం జరుగుతుంటే
ప్రతీ ఇంట్లో విషాద రాగాలు పలుకుతాయి

ప్రాణం కంటే పగనే ముఖ్యమనుకునే
మూర్ఖత్వం బుసలు కొడతానే ఉంది

యుద్ధం కోరుకునే సమూహాలెప్పుడూ
భయం నీడల్లోనే చస్తూ బతుకుతుంటాయి

తెగిన తలలు
తెగిన తాళులు
విరిగిన బతుకులు..

చావులో కూడా వెంటాడే భయాలు
చెదిరిన నవ్వులు..
శిథిలమైన ప్రేమలు..
ఇవే యుద్ధం తరువాతి దృశ్యాలు...

గెలిచినా ఓడినా నడిబొడ్డున నిలబడి
నీకు నీవు సమాధానం కోసం ఎదురుచూడు...

యుద్ధం వొక అవసరం కాదు,
ఛాయిస్ ఈజ్ యువర్స్...

-పుష్యమీ సాగర్ 90103 50317